రుచి

పొంగడాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీటి తయారీకి పొంగడాలు కాల్చే గుంటల పళ్లెం అక్కర్లేదు

కావాల్సిన పదార్థాలు

క్యాప్సికం - 4
దోసె పిండి - 10-12 గరిటలు
పచ్చిమిర్చి - 2 (తరుగు)
ఉల్లిగడ్డ - 1 (తరుగు)
అల్లం ముక్క - అరంగుళం (తరుగు)
కరివేపాకు - 4 రెబ్బలు (తరుగు)
లెమన్ జ్యూస్ -1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడినంత
కొత్తిమీర - ఒక కట్ట (తరుగు)

క్యాప్సికంలను శుభ్రంగా కడిగి, సుమారు సెంటీమీటర్ వెడల్పున రింగులుగా కట్ చేయండి. కట్ చేసుకున్న క్యాప్సికం రింగులు ఓ గినె్నలో వేసి, చిటికెడు స్టాల్‌గాని లెమన్ జ్యూస్ కానీ చల్లి పక్కన పెట్టుకోండి. దోసెపిండిని ఓ గినె్నలోకి తీసుకుని జారుడుగా (బజ్జీల పిండిలాగా) చేసుకోండి. కొత్తిమీర తప్ప పైన చెప్పిన అన్ని తరుగులూ ఈ పిండిలో వేసి బాగా కలపండి.
పొయ్యి వెలిగించి దానిమీద మందపాటి అట్లపెంకు పెట్టి, సుమారు వేడెక్కాక పక్కన పెట్టుకున్న క్యాప్సికం రింగులు 6-8 తీసుకుని పెంకుమీద పెట్టండి. ప్రతి రింగులోను పావు స్పూను నూనె వేసి కలిపి పెట్టుకున్న పిండిని ఓ గరిటతో నిదానంగా ఈ రింగుల్లో పోయండి (పూర్తిగా పైదాకా పోయకుండా, ముప్పావు మాత్రమే నింపండి). స్టవ్ సిమ్‌లో పెట్టి, 2-3 నిమిషాలు కాలనిచ్చి, అన్నిటికీ పైన తలా పావు స్పూను లెక్కన నూనె పోసి, నిదానంగా వీటిని అట్లకాడతో తిప్పేసి, ఈ రెండో వైపు కూడా 2-3 నిమిషాలు కాలనీయండి. వీటిని స్టవ్‌మీది నుండి తీసేసి, మిగిలిన క్యాప్సికం ముక్కలను పొంగడాలుగా చేసుకోండి. పైన కొత్తిమీర తరుగు చల్లి వడ్డించండి. వీటిని వేడిగా అలాగే తినేయొచ్చు .లేదా మీచట్నీ లేదా సాస్‌తో ఆనందించండి.
ఇలాగే క్యాప్సికం రింగ్ ఊతప్ప, క్యాప్సికం సర్కిల్ ఎగ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు. ఐతే వీటి తయారీకి క్యాప్సికం రింగులను ఇంకాస్త సన్నగా కట్ చేసుకుని ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు.