రుచి

గణపతికి బొజ్జ నిండుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశమంతా ఆనందంగా, వేడుకగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ‘గణపతి బొప్పా మోరియా’ అంటూ సందడి సందడిగా ఊరేగుతూ పందిళ్లకు చేరుకోబోతున్నాడు గణపతి. వినాయకుడు ప్రతి ఒక్కరిలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి అలాంటి ఆరాధ్య దైవమైన బొజ్జ గణపయ్యకు చవితి రోజున ఎలాంటి ఫలహారం నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు? ఆరగింపునకు కుడుములు, ఉండ్రాళ్లు, మోదకాలతో పాటు మరిన్ని తీపి పదార్థాలను కూడా చూద్దాం....

మోదకాలు

కావలసిన పదార్థాలు
కొబ్బరి తురుము: కప్పు
పంచదార: అరకప్పు
యాలకులపొడి: రెండు చిటికెలు
జీడిపప్పు: నాలుగు
బాదంపప్పు: నాలుగు కిస్‌మిస్: పది
బెల్లం తురుము: అరకప్పు
నెయ్యి: నాలుగు చెంచాలు
గసగసాలు: ఒకచెంచా కోవా: రెండు చెంచాలు
బియ్యప్పిండి: ఒకకప్పు
ఉప్పు: చిటికెడు వేడినీళ్లు: తగినంత
తయారుచేసే విధానం
మందపాటి గినె్నను తీసుకుని అందులో నీళ్లు పోసి స్టవ్‌పై ఉంచి మరిగించాలి. తరువాత ఇందులో ఉప్పు, చెంచా నెయ్యివేసి మిక్‌స్చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాయిల్ అవుతున్న నీటిలో వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి. తరువాత మంట తగ్గించి మూత పెట్టి కొన్ని నిముషాలు అలాగే ఉంచాలి. బియ్యం పిండి సాఫ్ట్‌గా ఉడికే వరకూ అలాగే ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత స్టౌపై నుండి తీసి కింద దింపి పెట్టుకోవాలి. పిండిని ఉండలు లేకుండా మరోసారి సాఫ్ట్‌గా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి బాగా కలపాలి. డ్రైగా అనిపిస్తే కొద్దిగా వేడినీటిని ఉపయోగించి స్మూత్‌గా పిండిని కలుపుకోవాలి. మరో పాన్‌ను తీసుకుని స్టౌపై ఉంచాలి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి గసగసాలు వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి. ఇందులో కొబ్బరితురుము, బెల్లం తురుము, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లు, యాలకులపొడి, కోవా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలపాలి. ఈ మిశ్రమాన్ని మీడియం మంటపై ఉడికించాలి. తేమ పూర్తిగా తగ్గిపోయి, డ్రైగా మారే వరకూ సన్నని మంటపై ఉడికించాలి. అడుగు భాగం మాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తరువాత ఇందులో పాలు, నెయ్యి వేసి ఇది కూడా పూర్తిగా డ్రైగా అయ్యేవరకు చూసుకోవాలి. చేతిలోకి కొద్దిగా నెయ్యి రాసుకుని ముందుగా తయారుచేసుకున్న బియ్యం పిండిని తీసుకుని చిన్న బాల్‌లా చేయాలి. దీన్ని వెడల్పుగా చేసి మోదకాల హోల్డ్‌లో పెట్టి అందులో కొబ్బరి తురుము స్ట్ఫింగ్‌ను ఉంచి చివర్లు నీటితో తడిపి నొక్కేయాలి. అంతే గణపతికి ఎంతో ఇష్టమైన మోదకాలు తయారు.

అటుకుల లడ్డూ

కావలసిన పదార్థాలు
అటుకులు: రెండు కప్పులు
పుట్నాల పప్పు: కప్పు
పంచదార: ఒకటిన్నర కప్పు
నెయ్యి: అరకప్పు
జీడిపప్పు పలుకులు: కొన్ని
పాలు: రెండు చెంచాలు
యాలకుల పొడి: అరచెంచా

తయారుచేసే విధానం
స్టవ్‌పై బాణలిని ఉంచి సగం నెయ్యి వేయాలి. అది కరిగిన తరువాత అటుకులు వేసి దోరగా వేయించి తీసేయాలి. వాటి వేడి చల్లారిన తరువాత పొడిలా చేసుకుని ఒక గినె్నలోకి తీసుకోవాలి. అదే మిక్సీలో పుట్నాలపప్పు, పంచదార, యాలకులపొడి వేసి మళ్లీ పొడిలా చేసుకుని అటుకుల మిశ్రమంలో వేయాలి. బాణలిని మరోసారి స్టవ్‌పై పెట్టి మిగిలిన నెయ్యి కరిగించి జీడిపప్పు పలుకులు వేయించి అటుకుల పొడిలో వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు పాలు చల్లుకుంటూ లడ్డూల్లా చుట్టుకుంటే సరిపోతుంది.

నవధాన్య పాయసం

కావలసిన పదార్థాలు
పెసలు, సెనగలు, బొబ్బర్లు, జొన్నలు, బియ్యం, కందులు, గోధుమలు, సజ్జలు, ఉలవలు: చెంచా చొప్పున
బెల్లం తురుము: రెండు కప్పులు
యాలకుల పొడి: ఒక చెంచా
పాలు: లీటరు జీడిపప్పు: పది
బాదం పప్పు: పది
నెయ్యి: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
స్టవ్‌పై బాణలిని ఉంచి అందులో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసి వేయించాలి. పెసలు, బొబ్బర్లు, సెనగలు.. అన్నీ కూడా ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు వీటిలో సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
తరువాత ఓ మందపాటి గినె్నలో పాలు పోసి సగమయ్యేవరకు మరిగించాలి. దీనిలో ఉడికించిన నవధాన్యాలు, బెల్లం తురుము వేసి ఉడికించాలి. యాలకులపొడి కూడా వేయాలి. చివరగా నేతిలో వేయించిన బాదం, జీడిపప్పు పలుకులు వేసి కలిపితే సరి.

ఉండ్రాళ్లు

కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి: రెండు కప్పులు
మంచినీళ్లు: మూడు కప్పులు
నూనె: ఒక చెంచా
ఉప్పు: కొద్దిగా
పచ్చిసెనగపప్పు: కప్పు
ఎండుకొబ్బరిపొడి: రెండు చెంచాలు
యాలకులపొడి: చెంచా
బెల్లం తురుము: కప్పు
తయారుచేసే విధానం
ముందుగా స్టవ్‌పై ఒక మందపాటి గినె్నను పెట్టి మూడు కప్పుల నీళ్లు పోసి కాగాక అందులో కాస్త ఉప్పు, ఒక చెంచా నూనె వేసి కలపాలి. నూనె బదులు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యప్పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. పిండి ముద్దలా అయ్యాక స్టవ్‌పై నుంచి దించాలి. తరువాత కుక్కర్‌లో పచ్చిసెనగపప్పు వేసి మెత్తగా ఉడికించాలి. నీళ్లు వంపేసి పచ్చిసెనగపప్పును ఆరబెట్టాలి. దీనికి బెల్లం తురుము వేసి కలిపి కచ్చాపచ్చాగా రుబ్బాలి. అందులోనే యాలకులపొడి, ఎండు కొబ్బరి పొడి వేసి కలపాలి. ఉడికించిన బియ్యప్పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకునిచిన్న పూరీల్లా చేసి మధ్యలో పూర్ణం మిశ్రమాన్ని పెట్టి దాన్ని మూసేసి గుండ్రంగా చేయాలి. ఇప్పుడు వీటిని ఇడ్లీ కుక్కర్‌లో ఆవిరిపై ఐదు నిముషాలు ఉడికించాలి.

పాయసాన్నం

కావలసిన పదార్థాలు
బియ్యం: అరకప్పు
పంచదార: ముప్పావుకప్పు
నెయ్యి: మూడు చెంచాలు
పాలు రెండు కప్పులు
జీడిపప్పు: మూడు చెంచాలు
తయారుచేసే విధానం
కుక్కర్‌లో కడిగిన బియ్యం, ఒకటిన్నర కప్పు పాలు, కాస్త నెయ్యి వేసి స్టవ్‌పై పెట్టాలి. మూడు కూతలు వచ్చాక దింపేయాలి. ఈ అన్నాన్ని మళ్లీ స్టవ్‌పై పెట్టి మిగిలిన పాలు, పంచదార వేయాలి. పంచదార కరిగి కాస్త పలుచగా అయ్యేవరకు మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. ఇంతలో ఓ బాణలిలో మిగిలిన నెయ్యి తీసుకుని స్టవ్‌పై పెట్టాలి. అది కరిగాక జీడిపప్పు వేయించి పొయ్యి కట్టేయాలి. పాలు కాస్త ఆవిరి అవుతున్నప్పుడు జీడిపప్పు, నెయ్యిని అందులో వేసి దింపేయాలి. అంతే పాయసాన్నం తయారు.

పాలబొబ్బట్లు

కావలసిన పదార్థాలు
మైదా: కప్పు
నెయ్యి: చెంచా
ఉప్పు: చిటికెడు
నీళ్లు: తగినన్ని
బియ్యప్పిండి: పావు కప్పు
నూనె: వేయించడానికి సరిపడా
తాజా కొబ్బరి తురుము: కప్పు
గసగసాలు: రెండు చెంచాలు
జీడిపప్పు: ఎనిమిది
పాలు: రెండు కప్పులు
బెల్లం తురుము: ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి: అరచెంచా
తయారుచేసే విధానం
ఒక గినె్నలో మైదా, ఉప్పు తీసుకోవాలి. దానిలో సరిపడా నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా కలపాలి. తరువాత నెయ్యి వేసి మరోసారి కలిపి ఇరవై నిముషాలు నాననివ్వాలి. ఆ తరువాత కొద్దిగా పిండి తీసుకుని బియ్యప్పిండి అద్దుకుంటూ పల్చని పూరీల్లా చేసుకుని మధ్యకు మడవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకోవాలి. స్టవ్‌పై బాణలి పెట్టి నూనెపోసి కాగనివ్వాలి. చేసుకున్న పూరీలను ఒక్కోదాన్ని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు పాయసం తయారుచేసుకోవాలి. ఒక గినె్నలో నీళ్లు తీసుకుని స్టవ్‌పై పెట్టి బెల్లం తురుము వేయాలి. ఇది కరిగేలోగా కొబ్బరి తురుము, గసగసాలు, జీడిపప్పు, యాలకులపొడి మిక్సీలో తీసుకుని మెత్తగాముద్దలా చేసుకోవాలి. బెల్లం కరిగాక ఆ పాకాన్ని ఒకసారి వడకట్టి.. మళ్లీ స్టవ్‌పై పెట్టాలి. అందులో ముందుగా చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి కలపాలి. నిముషం అయ్యాక కాచి చల్లార్చిన పాలు కూడా పోసి బాగా కలిపి చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు పూరీలను పళ్లెంలో రెండు మూడు చొప్పున సర్ది.. వాటిపై ఈ పాయసాన్ని కొద్దిగా వేయాలి. అంతే పాల బొబ్బట్లు తయారు.