రుచి

వెరైటీ వడియాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారి శుభకార్యాల్లో అప్పడాలు, వడియాలు, ఒరుగులు, ఊరగాయలు.. తప్పనిసరి. ఒకవైపు ఎండలు, మరోవైపు పెళ్లిళ్లు.. అయినాసరే ఇంటింటా వడియాలు, అప్పడాల సందడే.. ఇక ఆలస్యమెందుకు.. మనం కూడా పెట్టుకుందాం వెరైటీ వడియాలు.. ఎర్రటి ఎండలో సూర్యుడికి నైవేద్యం పెడదాం.. ఆయన రుచి చూసి మనకు మరింత రుచిగా అందిస్తాడు.
*
తెలగపిండితో..
కావలసిన పదార్థాలు
తెలగపిండి: అరకప్పు
పచ్చిమిర్చి: మూడు
ఉప్పు: తగినంత
వాము: రెండు చెంచాలు
వెల్లుల్లి రేకలు: ఆరు
తయారుచేసే విధానం
తెలగపిండిని తగినన్ని నీళ్లు పోసి సుమారు ఎనిమిది గంటలపాటు నానబెట్టాలి. తరువాత నీళ్లను వంచేయాలి. పచ్చిమిర్చి, ఉప్పు, వాము, వెల్లుల్లిలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని తెలగపిండికి జతచేయాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమం చపాతీపిండిలా తయారవుతుంది. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని అరచేతితో వడియాల మాదిరి ఒత్తి, నువ్వుల్లో అద్ది ఎండలో ఆరబెట్టాలి. ఇవి ఒక్కరోజు ఎండితే చాలు. వీటిని వేయించాల్సి అవసరం కూడా లేదు. పెరుగన్నంలోకానీ, మజ్జిగతో కానీ తింటే ఆ రుచే వేరు.
*
సగ్గుబియ్యంతో..

కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం: కప్పు
మంచినీళ్లు:
నాలుగు కప్పులు
పచ్చిమిర్చి: నాలుగు
జీలకర్ర: చెంచా
నువ్వులు: పావుకప్పు
తయారుచేసే విధానం
మందపాటి గినె్నలో నీళ్లుపోసి స్టవ్‌పై ఉంచాలి. బాగా మరిగిన తరువాత సగ్గుబియ్యం పోసి మంట తగ్గించాలి. మధ్యమధ్యలో గరిటతో కలుపుతూ ఓ గంటసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. సగ్గుబియ్యం పూర్తిగా కరిగిపోయినట్లుగా రంగు లేకుండా అయితే అవి ఉడికినట్లే. తరువాత పాత్రను కిందికి దించి దంచిన పచ్చిమిర్చి, ఉప్పు కలపాల. ఇప్పుడే జీలకర్ర, నువ్వులు కూడా వేయాలి. కాస్త చిక్కగా గంజిలా ఉన్న దీన్ని చల్లారిన తరువాత ప్లాస్టిక్ కవర్‌పై కావలసిన సైజులో పెట్టుకోవాలి. ఇవి రెండురోజుల్లో ఎండిపోతాయి. వేయించిన సగ్గుబియ్యం వడియాల్సి స్నాక్స్‌లా తినొచ్చు.
*
రాగిపిండితో..
కావలసిన పదార్థాలు
రాగిపిండి: కప్పు
నీళ్లు: ఐదు కప్పులు
కారంపొడి: అరచెంచా
ఇంగువ: చిటికెడు
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం
ఒకపాత్రలో రెండు కప్పుల నీళ్లు, రాగిపిండి వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. మిగిలిన నీళ్లను మరిగించి ఉప్పు, కారంపొడి, ఇంగువ వేసి బాగా కలిపాక, కలిపి ఉంచుకున్న రాగిపిండి నీళ్లను వేస్తూ బాగా కలిపి దించేయాలి. ఇది కాస్త దగ్గరపడ్డాక ప్లాస్టిక్ కాగితంపై వడియాలుగా పెట్టుకోవాలి.
*
పేలాలతో..
కావలసిన పదార్థాలు
పేలాలు: 500 గ్రాములు
సగ్గుబియ్యం: పావుకప్పు
పచ్చిమిర్చి: 30 గ్రాములు
వాము: ఒక చెంచా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ఒకటిన్నర కప్పు నీళ్లలో సగ్గుబియ్యాన్ని రెండు గంటలపాటు నానబెట్టాలి. నానబెట్టిన నీళ్లలోనే సగ్గుబియ్యాన్ని కూడా ఉడికించాలి. చిక్కగా అయ్యేవరకూ ఈ మిశ్రమాన్ని కలపాలి. అందులోనే వాము వేసి బాగా కలిపి స్టవ్‌పై నుంచి దించి పక్కన పెట్టాలి. పెద్ద గినె్నలో అరకప్పు పేలాలు పోసి ఒకటిన్నర కప్పు నీళ్లు పోయాలి. మిగిలిన సగం పేలాలతో పాటు మరోకప్పు నీళ్లను కూడా అందులో కలిపి పదినిముషాలు అలాగే ఉంచాలి. తరువాత పచ్చిమిరపకాయలను సన్నటి ముక్కలుగా తరగాలి. నానిన పేలాల్లో ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఉడికించిన సగ్గుబియ్యాన్ని పేలాల మిశ్రమంలో పోసి బాగా కలపాలి. దీన్ని ఒక ప్లాస్టిక్ షీట్‌పై ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా పెట్టాలి. ఇలా పిండి మొత్తాన్ని వడియాలుగా పెట్టాలి. వీటిని బాగా ఎండనివ్వాలి. ఈ పేలాల వడియాలు సాంబారుతో కానీ, రసంతో కానీ చాలా బాగుంటాయి.
*
టొమాటోతో..
కావలసిన పదార్థాలు
టొమాటో గుజ్జు: కప్పు
అటుకులు:
ఒకటిన్నర కప్పులు
నువ్వులు: పావుకప్పు
కారప్పొడి: రెండు చెంచాలు
జీలకర్ర: చెంచా
పచ్చిమిర్చి: మూడు
ఉల్లితరుగు: పావుకప్పు
కొత్తిమీర తరుగు: కొద్దిగా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
నువ్వులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తరువాత టొమాటోలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి పచ్చిమిర్చి, జీలకర్ర జతచేసి మెత్తగా గుజ్జు చేసి పాత్రలోకి తీసుకోవాలి. అటుకుల్ని నీటిలో శుభ్రంగా కడిగి టొమాటో మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ పేపర్‌పై వడియాల్లా పెట్టుకోవాలి. బాగా ఎండిన వీటిని డబ్బాల్లోకి తీసుకోవాలి. వీటిని అన్నంలోకే కాకుండా స్నాక్స్‌లా కూడా తీసుకోవచ్చు.
*
మినప్పొట్టుతో..
కావలసిన పదార్థాలు
మినపప్పు: కప్పు
మినప్పొట్టు:
నాలుగు కప్పులు
ఇంగువ: కొద్దిగా
పచ్చిమిరపకాయలు: పది
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
మినపప్పును రాత్రంతా నానబెట్టాలి. దీన్ని మెత్తగా రుబ్బాలి. తరువాత పొట్టు, పచ్చిమిర్చి, ఉప్పు, ఇంగువ వేసి కొద్దిగా నీళ్లు వేసి రుబ్బాలి. దీన్ని మెత్తగా రుబ్బకూడదు. ఈ మిశ్రమంలో మెత్తగా రుబ్బుకున్న మినపప్పు మిశ్రమాన్ని కలుపుకోవాలి. దీన్ని ప్లాస్టిక్ కవర్‌పై సరిపడా సైజులో వడియాలను పెట్టుకోవాలి. ఇవి ఒకరోజులో ఆరిపోతాయి. వీటిని నూనెలో వేయించి వేడివేడి అన్నంతో నేతిలో కలుపుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.