రుచి

నోరూరించే బిస్కెట్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకైనా, పెద్దలకైనా బిస్కెట్లు అంటే ఎంతో ప్రీతి.. సాయంత్రం వేళల్లో పాలతో కానీ, టీతో కానీ రెండు బిస్కెట్లు తింటే ఆ మజాయే వేరు. అవి ఇంట్లో చేసుకున్న బిస్కెట్లయితే మరింత మజా, ఆరోగ్యం కూడా.. మరి ఈ బిస్కెట్లను
ఇంట్లో ఎలా తయారుచేయాలో తెలుసుకుందామా..
*
టూటీ ఫ్రూటీ కుకీస్
కావలసిన పదార్థాలు
వెన్న: కప్పు
బేకింగ్ పౌడర్: చెంచా
యాలకుల పొడి: చెంచా
పాలపొడి: అరకప్పు
కస్టర్డ్ పొడి: అరకప్పు
మైదా: రెండు కప్పులు
టూటీ ఫ్రూటీ ముక్కలు: అరకప్పు
జీడిపప్పు పలుకులు: రెండు చెంచాలు
బాదంపప్పు పలుకులు: రెండు చెంచాలు
ఎండుద్రాక్ష: రెండు చెంచాలు
పంచదార పొడి: ఒకటిన్నర కప్పు
పైనాపిల్ ఎసెన్స్: చెంచా నీళ్లు: అరకప్పు
తయారుచేసే విధానం
ముందుగా ఓ గినె్నలో టూటీఫ్రూటీ పలుకులు, జీడిపప్పు, బాదంపప్పు పలుకులు, ఎండుద్రాక్ష, మైదా, యాలకుల పొడి, పాలపొడి, కస్టర్డ్ పొడి, బేకింగ్ పొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గినె్నలో వెన్న, పంచదార పొడి, పైనాపిల్ ఎసెన్స్, నీళ్లు పోసి బాగా కలపాలి. దీనిలో ముందుగా తయారుచేసి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అంతటినీ చపాతీలా ఒత్తుకుని మనకు నచ్చిన ఆకారంలో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కుకీస్‌ను ఓవెన్‌లో 180 డిగ్రీల వద్ద పదిహేను నిముషాల పాటు బేక్ చేసుకుంటే టూటీ ఫ్రూటీ కుకీస్ సిద్ధమైనట్లే..
*
చాయ్ కుకీస్
కావలసిన పదార్థాలు
మైదా: అరకిలో
పంచదార పొడి: పావుకిలో
వెన్న: పావుకిలో
కోడిగుడ్లు: ఆరు
వంటసోడా: చిటికెడు
యాలకులపొడి: అరచెంచా
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
ఒక గినె్నలో కోడిగుడ్లను తీసుకుని బాగా గిలక్కొట్టాలి. ఇందులో పంచదార పొడి, వెన్న వేసి బాగా కలపాలి. ఆ తరువాత యాలకుల పొడి, వంటసోడా వేయాలి. చివరిగా మైదా కూడా కలిపితే ఇది గట్టిగా చపాతీ ముద్దలా అవుతుంది. ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉంటే కొన్ని పాలు కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పిండిని అరగంటపాటు నాననివ్వాలి. ఆ తరువాత మరోసారి కలిపి కొంచెం మందంగా చపాతీలా ఒత్తుకుని చిన్న మూతతో కట్ చేస్తే బిస్కెట్లలా తయారవుతాయి. ఇలా చేసుకున్న వాటిని వేడినూనెలో ఎర్రగా వేయించాలి. అయితే మంట తక్కువగా ఉంటేనే ఈ బిస్కెట్లు మాడకుండా దోరగా వేయించినట్లు వస్తాయి. నూనె వద్దనుకుంటే ఓవెన్‌లో బేక్ చేసుకోవచ్చు.
*
తెకువా కుకీస్
కావలసిన పదార్థాలు
ముడి గోధుమపిండి: అరకిలో
డ్రై నట్స్: 100 గ్రాములు
ఎండుద్రాక్ష: రెండు చెంచాలు
వెన్న: నాలుగు చెంచాలు
బెల్లం తురుము: కప్పు
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
ఒక గినె్నలో పిండి వేసి సన్నగా తరిగిన నట్స్ వేయాలి. తరువాత వెన్న, ఎండుద్రాక్ష వేసి కలిపాక కరిగించిన బెల్లం వేసి కలపాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి కలిపి ఉండలుగా చేసుకుని గుండ్రని బిళ్ళల్లా ఒత్తుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి. ఇవి పిల్లలకు ఎంతో బలాన్నిస్తాయి.
*
కొబ్బరితో..
కావలసిన పదార్థాలు
కొబ్బరి తురుము: రెండు కప్పులు
పంచదార పొడి: రెండు కప్పులు
పాలు: కప్పు
వెన్న: నాలుగు చెంచాలు
జీడిపప్పుపొడి: పెద్ద చెంచా
గులాబీ ఎసెన్స్: అరచెంచా
తయారుచేసే విధానం
బాణలిలో రెండు చెంచాల వెన్న, కొబ్బరి తురుము, పంచదార పొడి, పాలు, జీడిపప్పు పొడి తీసుకుని స్టవ్‌పై ఉంచాలి. మంట తగ్గించి మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పంచదార కరిగి మిశ్రమం దగ్గరపడేవరకూ ఉంచాలి. ఆ తరువాత మిగిలిన వెన్న, గులాబీ ఎసెన్సు వేసి మరోసారి కలపాలి. రెండు, మూడు నిముషాలు అయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక బిస్కెట్లలా కోసుకుంటే సరిపోతుంది. ఇవి నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి.
*
పాలతో...
కావలసిన పదార్థాలు
మైదా: పావుకిలో
బేకింగ్ పౌడర్: ఒక చెంచా
బేకింగ్ సోడా: పావు చెంచా
మిల్క్ పౌడర్: మూడు చెంచాలు
పాలు: అర లీటర్
యాలుకల పొడి: అర చెంచా
పంచదార: 50 గ్రాములు
తయారుచేసే విధానం
ముందుగా పాలను కాచి చల్లార్చుకోవాలి. తరువాత బేసిన్‌లో మైదా, పాలపొడి, బేకింగ్ పొడి, సోడా వేసి చల్లారిన పాలతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది చపాతీ ముద్దలా తయారవుతుంది. దీనిపై మూత పెట్టి పది నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకుని నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నూనెలో నుండి తీసేయాలి. ఒక మందపాటి గినె్నలో పాలు, పంచదార, యాలుకల పొడి వేసి బాగా మరగనిచ్చి కొంచెం తగ్గాక తయారైన బిస్కెట్లను వేసుకోవాలి. వీటిని మూడు గంటల పాటు నాననివ్వాలి. తర్వాత సెర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుని పైన టూటీఫ్రూటీ వేస్కోవాలి. అంతే ఎంతో రుచికరమైన మిల్క్ కుకీస్ తయారు. పాలతో పాటు కండెన్స్ మిల్క్ కూడా వేస్తే మరికొంచెం క్రీమీగా ఉండి, పిల్లలు ఇష్టంగా తింటారు.
*
చాక్లెట్, ఓట్‌మీల్ కుకీస్
కావలసిన పదార్థాలు
పంచదార: రెండు కప్పులు
పాలు: అరకప్పు
బటర్: రెండు చెంచాలు
కోకోపొడి: నాలుగు చెంచాలు
సాల్టెడ్ పీనట్ బటర్: అరకప్పు
ఓట్‌మీల్: మూడు కప్పులు
తయారుచేసే విధానం
ఒక పాత్రలో పంచదార, పాలు, బటర్, కోకోపొడి వేసి బాగా కలిపి స్టవ్‌పై ఉంచి, మంట బాగా తగ్గించాలి. ఈ పాలు బాగా మరుగుతుండగా దించేయాలి. పాలు చల్లారాక పీనట్ బటర్ జతచేసి బాగా కలపాలి. దీనిలోనే ఓట్స్ వేసి మరోసారి కలపాలి. తరువాత ప్లేట్‌కు బటర్ రాసి, ఆ ప్లేట్‌లో ఈ మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో బాల్స్‌లా వరుసగా పేర్చి, సుమారు ఇరవై నిముషాలు అవెన్‌లో ఉంచి తీసి చల్లారనివ్వాలి. అంతే పిల్లలు ఎంతో ఇష్టపడే, ఆరోగ్యాన్నిచ్చే చాక్లెట్, ఓట్‌మీల్ కుకీస్ రెడీ. వీటిని ఎయిర్‌టైట్ కంటెయినర్‌లో నిల్వ చేసుకోవాలి.