రుచి

ఉప్మా బజ్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావాల్సిన పదార్థాలు

క్యాప్సికం - 4
ఉప్మా - రెండు కప్పులు
శెనగపిండి - 250 గ్రా.
బేకింగ్ సోడా పౌడర్ - 1 టీ స్పూను
వాము - పావు టీ స్పూను
మిరపపొడి - పావు టీ స్పూను
ఉప్పు - రుచికి సరిపడినంత
లెమన్ జ్యూసు - ఒక టేబుల్ స్పూను
నూనె - బజ్జీలు వేగడానికి సరిపడినంత

క్యాప్సికంలను నిలువుగా ఎనిమిదేసి ముక్కలుగా (తొడిమతో సహా చీల్చండి. ఈ ముక్కలపైన అర స్పూను లెమన్ జ్యూస్ చల్లి వీటిని పక్కన పెట్టండి.
శెనగపిండిలో రెండు టేబుల్ స్పూన్లు తీసి పక్కన పెట్టుకుని, మిగిలిన దాన్ని ఒక గినె్నలోకి తీసుకుని, ఉప్పు, మిరప్పొడి, వాము, బేకింగు సోడాతో సహా కలిపేసి గరిట జారుడుగా (మరీ పలుచనవకుండా) బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
పక్కన పెట్టుకున్న క్యాప్సికం ముక్కలమీద, విడిగా పెట్టుకున్న శెనగ పిండి చల్లి, గినె్నను బాగా కుదపండి. అన్ని ముక్కలకూ పిండి సమం పట్టేలా చూడండి.
ఇప్పుడు ఒక్కో క్యాప్సికం ముక్కలో ఒక స్పూను ఉప్మా పెట్టి, మరో క్యాప్సికం ముక్కతో మూసేసి, నారతో గానీ, దారంతోగాని రెండు చివరలూ గట్టిగా కట్టండి. అన్నిట్లోనూ ఉప్మా సమానంగా సర్ది, అన్నిటినీ కట్టేసి, బాండీ స్టోవ్‌మీద పెట్టి, బజ్జీలు వేగడానికి సరిపడేంత నూనె పోసి వేడి చేయండి.
నూనె వేడెక్కక, ఉప్మా స్ట్ఫ్ చేసుకున్న క్యాప్సికం ప్యాకింగులను ఒక్కోటి జాగ్రత్తగా బజ్జీల పిండిలో ముంచి నూనెలో వేయండి. ఎర్రగా కాలినాక తీసి పళ్ళెంలో పెట్టుకోండి. మిగిలిన నిమ్మరసం చల్లి, కొత్తిమీరతో డెకొరేట్ చేసి ఆస్వాదించండి. (తినేప్పుడు ఆ టేస్టు ముందు స్ట్ఫింగ్ టైంలో కట్టిన దారాలు అడ్డమనిపించవు. ఆటోమేటిగ్గా వాటిని లాగేసి తినేస్తారు).
............................................
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

- చంద్ర మహాలక్ష్మి