రుచి

పీచుతో ఆరోగ్యం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం దైనందిన జీవితంలో రోజూ వివిధ రకాల పదార్థాలను ఆహారంగా తీసుకుంటాం. ఆహార పదార్థాల ఎంపిక కేవలం రుచి, ఆకలిపై ఆధారపడి ఉండకూడదు. శరీర పోషణకు అవసరమయ్యే పదార్థాలను గుర్తించి మెలగాలి. కొన్ని పదార్థాలు తీసుకోవడంలో కొందరు నామోషీ అనుకుంటారు. ఆ కోవకు చెందినవే పీచు పదార్థాలు. పీచు పదార్థాల ఆవశ్యకతను గుర్తించక అనారోగ్యం పాలవుతారు. బీరకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు, ములగకాడలు, అరటిదూట, పనసకాయ వంటి పదార్థాల వంటల రుచి ఇష్టపడినా అవి వండడంలో కొద్దిపాటి శ్రమకు గురవుతారు. పీచు పదార్థాలు జీర్ణమయి ఏమీ శక్తినివ్వవు కదా? అనుకుంటారు. నిజమే. కానీ జీర్ణక్రియకు బాగా దోహదపడేది పీచుపదార్థాలు మాత్రమేనని గుర్తించాలి.
ఆహారంలో కొవ్వు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, నీరు.. ఇలా పలు పోషక విలువలను పట్టించుకున్నంతగా పీచు పదార్థాలపై దృష్టి సారించరు. మన ఆహారంలో పీచు అనేది పోషక పదార్థం కాకపోయినా ఆరోగ్య సంరక్షణలో పరిపోషక ఆహారంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనం రోజూ ఆహారంగా తీసుకునే పదార్థాలలోని పీచు ఆరోగ్యానికి సరిపోతుంది. దాన్ని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేయకూడదు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తరిగేటప్పుడు ఎక్కువ కాడలు, తొక్క తొలగించకూడదు. తొక్క అడుగునే అధికంగా పోషక విలువలు వుంటాయి. అలాగే పీచు పదార్థాలను నష్టపోము. గోధుమలు, జొన్నలు, రాగులు.. ఇతర దినుసులను పొట్టును తీయకుండానే పిండి పట్టించుకోవాలి. బియ్యం అతిగా పాలిష్ చేసినవి కాకుండా ఉండాలి. వీలైతే దంపుడు బియ్యం వాడుకోవచ్చు. కంది, పెసర, మినుము, శనగ.. పలు పప్పు ధాన్యాలు యధావిధిగా ఉడకపెట్టుకోవాలి. బీట్‌రూట్, క్యారెట్, పచ్చిబఠాణి, చెరకు, తేగలు తదితర పదార్థాలు తరచూ తినడం మంచిది.
వయసు పైబడిన వారిలో జీర్ణక్రియ మందగించడానికి కారణం వీటి లోపమేనని తెలుసుకోవాలి. పీచు పదార్థాలు జీర్ణక్రియలో భాగంగా జీర్ణాశయం నుంచి పెద్ద పేగుల దాకా ఆహారాన్ని తేలికగా, త్వరితంగా చేరుస్తాయి. ఆహారం సరిగా జీర్ణమయ్యి మలబద్ధకాన్ని నివారిస్తాయి. మాంసాహారంలో కంటే శాకాహారంలో పీచు పదార్థాలు అనేకం. ఆహారంలో పీచు ఎక్కువగా ఉండడంవల్ల త్వరగా జీర్ణమవుతుంది. వంటబట్టని వ్యర్థ పదార్థాలను బయటకు విసర్జించడానికి పీచు తోడ్పడుతుంది.
జీర్ణక్రియకు అవసరమయ్యే పేగులు, అవయవాలు సక్రమంగా విధి నిర్వర్తిస్తాయి. తద్వారా వ్యాధులు నయమవుతాయి. అన్ని రకాల క్రిములను నిర్మూలించడమే కాకుండా వివిధ రకాల క్యాన్సర్లను సోకనివ్వవు. మనం తినే ఆహారంలో సరిపడా పీచు పదార్థాలు ఉండటంవల్ల రక్తంలోని కొలెస్ట్రాల్‌ని నియంత్రించవచ్చు. గుండె జబ్బులు, షుగర్ వ్యాధులు దరిచేరవు. రక్తం శుద్ధిపడి, సరియైన జీర్ణక్రియ ఉంటే ఏ రోగాలు మనని ఆవహిస్తాయి చెప్పండి. అందుకే రోజూ మనం తీసుకునే ఆహారంలో కనీసం ఐదు గ్రాముల వరకు పీచు ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యం పదికాలాలపాటు పదిలపరచుకోవాలి.

- మురళీకృష్ణ.ఎం.