రుచి

ఉప్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కజొన్న గింజలు - 2 కప్పులు
ఉల్లిముక్కలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 6
కరివేపాకు - కొంచెం
అల్లం తరుగు - 2 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
నూనె - 1/2 కప్పు
బొంబాయి రవ్వ - 2 కప్పులు
జీడిపప్పు - 24
ఆవాలు - 2 చెంచాలు
మినప్పప్పు - 4 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
టమాటాలు - 4
క్యాప్సికమ్ ముక్కలు - 1 కప్పు
క్యారెట్ కోరు - 1 కప్పు
కొబ్బరి కోరు - 4 చెంచాలు
డాల్డా - 2 చెంచాలు
ముందుగా మొక్కజొన్న గింజలను ఉప్పువేసి ఉడికించి మిక్సీ పట్టాలి. బాణలిలో పోపులు వేయించి క్యాప్సికమ్, క్యారెట్, టమాటా, కొబ్బరి కోరు వేసి మగ్గపెట్టి విడిగాఉంచాలి. బాణలిలో మిర్చి, మొక్కజొన్న మిశ్రమం వేయించి మూడు కప్పుల నీరు, ఉప్పు వేసి బాగా మరిగించాలి. పొంగు వస్తుండగా డాల్డా వేసి, బొంబాయి రవ్వ పోస్తూ ఉండ కట్టకుండా కలపాలి. ఆ తర్వాత ఇందులో క్యాప్సికమ్, క్యారెట్, కొబ్బరి కోరు, అల్లం కోరు, కరివేపాకు వేసి బాగా కలపాలి.
ఐదు నిమిషాలు మూత పెట్టి ఆ తర్వాత వేడివేడిగా వడ్డించండి. గోధుమ రవ్వకు బదులు బియ్యం రవ్వ కూడా వేసి ఇదే పద్ధతిలో ఉప్మా చేసుకోవచ్చు.