రుచి

నోరూరించే కుకీస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకైనా, పెద్దలకైనా బిస్కెట్లు అంటే ఎంతో ప్రీతి.. సాయంత్రం వేళల్లో పాలతో కానీ, టీతో కానీ రెండు బిస్కెట్లు తింటే ఆ మజాయే వేరు. అవి ఇంట్లో చేసుకున్న బిస్కెట్లయితే మరింత మజా,
ఆరోగ్యం కూడా.. మరి ఈ బిస్కెట్లను ఇంట్లో
ఎలా తయారుచేయాలో తెలుసుకుందామా..
*
రాగి స్వీట్ కుకీస్
*
కావలసిన పదార్థాలు
రాగిపిండి: 700 గ్రాములు
గోధుమ పిండి: 200 గ్రాములు
ఐసింగ్ షుగర్: 400 గ్రాములు
వనస్పతి: 400 గ్రాములు
ఎసెన్స్: ఒక మూత
వంటసోడా: పదిహేను గ్రాములు
తయారుచేసే విధానం
ఐసింగ్ షుగర్, వనస్పతి, ఎసెన్స్, వంటసోడాని వేసి మొత్తం కలపాలి. దీన్ని క్రీములా తయారుచేసుకున్న తరువాత గోధుమపిండి, రాగి పిండిని వేసి ముద్దలా కలపాలి. అప్పడాల కర్రతో మందంగా చపాతీలా ఒత్తుకోవాలి. తరువాత దీనిని బిస్కెట్ కట్టరుతో కానీ కోసం 1500 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ట్రేను పది నిముషాల పాటు బేక్ చేయాలి. తరువాత ట్రేను బయటకు తీసి చల్లార్చిన తరువాత తీసేయాలి. ఈ కుకీస్ చాలా ఆరోగ్యకరమైనవి.
*
చాయ్ కుకీస్
*
కావలసిన పదార్థాలు
మైదా: అరకిలో
పంచదార పొడి: పావుకిలో
వెన్న: పావుకిలో
కోడిగుడ్లు: ఆరు
వంటసోడా: చిటికెడు
యాలకులపొడి: అరచెంచా
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
ఒక గినె్నలో కోడిగుడ్లను తీసుకుని బాగా గిలక్కొట్టాలి. ఇందులో పంచదార పొడి, వెన్న వేసి బాగా కలపాలి. ఆ తరువాత యాలకుల పొడి, వంటసోడా వేయాలి. చివరిగా మైదా కూడా కలిపితే ఇది గట్టిగా చపాతీ ముద్దలా అవుతుంది.
ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉంటే కొన్ని పాలు కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పిండిని అరగంటపాటు నాననివ్వాలి. ఆ తరువాత మరోసారి కలిపి కొంచెం మందంగా చపాతీలా ఒత్తుకుని చిన్న మూతతో కట్ చేస్తే బిస్కెట్లలా తయారవుతాయి. ఇలా చేసుకున్న వాటిని వేడినూనెలో ఎర్రగా వేయించాలి. అయితే మంట తక్కువగా ఉంటేనే ఈ బిస్కెట్లు మాడకుండా దోరగా వేయించినట్లు వస్తాయి. నూనె వద్దనుకుంటే ఓవెన్‌లో బేక్ చేసుకోవచ్చు.
*
తెకువా కుకీస్
*
కావలసిన పదార్థాలు
ముడి గోధుమపిండి: అరకిలో
డ్రై నట్స్: 100 గ్రాములు
ఎండుద్రాక్ష: రెండు చెంచాలు
వెన్న: నాలుగు చెంచాలు
బెల్లం తురుము: కప్పు
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
ఒక గినె్నలో పిండి వేసి సన్నగా తరిగిన నట్స్ వేయాలి. తరువాత వెన్న, ఎండుద్రాక్ష వేసి కలిపాక కరిగించిన బెల్లం వేసి కలపాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి కలిపి ఉండలుగా చేసుకుని గుండ్రని బిళ్ళల్లా ఒత్తుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి. ఇవి ఎంతో పిల్లలకు ఎంతో బలాన్నిస్తాయి.
*
టూటీ ఫ్రూటీ కుకీస్
*
కావలసిన పదార్థాలు
వెన్న: కప్పు
బేకింగ్ పౌడర్: చెంచా
యాలకుల పొడి: చెంచా
పాలపొడి: అరకప్పు
కస్టర్డ్ పొడి: అరకప్పు
మైదా: రెండు కప్పులు
టూటీ ఫ్రూటీ ముక్కలు: అరకప్పు
జీడిపప్పు పలుకులు: రెండు చెంచాలు
బాదంపప్పు పలుకులు: రెండు చెంచాలు
ఎండుద్రాక్ష: రెండు చెంచాలు
పంచదార పొడి: ఒకటిన్నర కప్పు
పైనాపిల్ ఎసెన్స్: చెంచా
నీళ్లు: అరకప్పు
తయారుచేసే విధానం
ముందుగా ఓ గినె్నలో టూటీఫ్రూటీ పలుకులు, జీడిపప్పు, బాదంపప్పు పలుకులు, ఎండుద్రాక్ష, మైదా, యాలకుల పొడి, పాలపొడి, కస్టర్డ్ పొడి, బేకింగ్ పొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గినె్నలో వెన్న, పంచదార పొడి, పైనాపిల్ ఎసెన్స్, నీళ్లు పోసి బాగా కలపాలి. దీనిలో ముందుగా తయారుచేసి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటినీ చపాతీలా ఒత్తుకుని మనకు నచ్చిన ఆకారంలో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కుకీస్‌ను ఓవెన్‌లో 180 డిగ్రీల వద్ద పదిహేను నిముషాల పాటు బేక్ చేసుకుంటే టూటీ ఫ్రూటీ కుకీస్ సిద్ధమైనట్లే..
*
రాగి సాల్ట్ కుకీస్
*
కావలసిన పదార్థాలు
రాగిపిండి: 700 గ్రాములు
గోధుమపిండి: 200 గ్రాములు
ఐసింగ్ షుగర్: 200 గ్రాములు
వనస్పతి: 400 గ్రాములు
వంటసోడా: 5 గ్రాములు
అమ్మోనియం సాల్ట్: 20 గ్రాములు
వెనీలా పౌడర్: 5 గ్రాములు
ఉప్పు: 200 గ్రాములు
వాము: కొద్దిగా
నీళ్లు: తగినన్ని
తయారుచేసే విధానం
ఐసింగ్ షుగర్, వనస్పతి, ఉప్పు, అమ్మోనియం సాల్ట్, నీళ్లు వేసి బాగా మెత్తగా కలపాలి. దీన్ని కలిపిన తరువాత గోధుమపిండి, రాగి పిండి, వెనీలా పౌడర్ వేసి చపాతీ పిండిలా చేసి కర్రతో చపాతీలా చేస్తూ మధ్యలో కాస్త పిండిని చల్లుకుంటూ, తరువాత అచ్చులతో బిస్కెట్లను తీసి ట్రేల్లో పెట్టి పదినిముషాలు ఒవెన్‌లో బేక్ చేసిన తరువాత రాగి సాల్ట్ బిస్కెట్లు తయారు.
*
కొబ్బరి కుకీస్
*
కావలసిన పదార్థాలు
కొబ్బరి తురుము: రెండు కప్పులు
పంచదార పొడి: రెండు కప్పులు
పాలు: కప్పు
వెన్న: నాలుగు చెంచాలు
జీడిపప్పుపొడి: పెద్ద చెంచా
గులాబీ ఎసెన్స్: అరచెంచా
తయారుచేసే విధానం
బాణలిలో రెండు చెంచాల వెన్న, కొబ్బరి తురుము, పంచదార పొడి, పాలు, జీడిపప్పు పొడి తీసుకుని స్టవ్‌పై ఉంచాలి. మంట తగ్గించి మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పంచదార కరిగి మిశ్రమం దగ్గరపడేవరకూ ఉంచాలి. ఆ తరువాత మిగిలిన వెన్న, గులాబీ ఎసెన్సు వేసి మరోసారి కలపాలి. రెండు, మూడు నిముషాలు అయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక బిస్కెట్లలా కోసుకుంటే సరిపోతుంది. ఇవి నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి.