రుచి

రకరకాల ‘టీ’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒత్తిడిగా అనిపించిన ప్రతిసారీ టీలు తాగేస్తుంటారు కొందరు. ఇలా టీలను తరచూ తీసుకోవడం వల్ల ఉపశమనం సంగతి అటుంచి ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ అంటున్నాయి పరిశోధనలు.. మామూలు టీల బదులుగా హెర్బల్ టీలను ఎంచుకోవడం మేలంటున్నారు నిపుణులు.
సుగంధ ద్రవ్యాలతో..
అల్లం, యాలకులు, దాల్చిన చెక్క.. వంటివాటితో చేసే టీలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దాల్చిన చెక్కతో చేసిన టీని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. అంతేకాదు శరీరంలో రక్తప్రసరణ కూడా సజావుగా జరుగుతుంది. యాలకుల టీకి కడుపునొప్పిని తగ్గించే శక్తి ఎక్కువ. ఈ టీ నోటి దుర్వాసనను కూడా అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా నెలసరి సమసయంలో ఈ టీని గోరువెచ్చగా తాగడం వల్ల కడుపునొప్పి నియంత్రణలోకి వస్తుంది.
ఆకులతో..
తులసి, పుదీన, నిమ్మగడ్డి వంటివాటితో చేసుకునే టీలు సాధారణ టీల కంటే ఎంతో మేలు. వీటిల్లోని సి విటమిన్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీనికి కాస్త అల్లం, తేనె కూడా చేరిస్తే మరింత రుచిగా ఉంటుంది. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లకు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి ఉంటుంది. ఇవి శరీరంలోని ట్రై గ్లిజరాయిడ్లను కూడా తగ్గిస్తాయి.
పూలతో..
విదేశాల్లో గ్రీన్‌తో సమానంగా ఆదరణ పొందుతున్న రకాల్లో ఫ్లోరల్ టీలు కూడా ఉన్నాయి. ఇప్పుడివి మన దగ్గరా అందుబాటులోకి వచ్చాయి. నాణ్యమైన పూలను మొదటిదశలోనే తుంచి టీలకు ఉపయోగిస్తారు. వేడినీళ్లలో వేసుకుని కాస్త తేనె, యాలకులు కలిపి తాగితే మంచి సువాసన, బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు సొంతమవుతాయి. చామంతి, బంతి, మల్లె, గులాబీ, మందార వంటి రకాలెన్నో ఇందులో ఉన్నాయి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. చక్కటి నిద్రనూ అందిస్తాయి. శరీరంలోని జీవక్రియల పనితీరును కూడా పెంచుతాయి.