రుచి

సలాడ్స్‌కీ రాజా కీర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీర దోసకాయ.. ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయలలోఇది ఒకటి అని, తరచుగా దీనిని ఒక సూపర్ ఆహారంగా సూచిస్తుంటారు. కీరదోసకాయను ఎక్కువగా సలాడ్స్ తయారుచేయడానికి ఉపయోగిస్తుంటారు. సలాడ్స్ తినడానికి ప్రధాన కారణం మన శరీరంలో న్యూట్రీషినల్ విలువలు పెంచడం కోసమే. ముఖ్యంగా గ్రీన్ సలాడ్స్‌లో కీరదోసకాయను మరియు టమోటోలను ఖచ్చితంగా చేర్చుకోవాలి. వీటివల్ల శరీరానికి అనేక న్యూట్రిషనల్ విలువలు అందుతాయి. నిజానికి, చాలామంది ఉదయం వివిధ రకాల జ్యూసులు తాగుతుంటారు. ఈ జ్యూసులు రోజంతా అవసరం అయ్యే ఎనర్జీని అందించడంలో గొప్పగా సహాయపడతాయి.
చల్లగా చూడగానే తినాలనిపించే కీరదోసలో పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీహైడ్రేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా వుండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కీరదోస చక్కని పాత్ర పోషిస్తుంది.
రోజూ కప్పు కీరదోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. దీని నుంచి విటమిన్ ఎ, సిలు పుష్కలంగా లభిస్తాయి. వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజుల్లో కీరదోసకాయ జ్యూస్ ఏమైనా ఆకుకూరల రసంతో కలిపి తీసుకుంటే చలువ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యముగా ఉండేలా చేస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోవడానికి, మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదపడుతుంది. కీళ్ళలో వుండే యూరిక్ యాసిడ్‌ను తొలగించడంవల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి.
ఆర్ద్రైటిస్, గౌట్ వ్యాధుల వారికి ఇది మంచి చేస్తుంది. కీరదోసకాయలో గల సిలికాన్, సల్ఫర్ ఖనిజ లవణాలు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. కీర దోసలో 96 శాతం నీరే. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని విషతుల్యమైన వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషిం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. హైబీపి అదుపులోకి రావాలంటే రోజూ ఒక కీరదోసకాయను తినడం చక్కటి మార్గం. ఇందులోని ‘కె’ విటమిన్ ఎముకలు, కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరాన్ల పనితీరు మెరుగవడంతో అల్జీమర్స్ రాదు. గోళ్లు పెళుసుబారడాన్ని తగ్గిస్తుంది. కడుపులో పురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజూ తినవచ్చు. బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది.
దీనిలో ఉండే నీరు పొడిబారిన చర్మానికి పోషణను అందిస్తుంది. దాంతో స్కిన్ సమస్యలు దూరమవుతాయి. ఇది చర్మంలోనికి చొచ్చుకొనిపోయి, స్కిన్ సెల్స్‌కు అవసరం అయ్యే మాయిశ్చరైజర్‌ను అందిస్తాయి. మిక్సీలో కీరదోసకాయ ముక్కలు వేసి పేస్ట్‌లా చేసి ముఖానకి అప్లై చేయడం ద్వారా డ్రై స్కిన్‌కు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు.
కీరదోసను చర్మంపై రుద్దితే సన్‌బర్న్ వంటివాటినుంచి ఉపశమనం లభిస్తుంది. దేహంలోని విష పదార్థాలను బయటకు పంపివేస్తుంది. క్రమం తప్పకుండా కీరదోసకాయలను తింటే కిడ్నీలో రాళ్లు కూడా కరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. మనకు నిత్యం కావాల్సిన అనేక విటమిన్లను కీరదోసకాయ అందిస్తుంది. దృష్టి సంబంధ సమస్యలను కీరదోసకాయ దూరం చేస్తుంది. కళ్లకింద ఏర్పడే నల్లని వలయాలు కూడా పోతాయి. కీరదోసను అడ్డంగా కోసి ఒక్కో ముక్కను కళ్లపై పెట్టుకుని కొంతసేపు ఉండాలి. తరచూ ఇలా చేస్తే కంటి సమస్యలు దూరమవుతాయి. క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కీరదోసలో ఉన్నాయి. ప్రధానంగా అండాశయ, రొమ్ము, ప్రోస్టేట్, గర్భాశయ క్యాన్సర్‌లను నిరోధించే ఔషధ గుణాలు కీరదోసలో ఉన్నాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కీరదోసకాయలు పరిరక్షిస్తాయి. మూత్రాశయ సంబంధ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి