రుచి

ఆరోగ్యాన్నిచ్చే ఖర్జూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజాన్ మాసంలో ఖర్జూరం పళ్లకు విశిష్ట స్థానం వుంది. పరిపుష్టికరమైన ఖర్జూరం పండుతోనే ముస్లిం సోదరుల ఉపవాసదీక్ష పూర్తవుతుంది.
ఖర్జూరం విత్తనానికి 2 వేల ఏళ్ల తర్వాత కూడా మొలకెత్తే సామర్థ్యం వుంటుంది. ఖర్జూర పండు శరీరానికి ఒక టానిక్‌వలె పనిచేస్తుంది. ఖర్జూరాలు మిగిలిన డ్రైఫ్రూట్స్ కంటే ధర చాలా తక్కువ. ఆల్కహాల్ లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావం నుండి బయటపడాలంటే ఖర్జూరాలు మంచి ఔషధం. గింజ తీసివేసి ఈ రసం ప్రతిరోజూ రెండు పూటలా తాగితే గుండె జబ్బులు రాకుండా కూడా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారించడానికి ఖర్జూరం ఒక దివ్య ఔషధం. మలబద్ధకంతో బాధపడేవారు ఈ ఖర్జూరం పండ్లను రాత్రంతా నానబెట్టి, ఆ నీటితో ఉదయం పరగడుపున తాగితే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఖర్జూరంలో ప్రొటీనులు, ఫైబర్ అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎతోపాటు ఇంకా యాం టీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి. గర్భిణీలు ఖర్జూరాలు తింటే ఐరన్ బాగా దొరుకుతుంది. ఎందుకంటే 100 గ్రాముల ఖర్జూరాల్లో 7.3 మి.గ్రా. ఐరన్ ఉంది. ఇంకా హిమోగ్లోబిన్ తక్కువగా వున్న మహిళలకు కూడా ఖర్జూరం తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్జూరం పండులో క్యాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్ పుష్కలంగా వుంటుంది. ఈ రోజుల్లో అనేకమంది కీళ్ళనొప్పితో, బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారు. శరీరంలో కాల్షియం స్థాయిలు అతి తక్కువగా ఉండటం చేత ఈ ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఖర్జూరంలో క్యాల్షియం అధిక శాతంలో కలిగి వుండటం చేత వీటిని తరుచూ తినడంవల్ల కీళ్ళనొప్పి చికిత్సకు సహాయపడుతుంది. ఎముకలు బలంగా, పటుత్వంగా వుండాలంటే ఖర్జూర పండు తరచుగా ఎక్కువగా తినాలి. జీర్ణశక్తిని మెరుగుపర్చే శక్తి ఖర్జూరాల్లోని ఫైబర్‌కు వుందనేది వైద్య పరిశోధనల్లో తేలింది. పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్ చక్కగా ఉపయోగపడుతుంది.
పిల్లలనుండి పెద్దలదాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. ఇందులో ఎక్కువగా ట్రాన్స్‌ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా కలి గివున్నాయి. ఇవి ఎక్కువ పైబర్ (పీచు పదార్థాల)ను కలిగి ఉండి జీర్ణవ్యవస్థకు బాగా సహాయపడుతాయి. పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉండి సన్నగా ఉండేవారికి ఇవి చాలా బాగా సహాయపడతాయి. అలాగే ఖర్జూరాలను రాత్రంత పాలలో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి జ్యూస్‌లా తయారుచేసి తాగడంవల్ల శరీరానికి కావాల్సిన న్యూట్రిషియన్స్ అధికంగా అందుతాయి. దాంతో రోజంతా పనిచేయడానికి కావాల్సిన శక్తి అందుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు.. మూడ్ సరిగా లేనప్పుడు చాక్లెట్స్‌కు బదులు ఖర్జూరాలను తినడంవల్ల మంచి మూడ్‌తో ఉత్సాహంగా పనిచేయగలరు. ఖర్జూరంలో అధిక శాతంలో అంటే అరటిపండులో కంటే ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది గుండె కొట్టుకోవడానికి చాలా సహాయపడుతుంది. బ్లడ్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులో వుండే ఐరన్ క్రోనిక్ అనీమియా రాకుండా కాపాడుతుంది. ఖర్జూరంలో విటమిన్స్ కన్నా అమినోయాసిడ్స్ అధిక శాతంలో వుంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు బాగా సహాయపడతాయి. ఖర్జూరంలో ఇంకా పెక్టిన్ అనే రసాయనం ఉండటంవల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్‌ను అదుపులో వుంచుతుంది. ఖర్జూరాలను తరచూ తినడంవల్ల అబ్టామినల్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అంతేకాదు ఖర్జూరాలు గర్భిణీలకు చాలా ఆరోగ్యదాయకం. వారు ఇవి తినడవంల్ల ప్రసవం సులభతరంగా అవుతుంది. గర్భిణీకి కావాల్సిన కె విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఉండే ఫ్లోయిరిన్ దంతాలు గట్టిగా ఉండేలా సహాయపడి త్వరగా ఊడిపోకుండా కాపాడతాయి. సెక్స్యువల్ స్టామినాను పెంచుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఖర్జూరాలను మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చి ఆరోగ్యంగా అందంగా జీవించండి.

- టి.ఎస్.వైనతేయ