ఐడియా

ప్రకృతి వరప్రసాదం ‘సోయా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాకాహారంలో ప్రొటీన్స్‌ను సమృద్ధిగా అతిచౌకగా మనకు అందించే ప్రకృతి వరప్రసాదం, ఆరోగ్యప్రదాయిని సోయాబీన్. అతి తక్కువ కొవ్వు పదార్థాన్ని కలిగివున్న సోయాబీన్ మానవాళికి నిజంగా ఒక వరం. ఉల్లాసంగా సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో వర్థిల్లేందుకు ఉపకరించే ‘శాకాహారరాజం’ సోయాబీన్ అనడంలో అతిశయోక్తి లేదు. మరే ఇతర ఫలజాతుల్లోగానీ, మాంసాహారంలో కానీ లేని విధంగా సోయాబీన్‌లో నలభై శాతం ప్రొటీన్స్ వున్నాయి. సోయాలోని ప్రొటీన్స్ నాణ్యత మాంసాహారం, గుడ్లతో ప్రొటీన్స్‌కు తీసిపోనిది. పోషకాహార విలువలు, పీచు పదార్థం, విటమిన్లు వంటి మైక్రోన్యూట్రియంట్స్‌ను సమృద్ధిగా కలిగివుంది. మన సంపూర్ణ ఆరోగ్యానికి దహదపడే ఖనిజాలు, అమినో ఆసిడ్స్‌ను సంతృప్తికరంగా అందజేస్తుంది సోయాబీన్. ఇందులో నూనె పదార్థం అధికంగా వున్నా అది నాణ్యతగల ఫాటీ ఆసిడ్స్ లక్షణాలతో ఆరోగ్యకరమైన జీవితానికి ఆలంబనమవుతుంది. అంతేగాక సోయాబీన్‌లో లభించే కొవ్వు పదార్థం కొలెస్టరాల్ లేనిది కావడం విశేషం. చేపలలో మాదిరిగానే ఒమేగా త్రీ ఆరు రకాల ఆరోగ్యకర ఆసిడ్స్ కలిగివుండటం సోయా ప్రత్యేకత. అందువల్లనే జపాన్ దేశస్థులు సోయాబీన్‌ను ‘పసుపు ఆభరణి’(ఎల్లో జ్యూవెల్) అని, అలాగే అమెరికావాసులు ‘సిండ్రెల్లాక్రాప్’ అని ముద్దుగా పిలుచుకుంటారు.

- కాకరపర్తి సుబ్రహ్మణ్యం