రాష్ట్రీయం

సీట్లు 3.. బరిలో నలుగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఖాళీ కానున్న మూడు స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగున్నాయి. మూడు స్థానాలకుగాను ఎన్నికలు జరుగనుండగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. రాజ్యసభ ఎన్నికలకు ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నారు. రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న మూడు స్థానాలను గెలుచుకోవడానికి సరిపడ బలం టిఆర్‌ఎస్‌కు ఉన్నప్పటికీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి కూడా నిలుబడంతో పోలింగ్ అనివార్యం అయింది. టిఆర్‌ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్ పోటీలో ఉండగా కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బల్‌రామ్ నాయక్ బరిలో నిలుచున్నారు. రాజ్యసభ పోలింగ్‌కు బిజెపి, టిడిపి, సిపిఎం దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు గురువారం ప్రకటించాయి. ఇలా ఉండగా రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీటిలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను ఇటీవల శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో 117 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే బిజెపి, టిడిపి, సిపిఎం పార్టీలు పోలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. బిజెపికి ఐదుగురు, టిడిపికి ముగ్గురు, సిపిఎంకు ఒకరు మొత్తంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పోలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో 108 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో టిఆర్‌ఎస్ నుంచి 90 మంది, కాంగ్రెస్ నుంచి 11 మంది, ఎంఐఎం నుంచి 7గురు మొత్తంగా 108 మంది ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికలకు తమ ఓటు వినియోగించుకోనున్నారు. టిఆర్‌ఎస్‌కు సొంతంగా ఉన్న 90 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎంకు చెందిన 7గురు ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తున్నారు. దీంతో టిఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులకు 97 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించనుంది. తమ అభ్యర్థులకు ఓటు వేయడంలో ఎమ్మెల్యేలు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఇద్దరు అభ్యర్థులకు 32 మంది చొప్పున, మూడవ అభ్యర్థికి 33 మంది ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్ కేటాయించింది. ఒక్కో అభ్యర్థికి కేటాయించిన ఎమ్మెల్యేలకు ఇద్దరేసి మంత్రులను ఇంజార్జీలుగా టిఆర్‌ఎస్ నియమించింది. తెలంగాణ భవన్‌లో మూడు రోజులుగా మాక్ పోలింగ్ నిర్వహించగా
చివరి రోజు గురువారం సాయంత్రం మాక్ పోలింగ్‌కు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్వయంగా హాజరయ్యారు. మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులను టిఆర్‌ఎస్ బరిలో దింపడం, వీటిని గెలుచుకునేంతటి ఎమ్మెల్యేల సంఖ్య టిఆర్‌ఎస్‌కు ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నామమాత్రమే కానుంది.
పోలింగ్ 9 గంటలకు ప్రారంభం
శాసనసభ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 5 గంటలకస ఓట్ల లెక్కింపు జరుగనుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ స్వయంగా రాజ్యసభ పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు.
బలం లేకున్నా కాంగ్రెస్ పోటీ చేయడం దౌర్భగ్యం: కేసీఆర్
రాజ్యసభ ఎన్నికల్లో బలం లేకున్నా కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టడం ఆ పార్టీ దౌర్భగ్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన మాక్ పోలింగ్‌కు హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, బలం లేకున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం ఆ పార్టీ దౌర్భగ్య పరిస్థితికి నిదర్శనమన్నారు. రాబోయే సాధారణ ఎన్నికలపై మూడవసారి కూడా సర్వే నిర్వహించగా టీఆర్‌ఎస్ పార్టీయే తిరిగి ఘన విజయం సాధిస్తుందని తేలిందన్నారు. శుక్రవారం జరుగనున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉదయం 7.30 గంటలకల్లా తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో శాసనసభకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీ సభ్యులంతా ఒకేసారి ఓటు వేయాలని సిఎం సూచించారు.

చిత్రం..రాజ్యసభ పోలింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి డాక్టర్ వి. నర్సింహాచార్యులు