రుచి

రుచికి పెట్టింది పేరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంటింట్లో ఎన్ని సుగంధ ద్రవ్యాలున్నా గుప్పుమని కమ్మని సువాసనలు వెదజల్లుతూ ఆహార పదార్థాలను తయారుచేసుకోవాలన్నా.. మానవ శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలలో ఏ ఒకటి దరిచేరకుండా కాపాడాలన్నా.. కావలసింది ఇంగువ. హింగువతో గుబాళించే తాలింపు పెట్టినే ఏ ఆహార పదార్థమైనా రుచికరమే. ఇన్ని సుగుణాలున్న ఇంగువతో కొన్ని చిట్కాలు చూద్దాం.
- తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవడానికి ఇంగువ బాగా పనిచేస్తుంది. ఇది వాడడంవల్ల రోగ నిరోధకశక్తి ఇనుమడింపజేస్తుంది. దీనికి కారణం కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరటిన్, బి విటమిన్‌లు దీంట్లో పుష్కలంగా లభ్యమవడమే.
- మంచి జీర్ణకారి అయిన ఇంగువకి కమ్మని నిద్రని పుట్టించే గుణం వుంది. అందుకే బాలింతలకు ఇచ్చే ఆహారంలో ఇంగువ ముఖ్యమైన పదార్థం.
- శ్వాసకోశ వ్యాధులను నయం చేస్తుంది. స్ర్తిల సమస్యలకి ఇంగువ మంచి మందు. హిస్టీరియాతో బాధపడేవారికి దీని వాసనని చూపిస్తే ఫలితం ఉంటుంది.
- కడుపులో గుడగుడా తగ్గాలన్నా, కడుపు ఉబ్బరంగా ఉన్నా, ఇంగువ అత్యంత ఉపయుక్తం అని చెప్పాలి.
-పిప్పి పన్ను బాధిస్తుంటే ఇంగువ పెడితే చాలు, నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- ఆకలి అంటూ లేనివారికి హింగ్వాష్టక చూర్ణం చక్కని ఔషధం. ఇంగువ, శొంఠి, పిప్పిళ్లు, మిరియాలు, వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, సైంధవ లవణం.. వీటన్నింటినీ సమానంగా తీసుకుని పొడి చేసి వేడినీళ్ళతో తాగాలి.
- చంటిపిల్లలు ఎందుకు ఏడుస్తారో ఒక్కోసారి అంతుచిక్కదు. కడుపు ఇబ్బందిగా ఉందని తోచినపుడు నీళ్ళల్లో కాస్త ఇంగువని కరిగించి పైపూతగా వాడుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లల మెడలో చేతికి ఇంగువ ముక్కని తాయెత్తులా కడితే చాలా రోగాలు దూరంగా ఉంటాయని నమ్మకం. దీనికి కారణం తీవ్రమైన వాసనవలన చాలా సూక్ష్మజీవులు దరిచేరకపోవడం కావచ్చు.
- నేటి పోటీ ప్రపంచంలో మానసిక సమస్యలను తరిమికొట్టడంలో అజీర్తి, డయాబెటిస్, రక్తపోటు, నరాల బలహీనతలు, చర్మవ్యాధులు, ఆస్తమా.. ఇలా పలు సమస్యలకి చక్కని ఔషధకారిణి ఇంగువ. ఇంగువని ఆహారంగా కానీ లేపనంగా కానీ వాడుకోవచ్చు. ఇంగువ శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ కూడా కావడంతో ప్రాణాంతక క్యాన్సర్‌లతోకూడా పోరాడుతుంది.
-‘ఇంగువ కట్టిన గుడ్డ, బెల్లం వండిన పొయ్యి’ చందంగా ఏ పదార్థానికైనా ఇట్టే వాసన పట్టేసే గుణం ఇంగువకి ఉండడం, ఖరీదైనది కూడా కావడం చేత ఎక్కువ కల్తీ చేస్తుంటారు. జాగ్రత్త పడకపోతే ఆరోగ్యానికి బదులు రోగాలు కొనితెచ్చుకున్న వారవుతాము. ఇది చెట్టు కాండం, వేళ్ళనుండి వెలువడే జిగురు. అసలుసిసలైన ఇంగువను నీళల్లో వేస్తే పూర్తిగా కరిగిపోతుంది. ఇంగువ కరిగించిన నీళ్లన్నీ పాలలా తెల్లగా మారాలి. ఇంగువను మండిస్తే పూర్తిగా మలినాలు వెలువడకుండా కాలిపోవాలి.

-హర్షిత