రుచి

ఆలూ..పోషకాలు మేలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు పౌష్టికాహారం అందించటానికి తల్లిదండ్రులు ప్రయాసపడుతుంటారు. పిల్లలు ఇష్టంగా తినేవాటిలో ఆలూ ఒకటి. ప్రతిరోజూ వారి ఆహారంలో ఆలూను చేర్చమని పరిశోధకులు సూచిస్తున్నారు. కొంత వయసు వచ్చిన పెద్దలు కాళ్లు, కీళ్ల నొప్పులు, అధిక బరువు వల్ల ఆలూను తీసుకోవటానికి ఇష్టపడరు. దీంతో బంగాళదుంపను వండటమే మానేస్తారు. కాని చిన్నారులకు ప్రతిరోజూ కొంతమోతాదులో బంగాళాదుంపను ఇవ్వాలని వీరు అంటున్నారు. మనదేశంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో పిల్లలకు సరైన మోతాదులో బంగాళదుంపలను ఇవ్వటంలేదని తేలింది. దీంతో ఇందులో లభించే పోషకాలు పిల్లలకు అందటం లేదనే విషయాన్ని ఇటీవల నిర్వహించిన ఆ సర్వేలో వెల్లడైంది. పిల్లలకు కావాల్సిన 8శాతం పీచు పదార్థం, పోటాషియం ఖనిజాలకు బంగాళాదుంపలు మంచి వనరులని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఏడాది నుంచి మూడేళ్లలోపు పిల్లలకు అవసరమైన పోటాషియాన్ని 67శాతం, పీచును 55శాతం మాత్రమే తీసుకుంటున్నారట. ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులు కూరగాయలు తినకపోవటాన్ని పరిశోధకులు గమనించారు. చిన్నారులు కాయగూరలు తీసుకోవడం చాలా అవసరమని పోటాషియం, పీచు ఉన్న ఆలుగడ్డలు బాగా తినేలా ప్రోత్సహించాలని అమెరికా పరిశోధకులు తెలియజేస్తున్నారు.
*