రంగారెడ్డి

గ్రామీణ రోడ్లకు ఇక మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మార్చి 14: తెలంగాణ ప్రభుత్వ హయంలో గ్రామాల రోడ్లకు మహర్దశ వచ్చినట్లు పోచారం సర్పంచ్ గాంధారి లక్ష్మినారాయణ, చౌదరిగూడ సర్పంచ్ నక్క వరలక్ష్మి అన్నారు. మండల పరిధి జోడిమెట్ల గ్రామం నుండి అన్నానగర్‌కు వెళ్లేందుకు రూ.36 లక్షల నిధులతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు సోమవారం పరిశీలించారు. ప్రభుత్వం మంజూరు ఇచ్చిన నిధులను సద్వినీయోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి పధంలో నడిపించటమే ద్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు నాణ్యత కలిగి ఉండేలా తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. తమ గ్రామాల అభివృద్ధికి కావలసిన నిధులు ప్రభుత్వం మంజూరు ఇవ్వటంతో ప్రజలకు మరింత దగ్గర కాగలుగుతున్నా మన్నారు. పోచారం, చౌదరిగూడ పంచాయతీలకు సరిహద్దు రోడ్డు కావటంలో ఎమ్మెల్యే నిధులు పది లక్షలు, పోచారం పంచాయతీ నిధులు పది లక్షలు, చౌదరిగూడ పంచాయతీ నిధులు పది లక్షలు, మండల పరిషత్ నిధులు ఆరు లక్షలు మొత్తం 36 లక్షల నిధులతో సి సి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. సి సి రోడ్డు నిర్మాణ పనులను పోచారం సర్పంచ్ గాంధారి లక్ష్మినారాయణ, చౌదరిగూడ సర్పంచ్ నక్క వరలక్ష్మి, బైరు రాములుగౌడ్, ఉప సర్పంచ్ బైరు లక్ష్మణ్‌గౌడ్, మండల రైతు సేవా సహాకార సంఘం డైరక్టర్ బొక్క ప్రభాకర్‌రెడ్డి ఎంపిటిసి సభ్యులు నానావత్ బిక్కు నాయక్, మండల టిఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, పంచాయతీ సభ్యులు దుర్గారెడ్డి, రెడ్యానాయక్, రమేశ్‌కుమార్ తదితరులు పర్యవేక్షించారు.

మహిళా సాధికారతకు
ఐకమత్యమే ఆయుధం
తాండూరు, మార్చి 14: ప్రపంచవ్యాప్తంగా స్ర్తిజాతి ఐకమత్యంగా వుండడం కోసమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఏటా జరుగుతుందని రంగారెడ్డి జడ్‌పి చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్ర్తిశక్త్భివన్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి మహిళ తన తోటి మహిళను గౌరవించాలని, మహిళా సాధికారతకు మనందరి ఐకమత్యమే మహా ఆయుధమని పేర్కొన్నారు. ప్రతి మహిళా తన తోటివారితో ప్రేమ ఆప్యాయతలను కలిగివుంటేనే పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళతారని అన్నారు. ఉపాధి అవకాశాలను అందరూ ఉపయోగించుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకుంటే ప్రతి మహిళ తన కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు. మహిళలు పొదుపును అలవర్చుకుని కుటుంబానికి చేదోడుగా వుండాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కె.విజయలక్ష్మి మాట్లాడుతూ, మగవారితో సమానంగా మనం ఎదగాలన్నారు. స్ర్తిలకు అన్ని రంగాల్లో సమాన ప్రతిపత్తి, చట్టసభల్లో 50 శాతం ప్రాతినిధ్యం వుండాల్సిన అవసరం వుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ సునీతా సంపత్, మహిళా కౌన్సిలర్లు ఇతర మహిళలు పాల్గొన్నారు.

జీవో 571 రద్దుకు సిఫార్సు: కలెక్టర్ హామీ

మేడ్చల్, మార్చి 14: రజకులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్న జివో 571ను రద్దు చేసే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని కలెక్టర్ తెలిపారని తెలంగాణ రాష్ట్ర రజక జెఎసి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పంజగారి ఆంజనేయులు తెలిపారు. సోమవారం సంఘం ఆధ్వర్యంలో రజకుల సమస్యలపై కలెక్టర్ రఘునందన్‌రావును కలిసి నాయకులు వినతి పత్రం అందజేశారు. రజక సంఘం నాయకులు పలు విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. జివో 571 అనేది కేవలం పరిశ్రమ వర్గాలకే వర్తిస్తుందని అందులో దోబిఘాట్‌లను చేర్చడం సమంజసం కాదని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రద్దు చేయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారని వివరించారు. దోభిఘాట్‌లను చెరువు సమీపంలో శిఖం స్థలాలలో ఏర్పాటు చేస్తేనే ఉపయోగకరంగా ఉంటుందని ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ చెప్పారని నాయకులు తెలిపారు. నీటి లభ్యత లేని ప్రదేశాల్లో దోబిఘాట్‌లు ఏర్పాటు చేయడంతో నిరుపయోగంగా మారయని దోభిఘాట్‌లకు తగు నిధులు మంజూరు చేసి ప్రభుత్వంతో చర్చించి అనుమతి పత్రాలు అందించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ పేర్కొన్నట్లు నాయకులు వివరించారు. 15 మంది గ్రూప్‌గా సోసైటీ రుణాలు అందించే విధంగా బ్యాంకర్లతో చర్చిస్తానని చెప్పారని తెలిపారు. దోబిఘాట్‌లు ఉన్న స్థలాలను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసేవిధంగా ప్రభుత్వంతో అనుమతి తీసుకుంటామని చెప్పారని నాయకులు పేర్కొన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అడివయ్య, నాయకులు అనంతయ్య, శ్రీనివాస్, కృష్ణ, చంద్రయ్య, రాములు పాల్గొన్నారు.