జాతీయ వార్తలు

రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన టర్కీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా గగనతలంలోకి చొరబడింది: టర్కీ
సిరియాలోనే కూలిపోయింది: రష్యా
ఇది తీవ్రమైన సంఘటన: పుతిన్
‘నాటో’ అత్యవసర సమావేశం
అంకారా, నవంబర్ 24: నాటో సభ్య దేశమైన టర్కీ మంగళవారం సిరియా సరిహద్దుల్లో రష్యాకు చెందిన ఒక యుద్ద విమానాన్ని కూల్చి వేసింది. నాలుగేళ్లుగా సాగుతున్న సిరియా అంతర్యుద్ధంలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఈ సంఘటన కారణమైంది. రష్యాకు చెందిన యుద్ధ విమానం కేవలం అయిదు నిమిషాల్లో పదిసార్లు టర్కీ గగనతలాన్ని అధిగమించిన తర్వాత టర్కీకి చెందిన రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలు దాన్ని కూల్చి వేసాయని టర్కీ సైన్యం ప్రకటించింది. అయితే తమ విమానం ఏ దశలో కూడా టర్కీ గగన తలాన్ని ఉల్లంఘించలేదని వాదించిన రష్యా ఇది చాలా తీవ్రమైన సంఘటనగా అభివర్ణించింది. టర్కీ చర్య ఇరుదేశాల దౌత్య సంబంధాల్లో తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. కాగా, ఈ సంఘటనపై చర్చించేందుకు నాటో మంగళవారం అత్యవసరంగా సమావేశమవుతోంది. కాగా, ఈ సంఘటనపై తన నిరసనను తెలియజేయడానికి టర్కీలోని రష్యా రాయబారిని ప్రభుత్వం విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించింది. మరోవైపు రష్యా తమ దేశంలోని టర్కీ మిలిటరీ అటాచీని పిలిపించి నిరసన తెలిపింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లెవ్రోవ్ బుధవారం టర్కీలో పర్యటించనుండగా ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
ఆరువేల మీటర్ల ఎత్తులో తమ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు రష్యా ధ్రువీకరిస్తూ, భూతలంపైనుంచి దాన్ని కూల్చివేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. ‘్భమిపైనుంచి జరిపిన కాల్పుల కారణంగా రష్యా సైన్యానికి చెందిన ఒక ఎస్‌యు-24 విమానం సిరియన్ అరబ్ రిపబ్లిక్‌లో కూలిపోయింది’ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది చాలా తీవ్రమైన సంఘటన అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిఅతీ పెస్కోవ్ విలేఖరులతో అన్నారు. సిరియా సరిహద్దుకు ఆనుకుని ఉన్న టర్కీకి చెందిన యాయ్లాద్గి జిల్లాలో ఈ కూల్చివేత చోటు చేసుకున్నట్లు టర్కీ సైన్యం తెలిపింది. దౌత్య నిబంధనల ప్రకారం విమానాన్ని భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.34 గంటలకు (జిఎంటి ప్రకారం 7.24 గంటలకు) కూల్చివేసినట్లు తెలిపింది.
తమ యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చి వేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా మండిపడుతూ, ‘ఉగ్రవాదుల తోడు దొంగలు జరిపిన వెన్నుపోటు చర్య’ ఇదని అన్నారు. టర్కీ సరిహద్దులకు నాలుగు కిలోమీటర్ల దూరంలో సిరియా భూభాగంలో విమానం కూలిపోయిందని, అది ఏ విధంగాను టర్కీ గగనతలంలోకి ప్రవేశించలేదని మాస్కోలో జోర్డాన్ రాజు అబ్దుల్లాతో సమావేశం సందర్భంగా పుతిన్ అన్నారు. విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బైటికి దూకేసారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. రెండు తెల్లని పారాచూట్లు భూమి వైపుగా వస్తున్న దృశ్యాలను టర్కీ టెలివిజన్లు ప్రసారం చేసాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న సిరియాలోని తుర్క్‌మన్ దళాలు ఒక పైలట్‌ను బందీగా పట్టుకున్నట్లు ‘సిఎన్‌ఎన్-తుర్క్’ తెలిపింది. అయితే ఒక పైలట్ చనిపోయాడని, రెండో పైలట్ జాడ తెలియదని సిరియా ప్రతిపక్ష వర్గాలు ఎఎఫ్‌పి వార్తాసంస్థకు తెలిపాయి.