రుచి

ఏ వంటకైనా ఇది తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిపప్పును చూస్తే చాలు నోట్లో వేసుకుని నమిలేయాలనిపిస్తుంది. అనేక పోషక విలువలు ఇందులో ఉన్నాయి. క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడే ఫైటోకెమికల్స్ ఇందులో పుష్కలంగా వున్నాయి. రోజూ జీడిపప్పు తినేవారిలో మంచి కొలెస్టరాల్ శాతం ఎక్కువగా వుంటుంది. ఇతర గింజలతో పోలిస్తే జీడిపప్పులో తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలు ఉంటా యి. జీడిపప్పులో గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే మోనోసాచురేటెడ్ ఫాట్ లేదా ఒలేయిక్ ఆసిడ్‌లను 75 శాతం వరకు కలిగివుంటాయి. జీడిపప్పులో ఉండే ఫాట్‌లు, ఆలివ్ ఆయిల్‌లో వుండే ఫాట్‌లు ఒకేరకం అని చెప్పవచ్చు. మోనోసాచురేటెడ్ ఫాట్ లు శరీరంలో ట్రైగ్లిసరైడ్ లేదా రక్తంలో ఉండే ఫాట్‌లను తగ్గించి మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి అని చెప్పవచ్చు. ఇందులోని మెడిటేరియన్ డైట్‌లో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా వుండి గుండెజబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధనలలో సైతం వెల్లడైంది. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ వుంటుంది. మెగ్నీషియం నిల్వ లు కూడా అధికంగా వుండటంతో ఎముకలు పుష్టి కి ఇవి దోహదపడతాయి. మన శరీరానికి 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది. శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు జీడిపప్పులో వుంటాయి. రిబోప్లావిన్, పాంటోథీనిక్ ఆసిడ్, థయామిన్, నియాసిన్ వంటి విటమిన్లు జీడిపప్పులో వుంటాయి. అనిమియా మరియు పెల్లాగ్రా వంటి వ్యాధులు కలుగకుండా చూస్తుం ది. ఇక రక్తపోటు బిపి వున్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగానూ ఉంటాయి. క్యాన్సర్ సమస్యను అడ్డుకునే యాం టి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది. సెలీనియమ్ మరియు విటమిన్ ఇ వంటివి ఉండటంతో ఇవి క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకుంటాయి. అయి తే అతిగా తినేయకూడదు. నియంత్రణ ఉండాలి. అలా చర్మంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలను నియంత్రించుకోవచ్చు.
కాపర్‌ను అధిక మొత్తంలో కలిగిన జీడిపప్పు ను తినటంవలన నల్లటి జుట్టును పొందుతారు. నెరిసిన జుట్టు ఉన్నవారు రోజూ జీడిపప్పును తినటంవలన మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఎంజైమ్ ఆక్టివిటీ హార్మోన్ ప్రొడక్షన్, బ్రెయిన్ ఫంక్షన్ మొదలగు వాటి క్రియల కోసం ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఇంకా అనీమియాను ఎదుర్కోవడానికి అవసరం అయ్యే రెడ్ బ్లడ్ సెల్స్‌ను ఉత్పత్తి చేయడానికి జీడిపప్పులో ఉండే కాపర్ గ్రేట్‌గా సహాయపడుతుంది.
ఏ వంటకానికైనా జీడిపప్పు పడితే అధిక విలు వ సమకూరుతుంది. నోరూరించే జీడిప్పపును వాడాలంటేనే సామాన్యులు భయపడే రోజులు వచ్చాయి. ఈ సీజన్‌లో సాగే శుభకార్యాల్లోనూ వాటి వాడకం పడిపోయింది. ప్రస్తుతం పప్పు తయారీకి విదేశాలనుండి జీడి కాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దిగుమతులపై ఆధారపడటంతో ధరలకు రెక్కలు మొలిచాయి. ధరల పెరుగుదలతో మనం మంచి రుచులను కోల్పోతున్నాం.

- సాయి ఆదిత్య