రుచి

రాగి జావ తాగేద్దామా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దిగా నీళ్లు, రెండు చెంచాల రాగిపిండి, ఓ బెల్లం ముక్క.. ఈ మూడింటితో తయారయ్యే రాగిజావ నిజంగానే ఆరోగ్య ప్రదాయిని. వేసవికాలంలో దీన్ని రోజుకోసారి తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయి.
* రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
* రాగిపిండిలో విటమిన్ - సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం ఒక్కటే కాదు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
* రాగుల్లో ఇనుము మోతాదు కూడా ఎక్కువే.. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో రాగుల్ని చేర్చుకుంటే మంచిది.
* రాగుల్ని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
* రాగిపిండిలో పలురకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడి, ఆందోళనలు తగ్గిస్తాయి. అంతేకాదు కండరాల ఆరోగ్యానికి, రక్తం తయారవడానికి, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి.
* రాగుల్లో మాంసకృత్తులు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహారలోపం తలెత్తదు.
* రాగిపిండి రక్తంలోని కొలెస్ట్రాల్స్‌ను తగ్గిస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల గుండెజబ్బులు రాకుండా చూడవచ్చు.
* బరువు తగ్గాలనుకునేవారు రాగులను తరచుగా భోజనంలో చేర్చుకోవాలి. జావరూపంలోనే కాదు, సంగటి రూపంలో కూడా రాగిపిండిని తీసుకోవచ్చు.