రుచి

ఎడారిలో అమృత ఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖర్జూరపు పండ్లను చూస్తే నోరూరని వారుండరేమో! ఇసుక ఎడారులలో పుట్టిన ఈ అమృత ఫలాలు, కేవలం రుచికే ప్రాశస్త్యం కాదు. అసంఖ్యాకమైన పోషక విలువలను తనలో దాచిన ఖర్జూరం తింటే ఆరోగ్య సమస్యలు మీకు సలామ్ చేసి పారిపోతాయి. ఖర్జూరపు పండ్లు కలిగించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అవి మీకు నేస్తాలుగా మారతాయి. తాజా పండ్లను తినటం లేదా సలాడ్స్‌లో కలిపి తింటే కూడా చాలా మంచిది.
తాజా ఖర్జూరపు పండు గుజ్జు (కండ) మృదువుగా వుండి సులువుగా జీర్ణమయ్యేవిధంగా ఉంటుంది. ఫ్రక్టోజ్ డెక్ట్రోజ్ వంటి సామాన్య చక్కెరలను కలిగియుంటుంది. తిన్నవెంటనే శక్తిని నింపటం, శరీరానికి తిరిగి శక్తినివ్వడం వంటి గుణాలు గల ఖర్జూరపు పండ్లను రంజాన్ మాసంలో బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు.
బెటా డి-గ్లూకాన్ అనే పీచు పదార్థం ఈ పండ్లలో సమృద్ధిగా వుంటుంది. ఇది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను ప్రేగులు అధికంగా గ్రహించకుండా నిరోధించడమే కాకుండా రక్తంలో చక్కెర శాతాన్ని సమతుల్యగా వుంచుతుంది. ఈ పండ్లు మలబద్ధకాన్ని నివారించటమే కాకుండా ప్రేగులలో మ్యూకస్ పొరను, కాన్సర్ కారక రసాయనాలను పట్టి వుంచుతుంది ఈ ఫైబర్.
దీనిలో ఆరోగ్యానికి మేలును చేకూర్చే ప్లాపనాయిడ్ పాలీ ఫెనాలిక్ ఏంటీ ఆక్సిడెంట్లు (టాన్సిల్స్)ను కలిగి వుంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ నుండి కాపాడటం, మంటను తగ్గించటం మరియు రక్తస్రావాన్ని నిరోధించడం వంటి గుణాలుంటాయి.
ఈ పండ్లలో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్ గ్రూపు విటమిన్లు, ఇంకా విటమిన్-కె కూడా సమృద్ధిగా వున్నాయి. విటమిన్-ఎ కూడా చర్మాన్ని మరియు మ్యూకస్ పొరను ఆరోగ్యంగా వుంచడానికి తోడ్పడుతుంది. బి విటమిన్‌లు, కార్బోహైడ్రేట్లు ప్రొటీన్లు మరియు ఫ్యాట్లు మెటబాలిజమ్‌లో రసాయనిక చర్యల ద్వారా శరీరానికి శక్తినివ్వటానికి సహాయపడతాయి.
అస్పేటా- కెరోటిన్, ల్యూచీన్ మరియు జియోగ్జాన్‌థిన్ వంటి ఏంటీ ఆక్సిడెంట్ ప్లావ్‌నాయిడ్లు ఈ పండ్లలో పుష్కలంగా వుంటాయి. ఈ ఏంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ కారక ఫ్రీరాడికల్స్ నుండి రక్షణనిచ్చి, ప్రేగులు, ప్రోస్టేట్, రొమ్ము, శ్వాసకోశం మరియు జఠరగ్రంథికి సంబంధించిన క్యాన్సర్లను నిరోధిస్తాయి. జియాగ్జాన్‌థిన్ వయసుతో ఏర్పడే కంటి రెటీనా సంబంధ వ్యాధుల నుండి, ముఖ్యంగా వృద్ధులకు రక్షణని స్తుంది కంటిచూపునకు సంబంధించి.

-బి.మాన్‌సింగ్ నాయక్