జాతీయ వార్తలు

సంప్రదాయ వైద్యంలో యోగాను సమ్మిళితం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 3: ఆరోగ్య రంగంలో యోగాను, భారతీయ సంప్రదాయ వైద్యాన్ని సమ్మిళితం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ఈ రెండింటిని మరింత సన్నిహితం చేసి భారతీయుల, మిగతా ప్రపంచ ప్రజలందరి జీవన శైలిలో భాగం చేయాలని ఆయన ఉద్బోధించారు. బెంగళూరుకు సుమారు 30 కిలో మీటర్ల దూరంలోని జిగనిలో గల డీమ్డ్ యూనివర్శిటీలో వివేకానంద యోగా అనుసంధాన సంస్థానలో ‘యోగా పరిశోధనలో పరిమితులు- దాని అనువర్తనం’ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సును ఆదివారం మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రూపాల్లో ఉన్న వైద్య వ్యవస్థలను అనుసంధానం చేయడం ద్వారా వాటి మధ్య ఉన్న అంతరాన్ని తొలగించాలని ఆరోగ్య రంగంలో ఉన్న ప్రొఫెషనల్స్, విధాన నిర్ణేతలు, ప్రభుత్వ సంస్థలు, ఇండస్ట్రీకి సూచించారు. ‘ఆరోగ్య రంగంలో యోగాను, భారతీయ సంప్రదాయ వైద్యాన్ని మీరు అనుసంధానించి, మరింత సన్నిహితం చేస్తారన్న విశ్వాసం నాకు ఉంది’ అని ప్రధాని సభికులను ఉద్దేశించి అన్నారు. వేర్వేరు సంప్రదాయ వైద్యాలను అవగాహన చేసుకొని, వాటిని అత్యంత ఉత్తమమైన, అత్యంత సమర్థవంతమైన వైద్య వ్యవస్థలుగా తీర్చిదిద్దే సమీకృత వ్యవస్థ ఆరోగ్య రంగంలో ఆవిష్కృతం కావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆధునిక వైద్య వ్యవస్థలు ఆరోగ్య రంగాన్ని వ్యాధులను గుర్తించే స్థాయికి అభివృద్ధి చేశాయని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం వల్ల ఆరోగ్య రంగంలోని అవకాశాలను పొందడానికి ఉన్న ఆటంకాలను తగ్గించాయని, వ్యాధుల తీరుకు సంబంధించిన మన అవగాహనను మెరుగుపరిచాయని ఆయన అన్నా రు. కొత్త ఔషధాలు, కొత్త వాక్సిన్లను కనుక్కోవడం అనేక వ్యాధులను జయించడంలో, నియంత్రించడంలో దోహదపడిందని ఆయన చెప్పారు.
అయితే ఆధునిక వైద్యం పరిమితులు, దుష్ఫలితాలకు సంబంధించి మనకు అవగాహన పెరగడంతో పాటు దాన్ని పొందడానికి వ్యయం పెరిగిన నేపథ్యంలో నేడు భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ మనం సంప్రదాయ వైద్యం వైపు చూస్తున్నామని ప్రధాని అన్నారు. నేడు యోగా ప్రపంచ వారసత్వంగా మారిందని, ప్రపంచం భారతీయ సంప్రదాయ వైద్యం వైపు ఉత్సుకతతో చూస్తోందని ఆయన తెలిపారు.

అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతున్న ప్రధాని మోదీ