రుచి

కొత్త ఏడాది.. ఇంట్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. అందరూ నూతన సంవత్సర వేడుకలకు కేకులు బజార్లో కొనుక్కుని తెచ్చుకుంటుంటారు. వీటిని కట్ చేయడమంటే పిల్లలకు భలే సరదా.. అలా కాకుండా ఇంట్లోనే.. పిల్లలతో కలిసి కేకులు, స్వీట్లు తయారుచేసుకుని తింటే ఆ మజాయే వేరు. మరి ఇంకెందుకాలస్యం.. కొత్త సంవత్సరంలో కొత్త కొత్త కేకులను ఇంట్లోనే తయారుచేసుకుందామా..
*
*ఎగ్‌లెస్ చాక్లెట్ కేక్

కావలసిన పదార్థాలు
మైదాపిండి: ఒక కప్పు
పంచదార పొడి: ఒక కప్పు
కొకోవా పొడి: అర కప్పు
బేకింగ్ పౌడర్: ఒక చెంచా
బేకింగ్ సోడా: ఒక చెంచా
ఉప్పు: అర చెంచా
నూనె: అర కప్పు
వేడినీళ్లు: అర కప్పు
పాలు: అర కప్పు
వెనీలా ఎసెన్స్: ఒక చెంచా
పెరుగు: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
ముందుగా ఒవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కు వేడిచేయాలి. బేకింగ్ టిన్‌కు కొద్దిగా నూనె పూసి పక్కన పెట్టాలి. ఒక వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో మైదాపిండి, పంచదార పొడి, కొకోవా పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో అరకప్పు నూనెలో అరకప్పు వేడి నీళ్లు పోసి రెండూ కలిసే వరకు కలియపెట్టాలి. తరువాత పాలు, వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. ఇందులోనే పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకున్న మైదా పిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా పోస్తూ కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని టిన్‌లో పెట్టి 160 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 35 నుంచి 40 నిముషాల పాటు బేకింగ్ చేయాలి. అంతే ఎగ్‌లెస్ చాక్లెట్ కేక్ రెడీ.
*
*అరటితో బ్రెడ్ కేక్

కావలసిన పదార్థాలు
అరటిపండ్లు: నాలుగు
బటర్: 100 గ్రాములు
కోడిగుడ్డు: ఒకటి
పంచదార: 140 గ్రాములు
మైదా పిండి: పావు కిలో
బేకింగ్ పౌడర్:
రెండు చెంచాలు
వాల్‌నట్స్: 100 గ్రాములు
పాలు: 50 మిల్లీ లీటరు
తయారుచేసే విధానం
ఒవెన్‌ను 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. కేక్ పాత్ర లెపల వెన్న రాసి ఉంచుకోవాలి. గుడ్డును బాగా గిలక్కొట్టి పెట్టుకోవాలి. తరువాత మరో పాత్రలో బటర్, పంచదార పొడి, గుడ్డుసొన, మైదా పిండి, బేకింగ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మెదిపిన అరటిపండు గుజ్జు, వాల్‌నట్స్‌ను కూడా కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని బటర్ రాసిన కేక్ టిన్‌లో వేసి ఒవెన్‌లో గంటసేపు ఉంచాలి. చల్లారిన తరువాత స్లైసులుగా కట్ చేసుకోవాలి. తినేముందు స్లైస్ పైన వెనిలా ఐస్‌క్రీమ్ కొద్దిగా వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.
*
*అంజీర, ఖర్జూరం రోల్
కావలసిన పదార్థాలు
అంజీర్: 20
గింజల్లేని ఖర్జూరాలు: ఒకటిన్నర కప్పు
బాదం: అర కప్పు
జీడిపప్పు: అర కప్పు
యాలకుల పొడి: కొద్దిగా
కొబ్బరి తురుము: ముప్పావు కప్పు
పల్చని ప్లాస్టిక్ కవర్లు: కొన్ని
తయారుచేసే విధానం
అంజీరాలను గంటముందు నీళ్ళుల్లో నానబెట్టుకోవాలి. ఖర్జూరాలను ముక్కలుగా కోసుకోవాలి. నానబెట్టిన అంజీరాలను నీళ్ళు లేకుండా తీసుకుని మిక్సీలో వేసి మిశ్రమంలా చేసుకోవాలి. తరువాత ఖర్జూరం ముక్కల్ని కూడా వేసుకుని మెత్తని మిశ్రమంలా గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు, బాదం పలుకుల్లో సగం విడిగా తీసుకుని ఖర్జూర మిశ్రమంలో కలుపుకోవాలి. అలాగే కొబ్బరిపొడి, యాలకుల పొడిని కూడా ఖర్జూర మిశ్రమంలో వేసుకుని బాగా కలిపితే గట్టి ముద్దలా అవుతుంది. ఇప్పుడు ఖర్జూర మిశ్రమాన్ని తీసుకుని ప్లాస్టిక్ కవర్‌పై ఉంచి చేత్తో చిన్న సైజు చపాతీలా తట్టాలి. ఇందులో బాదం, జీడిపప్పు పలుకుల్ని కొద్దిగా వేసి రోల్‌లా చుట్టేయాలి. ఇదేవిధంగా మిగిలిన మిశ్రమాన్ని చేసుకోవాలి. ఈ రోల్స్‌ని ఒక రోజు రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచేయాలి. ఆ తరువాత అలాగే తినొచ్చు. లేదా చక్రాల్లా కోసినా చూడటానికి చాలా బాగుంటాయి.
*
*పైనాపిల్ కేక్

కావలసిన పదార్థాలు
మైదాపిండి: రెండు కప్పులు
బేకింగ్ పౌడర్: రెండున్నర చెంచాలు
వెన్న: అర కప్పు
పంచదార పొడి: ఒకటిన్నర కప్పులు
పెరుగు: ముప్పావు కప్పు
వెనీలా ఎసెన్స్: ఒక చెంచా
ఉప్పు: కొద్దిగా కేక్ టిన్: ఒకటి
పైనాపిల్ ముక్కలు: ఒక కప్పు
పైనాపిల్ జ్యూస్: మూడు చెంచాలు
ఫ్రెష్ క్రీమ్: మూడు కప్పులు
చెర్రీలు: ఒక కప్పు
తయారుచేసే విధానం
ఒక పాత్రలో మైదాపిండి, బేకింగ్ పౌడర్ తీసుకుని ఉప్పు, పంచదార పొడి, వెన్న, వెనీలా ఎసెన్స్, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. కలిసిన తరువాత పెరుగు కూడా వేసి మిశ్రమం మెత్తగా అయ్యేవరకు కలియబెట్టాలి. తరువాత మిశ్రమాన్ని టిన్‌లోకి మార్చాలి. టిన్‌ను ఒవెన్‌లో 160 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 20-25 నిముషాలు బేక్ చేయాలి. మరో పాత్రను తీసుకుని అందులో క్రీమ్, పంచదారను తీసుకుని బాగా కలియబెట్టాలి. మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. ఒవెన్‌లో నుంచి టిన్‌ను బయటకు తీయాలి. మిశ్రమాన్ని ప్లేట్‌లోకి తీసుకుని దీన్ని అడ్డంగా రెండు ముక్కలు చేయాలి. ఇప్పుడు ఒక ముక్కపై క్రీము సమంగా రాయాలి. ఒక ముక్కపై పైనాపిల్ ముక్కలు వేయాలి. దానిపై మరో ముక్క పెట్టి మళ్లీ అంతటా సమంగా క్రీము రాయాలి. దీనిపైన అంతటా పైనాపిల్ జ్యూస్ చల్లాలి. పైన పైనాపిల్ ముక్కలు, చెర్రీలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే పిల్లలకు ఎంతో ఇష్టమైన పైనాపిల్ కేక్ తయారు.
*
*వెనీలా కేక్

కావలసిన పదార్థాలు
మైదాపిండి: రెండు కప్పులు
బేకింగ్ పౌడర్: రెండు చెంచాలు
వెన్న: అర కప్పు
పంచదార పొడి: అర కప్పు
పాలు: అర కప్పు
వెనిగర్: రెండు చెంచాలు
వెనీలా ఎసెన్స్: ఒక చెంచా

తయారుచేసే విధానం
ఒక పాత్రలో మైదాపిండి, బేకింగ్ పౌడర్, వెన్న, పంచదార, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో వెనిగర్, పాలు పోసి మెత్తని మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో తీసుకుని అంతటా సమంగా అయ్యేలా చేసుకోవాలి. దీన్ని 160 డిగ్రీల వద్ద బేక్ చేసుకోవాలి. తరువాత దీన్ని ప్లేట్‌లోకి మార్చి కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
*
*బనానా ఫ్రెంచ్ టోస్ట్
కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు: ఎనిమిది
అరటిపండ్లు: రెండు
మైదాపిండి: ఒక కప్పు
వెనీలా: రెండు చెంచాలు
పంచదార: రెండు చెంచాలు
పాలు: అర కప్పు
వెన్న: మూడు చెంచాలు
తయారుచేసే విధానం.. ఒక వెడల్పాటి గినె్నలో మైదాపిండి, అరటిపండు, కొద్దిగా పంచదార, వెనీలా వేసి మెత్తగా అయ్యేదాకా కలపాలి. దీనిలో తగినన్ని పాలు పోసి దోసెల పిండిలా కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి వెన్నని వేడిచేయాలి. బ్రెడ్ ముక్కల్ని పిండిలో ముంచి పాన్‌పై కాల్చాలి. ఇలా రెండువైపులా లేత గోధుమరంగు వచ్చేవరకు చేయాలి. వీటిపై పంచదార పొడి చల్లుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.