రుచి

వేసవిలో ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని పదిలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సీజన్‌లో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ముఖ్యం నీరు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటుంటే శరీరం నిర్జలీకరణ కాకుండా ఉంటుంది. అలాగే మసాలా ఆహారపదార్థాలను, వేడిచేసే ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల కడుపులో మంట వంటివి వస్తాయి. పైగా నీటిని తక్కువ తీసుకుంటూ, ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అందుకని వేసవిలో తేలిగ్గా జీర్ణమై, శరీరం నిర్జలీకరణ జరగకుండా ఉండే ఆహార పదార్థాలను ఒకసారి చూద్దాం.
* పుచ్చకాయ: ఇందులో 80 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
* కాల్చిన కూరగాయలు: ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరగాయలను కాల్చి.. ఎండలో నుంచి ఇంటికి రాగానే తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎండతో వచ్చే చర్మవ్యాధుల నుంచి రక్షిస్తాయి.
* సలాడ్స్: వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్‌ను తయారుచేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు.
* సూప్స్: దోసకాయ వంటివాటితో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది.
* హోల్‌గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్నలు, మొలకెత్తిన పెసలు, శనగలు, కూరముక్కలు.. వంటివాటిని కలిపి తీసుకుంటే మంచిది. అలాగే మొలకెత్తిన గింజలు, కొన్ని బీన్స్, తరిగిన కూరముక్కలు, పండ్లతో కలిపి సలాడ్‌లా తీసుకుంటే కాల్షియం, ప్రొటీన్లు ఎక్కువశాతం అందుతాయి. ఇందులో తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన కూరలతో కలపడం వల్ల కాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు.
* పానీయాలు: వేసవిలో తియ్యగా, చిక్కగా ఉండే కాఫీ, టీ, సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకోవడం చూస్తాం. వీటిలో కేలరీలు ఎక్కువ. ఎటువంటి ద్రవపదార్థాన్ని తీసుకున్నా తాత్కాలిక ఉపశమనమే.. అందువల్ల మజ్జిగ, లస్సీలను తాగాలి. ఇందులో కొవ్వు లేని పాలు వాడాలి.
* పండ్లు: చిక్కగా, మందంగా ఉండే డెజర్ట్స్‌కు బదులుగా పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకలి వేసినప్పుడు రకరకాల పండ్లు, బెర్రీలు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవాలి.
* ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు అందుతాయి. చల్లని కీరకాయను తినడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది.
* వేసవిలో లభించే మామిడి పండ్లు తరచుగా తినాలి. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి.
* వీటన్నింటితో పాటు అక్రోట్లను తీసుకోవాలి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. మాంసాహారులైతే చేపలను ఎక్కువగా తినడం మంచిది.
* ఉదయం పూట ఓట్స్ తినడం వల్ల శరీరానికి ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువగా అందుతాయి.
* తృణధాన్యాలు: పొట్టుతీయని పప్పు ధానాన్యలు, గింజలను తీసుకుంటే చాలామంచిది.
* నూనె పదార్థాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల వేసవిలో జంక్‌ఫుడ్‌ని, వేయించిన పదార్థాలను వాడటం మానేయాలి.
* ఎరుపు, ఆరంజ్, పసుపు రంగుల్లో ఉన్న కూరలైన గుమ్మడి, బంగాళాదుంప, చిలగడదుంప, బెల్‌పెపర్.. వంటివాటిలో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
* నీరు: దాహాన్ని తీర్చడానికి నీటిని మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే చాలు.. శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతుంటే డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండచ్చు. *