రుచి

కూరగాయలతో కరకరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రమంగా ఎండలు ముదురుతున్నాయి. ఈ ఎండలు కూడా ఒకందుకు మంచిదే అంటున్నారు భోజన ప్రియులు. ఎందుకంటే వడియాలు, రకరకాల ఆవకాయలు పెట్టుకునేందుకు ఇదే మంచి సీజన్. పైగా మామిడి కాయలు, పండ్లు వచ్చేది ఈ సీజన్‌లోనే.. కమ్మటి భోజనంలోకి కరకరలాడే వడియాలు తోడుంటే ఆ తృప్తే వేరు. వడివడిగా.. వేడివేడిగా.. నోరూరించే ఆ వడియాల ఆరబోత చూద్దాం..

గోరు చిక్కుడుతో..

కావలసిన పదార్థాలు
పెసరపప్పు: పావు కిలో
గోరు చిక్కుడుకాయలు: పావు కిలో
పచ్చిమిర్చి: 100 గ్రాములు
జీలకర్ర: చెంచా
ఇంగువ: చెంచా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
పెసరపప్పును రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. ఈలోగా గోరుచిక్కుడు కాయలను పీచుతీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పెసరపప్పులోని నీటిని వడకట్టి, ఇందులో గోరు చిక్కుడు ముక్కలను కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ముద్ద, ఇంగువ, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకుని పాలిథీన్ పేపరుపై చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్య కరమైన గోరు చిక్కుడు వడియాలు రెడీ..

క్యారెట్‌తో..
కావలసిన పదార్థాలు
క్యారెట్: అరకిలో
పెసరపప్పు: రెండు కప్పులు
యాలకులు: పనె్నండు
లవంగాలు: పనె్నండు
దాల్చిన చెక్క ముక్కలు: మూడు
వెల్లుల్లి రెబ్బలు: ఆరు
జీలకర్ర: నాలుగు చెంచాలు
పచ్చిమిర్చి: 100 గ్రాములు
అల్లం తరుగు: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి. క్యారెట్‌ను బాగా కడిగి చెక్కు తీసుకుని తురుముకోవాలి. తరువాత పెసరపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెసరపిండిలో వేసి బాగా కలపాలి. దీనికి క్యారెట్ తురుము, తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుని వడియాల్లా పెట్టుకోవాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన క్యారెట్ వడియాలు రెడీ.

దోసకాయతో..

కావలసిన పదార్థాలు
దోసకాయ తురుము: రెండు కప్పులు
అటుకులు: కప్పు
జీలకర్ర: చెంచా
ఇంగువ: చెంచా
పచ్చిమిర్చి: ఆరు
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం
అటుకులను నీళ్లలో ఒకసారి వేసి కడిగి తీసేయాలి. దీనికి దోసకాయ తురుము జతచేయాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, ఉప్పులను కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ప్లాస్టిక్ కవర్‌పై ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా పెట్టుకోవాలి. వీటిని రెండు, మూడు రోజుల పాటు ఎండబెట్టాలి. అంతే ఎంతో రుచికరమైన దోసకాయ వడియాలు రెడీ..

సొరకాయతో..

కావలసిన పదార్థాలు
వండిన అన్నం:
రెండు కప్పులు
సొరకాయ గుజ్జు:
కప్పు
జీలకర్ర: చెంచా
కరివేపాకు:
చిన్న కట్ట
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
వెడల్పాటి గినె్నలో అన్నం, సొరకాయ గుజ్జు, జీలకర్ర, కరివేపాకు తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ పేపర్‌పై వడియాలుగా పెట్టుకోవాలి. వీటిని ఎండలో నాలుగు రోజులు బాగా ఎండబెట్టాలి. తరువాత గాలి చొరబడని డబ్బాలోకి తీసుకోవాలి. ఈ వడియాలు సాంబారు, రసంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

బూడిద గుమ్మడితో..

కావలసిన పదార్థాలు
బూడిద గుమ్మడికాయ:
చిన్నది ఒకటి
పొట్టు మినపప్పు: అరకిలో
పచ్చిమిర్చి: 50 గ్రాములు
ఉప్పు: తగినంత
ఇంగువ పొడి: చిన్న చెంచా
తయారుచేసే విధానం
బూడిద గుమ్మడికాయను బాగా కడిగి రాత్రిపూటే చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తరువాత ఇందులో ఉప్పు వేసి ఓ బట్టలో మూటగట్టి దానిపై బరువైన రాయిలాంటిది పెట్టాలి. ఇలా చేయడం వల్ల ముక్కల్లోని నీరంతా కారిపోతుంది. అలాగే మినపప్పు కూడా రాత్రే నానబెట్టాలి. ఉదయానే్న మినపప్పు పొట్టు తీసి నీళ్లు తక్కువగా పోసి మెత్తగా రుబ్బాలి. తరువాత మిర్చి, ఉప్పు, ఇంగువ మెత్తగా నూరి మినప్పిండిలో వేసి కలపాలి. తరువాత బూడిద గుమ్మడి ముక్కలు కూడా వేసి బాగా కలిపి కావలసిన సైజులో ప్లాస్టిక్ కవర్‌పై పెట్టుకోవాలి. బాగా ఎండిన తరువాత వీటిని ఒలిచి తిరగవేసి మళ్లీ ఎండనివ్వాలి. ఈ వడియాలు పప్పు కూరలతో తింటే చాలా బాగుంటాయి.

కావలసిన
పదార్థాలు
ఉల్లిపాయలు: అరకిలో
మినపప్పు: 100 గ్రాములు
పచ్చిమిర్చి: ఐదు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి సుమారు నాలుగు గంటలసేపు నానబెట్టాలి. తరువాత ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకోవాలి. నానబెట్టిన మినపప్పును మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి ఉల్లి తరుగును జత చేసుకుని బాగా కలపాలి. దీనిలోనే పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ప్లాస్టిక్ పేపర్‌పై వడియాలు పెట్టుకోవాలి. రెండు, మూడు రోజులు బాగా ఎండిన తరువాత గాలి చొరబడని డబ్బాలోకి తీసుకోవాలి. వీటిని వేయించుకుని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

అన్నం, టమోటాలతో..

కావలసిన పదార్థాలు
అన్నం: అరకిలో
టమోటాలు: పావు కిలో
జీలకర్ర: 100 గ్రాములు
నువ్వులు: 50 గ్రాములు
పచ్చిమిర్చి: పావుకిలో
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా టమోటా ముక్కల్ని కొత్తిమీర,

పచ్చిమిర్చిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి.
తరువాత వండిన అన్నంలో టమోటా ముక్కల మిశ్రమాన్ని కలపాలి. ప్లాస్టిక్ పేపర్‌పై ఈ మిశ్రమాన్ని బిళ్లలుగా చేత్తో వత్తుకుని ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత నూనెలో వేయించుకుంటే చాలా బాగుంటాయి.

ఉల్లిపాయలతో..

కావలసిన
పదార్థాలు
ఉల్లిపాయలు: అరకిలో
మినపప్పు: 100 గ్రాములు
పచ్చిమిర్చి: ఐదు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి సుమారు నాలుగు గంటలసేపు నానబెట్టాలి. తరువాత ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకోవాలి. నానబెట్టిన మినపప్పును మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి ఉల్లి తరుగును జత చేసుకుని బాగా కలపాలి. దీనిలోనే పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ప్లాస్టిక్ పేపర్‌పై వడియాలు పెట్టుకోవాలి. రెండు, మూడు రోజులు బాగా ఎండిన తరువాత గాలి చొరబడని డబ్బాలోకి తీసుకోవాలి. వీటిని వేయించుకుని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటాయి.