రుచి

పాలముంజెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శనగపప్పు- 1 కప్పు, బెల్లం- 1 కప్పు, నెయ్యి- 5 చెంచాలు, మెత్త బియ్యం పిండి- 2 కప్పులు, పాలు- 1/2 లీటరు, నూనె- 250 గ్రా, ఉప్పు- కొంచెం, ఏలకులు-5, కొబ్బరికోరు- 1 కప్పు.
పాలుకి ఒక కప్పు నీరు చేర్చి మరగనివ్వాలి. పొంగులు వస్తుండగా బియ్యం పిండి ,ఉప్పు కలిపి 5 నిముషాలు మగ్గపెట్టి దింపి చల్లార్చండి. ఈలోగా శనగపప్పుకు నీరు చేర్చి ఉడకబెట్టాలి. బాణలిలో ఈ ముద్దకి బెల్లం, నెయ్యి, కొబ్బరి చేర్చి బాగా కదుపుతూ ఉండాలి. ఇది దగ్గర పడ్డాక దింపి కీరా బిళ్ళల మాదిరి చేసి పళ్ళెంలో పెట్టాలి. 15 బిళ్ళలు వస్తాయి.
ఇప్పుడు పైన చల్లార్చిన పాల బియ్యం పిండిని 15 ముద్దలుగా చేసుకుని అరచేతితో వత్తి దాని మధ్యలో కొబ్బరి పూర్ణం బిళ్ళలు పెట్టి మూసి ముంజె కళ్ళల్లో వత్తుకోవాలి. అవసరం అయితే నూనె తడితో అందంగా బిళ్ళలు చేసుకొని కాగిన నూనెలో వేయించాలి. ఈ విధంగా మొత్తం పాల ముంజెలు నూనెలో వేయించి తియ్యాలి. ఇది 2 రోజులు నిల్వ ఉంటుంది.