విజయనగరం

రగ్గులకు భలేగిరాకీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 22: సీజనల్ వ్యాపారం .. ముఖ్యంగా చలికాలంలో వెచ్చటి రగ్గులకు ఎంతో గిరాకీ ఉంటుంది. నాణ్యమైన రగ్గులు, ఉన్ని దుస్తులను వినియోగదారులు కొనుగోలు చేస్తుంటారు. డిసెంబర్ నుండి జనవరి వరకు చలిబాగా ఎక్కువగా ఉంటుంది. ఉత్తరభారతం నుండే వచ్చే చలిగాలులకు సముద్రపు తీరంలో ఉండే ప్రజలు సైతం గజగజవణికి పోతారు. కొండలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలికొంచెం అధికంగా ఉంటుంది. పట్టణ వాతావరణం, గ్రామీణ వాతావరణాల్లో చలితీవ్రతలో తేడాలు ఉంటాయి. చెట్లు ఎక్కువగా ఉండే గ్రామాల్లో మంచుతో కూడిన చలివాతావరణం పిల్లలు, వృద్ధులను ఇబ్బందులు పెడుతుంది. పట్టణాల్లో అంత కాకపోయినా కొంచెం చలి గాలులు వేస్తాయి. అయితే గత ఏడాది వచ్చిన హుదూద్ తుఫాను కారణంగా పచ్చదనం కనుమరుగు అయింది. వందలాది వృక్షాలు నేలకూలాయి. ఫలితంగా వాతావరణంలో అనేక మార్పులు ఈ ఏడాది చోటుచేసుకున్నాయి. చలికాలంలో సైతం వేడి వాతావరణం నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కొంచెం అధికంగా ఉంటున్నాయి. రాత్రిపూట మాత్రమే చలి అనిపిస్తోంది. ఫలితంగా సీజనల్ వ్యాపారాలపై ఈవాతావరణం తీవ్ర ప్రభావాన్ని చూపింది. సీజన్‌లో రగ్గులు విపరీతంగా అమ్ముడు పోతాయి. కానీ ఈసీజన్‌లో అటువంటి వ్యాపారం లేదని మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నుండి ప్రతిఏటా ఉన్ని, రగ్గులు తీసుకువచ్చి విజయనగరం పట్టణ ప్రాంతంలో అమ్మే అశోక్ అనే వ్యాపారి చెప్పాడు. రోజుకు కనీసం 20 రగ్గులు అమ్మలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసాడు. విజయనగరం పట్టణంలో మంచి మార్కెట్ ప్రతి ఏటా ఉంటుందని అయితే ఈ ఏడాది చలితీవ్రత అంతగా లేకపోవడంతో రగ్గుల అమ్మకాలు అంతగాలేవని అతను వాపోయాడు. రెండు రోజులుగా వాతావరణంలో మబ్బుల కారణంగా చలిగాలులు వీస్తున్నాయని రగ్గులు, చలికోట్లు కొంటున్నారని చెప్పాడు. పండుగ వరకు ఇక్కడ వ్యాపారం చేసుకుని తిరిగి స్వరాష్ట్రం వెళిపోతామని చెప్పాడు.