అక్షర

రష్యన్ కవితా రసధుని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రసధుని: రష్యన్ కవితలు-
స్వేచ్ఛానువాదం: డా.లంకా
శివరామప్రసాద్
వెల: రు.150/-,
ప్రతులకు: ప్రముఖ పుస్తక
విక్రయ కేంద్రాలు.
విదేశీ కవితలు ప్రధానంగా ఆంగ్ల భాషనుండి ఎక్కువగా భారతీయ భాషలలోకి తెలుగులోకి సమృద్ధిగానే వచ్చాయి. కాని రష్యా వంటి దేశాల కవితలు అంతగా రాలేదు. ఆ కొరతను ఈ సంపుటం తీరుస్తున్నది. దీని పేరు రసధుని- అనువాదకుడు డాక్టర్ లంకా శివరామప్రసాద్‌గారు. 1767నుండి 1967 వరకు వచ్చిన రెండు శతాబ్దాల లఘుకవితలు ఇందులో పొందుపరిచారు. ఇందులో దాదాపు నూరు కవితలున్నాయి. రష్యన్ నుండి ఇంగ్లీషులోకి వచ్చిన అనువాదం ఆధారంగా తెలుగులోకి ఈ స్వేచ్ఛానువాదం సాగింది. ప్రతి భాషకు ఒక నుడికారం ఉంటుంది. ముఖ్యంగా కవిత్వంలో అది తప్పనిసరిగా ధ్వనిస్తుంది. ఇప్పుడు రెండు భాషలు మారటంవలన మూలంలో ఏమున్నదో స్పష్టంగా పోల్చుకోలేకపోయినా స్థూలంగా భావాన్ని గ్రహించవచ్చు. ఏ కవితకైనా ఆ దేశపు సామాజిక మత సాంఘిక రాజకీయ పరిస్థితులలో అవగాహన ఉండాలి. అందుకని ఈ కవితలు చదివి చదివి ఆనందించాలనుకునేవారు ప్రాచీన- ఆధునిక రష్యా చరిత్రను కొంత అధ్యయనం చేయటం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కవితలన్నీ సరళ వచన కవితాప్రక్రియలో సాగాయి కాబట్టి పాఠకులకు సౌలభ్యం లభించింది. ఇందులో డెబ్బది ముగ్గురు కవులు, నలుగురు రచయిత్రుల రచనలున్నాయి.
‘‘జేబులో కస్తూరి పెట్టుకున్న వాడి గురించి ఎవరూ చెప్పనక్కరలేదు’’ అంటాడు సాదీ (140పుట) దెబ్బలాడుకున్న కవులు మంచుకింద అదృశ్యమైనారు. మహాకవిత మాత్రమే మిగులుతుందని దీని అర్థం. యూరోస్లావ్ స్మెలియకోవ్ (1966) రచన ఒక జోలపాటలోని రష్యన్ భాషను వర్ణిస్తున్నది. ఇందులో నాజీల నియంతృత్వం దేశభక్తి వంటి అంశాలున్నాయి. నికొలాయి రైల్మెన్‌కోవ్ ఒక రైతు. అతడు రైధాన్యాన్ని పండించి దానితో రొట్టె చేసుకోవటం ఒక కవితలో ఉంది (149వ పుట). ఇలా రష్యన్ల జీవితాలను ఈ కవితా సంపుటి పరిచయం చేస్తుంది. ప్రపంచ సాహిత్యం అనే శీర్షికలో ప్రచురణకర్తలు వెలువరించిన 19వ సంపుటం ఇది. అలెగ్జాండర్ పుష్కిన్ వంటి ఆ శతాబ్దం రచయితలకు అలగ్జాండర్ ట్వార్టోలిస్కీ వంటి తరువాతి తరం రచయితలకు మధ్యగల ఆలోచనా సరళిలోని అంతరాలను స్పష్టంగా గమనింపవచ్చు. ‘కొత్తపదాలు- అగ్నితాడు- బుల్లెట్- గొడ్డలి’ తమతోనే పయనిస్తాయి- ఇది మారిన వారి జీవనశైలికి సాక్ష్యం!!

-ముదిగొండ శివప్రసాద్