రుచి

వడకర్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కజొన్న గింజలు - 4 కప్పులు
జీలకఱ్ఱ, అల్లం, పచ్చిమిర్చి పేస్టు - 5 చెంచాలు
ఉప్పు - 2 చెంచాలు
ఉల్లిపాయలు - 2 కప్పులు
టమాటా ముక్కలు - 1 కప్పు
కొబ్బరి కోరు - 1 కప్పు
జీడిపప్పు- 12
నూనె - 250 గ్రా.
మసాలా కారం - 4 చెంచాలు
కొత్తిమీర - కొంచెం
బియ్యప్పిండి - 1/2 కప్పు
పసుపు - 1/2 చెంచా

పచ్చిగా ఉన్న మొక్కజొన్న గింజలను బాగా కడిగి మెత్తగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఈ ముద్దలో బియ్యప్పిం డి,అల్లం,జీలకణ్ణ, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు కలిపి వడలుగా చేసుకుని దోరగా వేపాలి. జీడిపప్పు,కొత్తిమీర, కొబ్బరికోరు విడిగా మిక్సీ పట్టాలి. బాణలిలో కాస్త నూనె వేసి ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు వేడిచేశాక నీరు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పసుపు, మసాలా కారం కలపాలి. పొంగు వస్తుండగా- ముందే చేసుకున్న వడలను ముక్కలుగా చేసి కలపాలి. ఈ వడకర్రీ మంచి రుచికరమైన గ్రేవీగా అన్నం, దోశలు, పుల్కాలు, చపాతీల్లోకి బాగుంటుంది.

-సంపూర్ణ చంద్రిక