రుచి

చపాతీ కూర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న మెంతికూర - 2 కప్పులు (సన్నగా తరిగినది)
ఉల్లిపాయ - మీడియమ్ సైజుది ఒకటి
టమాటా - పెద్దది - ఒకటి
పచ్చబఠాణీ - 1/4 కప్పు
బంగాళాదుంప - ఒకటి
ఆవాలు - 1 టీస్పూన్
జీలకఱ్ఱ - 1/2 టీ స్పూన్
పచ్చిమిర్చి - 2 (సన్నగా కట్ చేసినది)
ఎండు మిర్చి - 2 (ముక్కలుగా చేసినవి)
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - సరిపడినంత
ఉప్పు - సరిపడినంత
పైన చెప్పిన విధంగా మెంతికూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటా విడివిడిగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బంగాళాదుంపను కొద్దిగా ఉడికించి తొక్క తీసి ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మెంతికూరను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణిలో నూనె పోసి పోపు సామాన్లు వేసి తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు చల్లి కలిపి మూత పెట్టాలి. సన్న సెగమీద రెండు నిమిషాలు మధ్య మధ్య కలుపుతూ ఉంటే ఉల్లిపాయలు టమాటా మెత్తగా ముద్దలా అవుతాయి. వీటిలో ఉడికించి పెట్టుకున్న బంగాళా దుంప (ముక్కలుగా చేసి) పచ్చ బఠాణీ, మెంతికూర (ఉడికి మెత్తబడినది) వేసి సరిపడా ఉప్పువేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు స్టవ్‌మీదుంచి సువాసనతో ఉంటుంది. ఈ కూర చపాతీల్లోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసుకోవచ్చు.

-పి.లక్ష్మీదేవి