అక్షర

అలనాటి పరిస్థితులకు అద్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్రాభట్ల నరసింగరావు రచనలు ( కథలు- నవలిక)
వెల: రు.150/-
ప్రతులకు:- 1. నవచేతన పబ్లిషింగ్ హౌస్
బండ్లగూడ (నాగోల్), ఇ.ఎస్.ఐ. పోస్టు
హైదరాబాద్- 068.. ఫోన్స్- 24224453/54
2. నవచేతన బుక్‌హవుస్ శాఖలు 3. విశాలాంధ్ర శాఖలు.

1955-65 మధ్య కాలంలో పత్రికలలో మంచి మంచి కథలు, సీరియల్సు వస్తుండేవి. బాపు బొమ్మలతో మరింత ఆకర్షణీయంగా, పాఠకులను ఊహాలోకంలో విహరింపజేస్తుండేవి. అయితే, వాస్తవ జీవన పరిస్థితులను ప్రతిబింబిస్తూ, రుద్రాభట్ల నరసింగరావు వంటి కొందరు మంచి రచయితల కథలు కూడ అప్పుడప్పుడూ కనిపిస్తుండేవి. అవి కూడ పాఠకుల ఆదరణ పొందగలిగాయి.
నలభై ఏళ్ల వయసులోనే 1980లో అకాల మరణం చెందిన నరసింగరావు కథలలో కొన్ని ఇప్పుడొక సంకలనంగా రూపుదిద్దుకున్నాయి. కథలకు తోడు ‘ఆదర్శ శిఖరాలు’ పేరుతో ఒక నవలిక కూడ ఈ పుస్తకంలో ఉంది.
చాలకాలం తర్వాత కలుసుకున్న తండ్రీ కొడుకుల మధ్య ఏర్పడిన సన్నిహితత్వాన్ని ఆవిష్కరించే కథ ‘పునరాగమనం’. క్లిష్టమైన ఇతివృత్తాన్ని తీసుకొని, మంచి కథగా రూపొందించటంలో రచయిత ప్రతిభ ఇందులో కనిపిస్తుంది.
1960 నాటికి పంచాయతీ సమితులనే పేరుతో ఒక వ్యవస్థ ఏర్పడింది. సమితి ప్రెసిడెంట్లు అనే పేరుతో పిలవబడే ఈ రాజకీయ పెత్తందార్లు తమ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మీద, ముఖ్యంగా టీచర్లమీద తమ అధికారం ప్రదర్శిస్తుండేవారు. గ్రామీణ జన జీవితాన్ని శాసించిన, ఈ వ్యవస్థ నడిచిన విధానాన్ని ఆసక్తికరంగా తెలిపిన మంచి కథ ‘తొందరపడ్డాను.’
‘గౌరి సందేహాలు’ కథలో వితంతు వివాహాల గురించి చర్చించటం కనిపిస్తుంది. ‘మగవాడి బిడియం’ కథలో ఒక చిన్న అచీంశాన్ని ఆసక్తికరమైన కథగా రూపొందించారు. కథలో సస్పెన్స్ బాగుంది.
‘మ్యూజియంలో మ్యూజింగ్స్’ కథలో మనస్తత్వాల విశే్లషణ సహజత్వానికి దగ్గరగా ఉంది. ముగింపులో ప్రత్యేకత ఉంది.
‘ఔట్ హవుస్‌లో అనూరాధ’ కథ ఎత్తుగడ బావుంది. సస్పెన్సు కూడ ఉంది. అయితే కథ చివరి భాగం బొత్తిగా అసహజంగా ఉంది.
‘ఆదర్శ శిఖరాలు’ నవలిక బాగుంది.
1970నాటి దేశ, కాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చదివినప్పుడు, ఈ కథలలోని పాత్రల మనోభావాలను మరింత బాగా అర్థం చేసుకోటానికి వీలవుతుంది.

-ఎం.వి.శాస్ర్తీ