Others

ఆవేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని వింటున్నా, ఎన్ని కంటున్నా
ఏదో తెలియని అలజడి
అంతరంగాన్ని తొలిచేస్తోంది
అందుకే
ఇంకా చీకట్లోనే వున్నాననుకుంటున్నా
భవిష్యద్యుతులు
బాలభాను కిరణాల్లా
విశ్వగోళంలో జ్వలించాలని ఊహిస్తున్నా
మానవ మనుగడలో
మధురిమలెలా నింపాలని ఆలోచిస్తున్నా
కను మూసినా లోమనసులో
భావతీరాలను చేరలేకపోతున్నా
నాలోని శతకోటి భావాలు
నిలువెత్తు భవంతిని నిర్మించాలని యత్నిస్తున్నా
విశ్వమానవాళికి ప్రేమామృత గీతాలను
వినిపించాలని తపిస్తున్నా
కనిపించని నా జాతి ఖ్యాతి
సమానతా కాంతిని విరజిమ్మాలని వాంఛిస్తున్నా
భూనభోంతరాలలో
రాగానురాగాల్ని పండించాలని ఆశిస్తున్నా
విశ్వమానవ హృదయాలపై
సుస్వరూప చిత్రాలను గీయాలని కాంక్షిస్తున్నా
నా ముందు నడిచే నా జాతిని
మంచిదారికి మళ్లించాలని చూస్తున్నా
అదే నా వాదన, ఆవేదన...

- ఎన్.సి. రామసుబ్బారెడ్డి 7893089007