రాష్ట్రీయం

ఉలిక్కిపడ్డ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హతమార్చిన ఘటనతో ఉత్తర తెలంగాణ ఉలిక్కిపడింది. ఈ ప్రాంతంలోని జిల్లాల్లో దండకారణ్యం విస్తరించి ఉంది. గతంలో ఈ ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి పట్టు ఉండేది. అయితే గడిచిన నాలుగైదేళ్లుగా నక్సల్స్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడంతో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. నక్సల్స్‌ను పూర్తిగా ఏరివేసామని, ఇక వారి బెడదలేదన్న నమ్మకాన్ని పోలీసులు కల్పించగలిగారు. అదే ధీమాతో పూర్వ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇదే విధమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా నెలకొనడంతో అక్కడి ప్రజాప్రతినిధులు మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో నిర్భయంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పసిగట్టలేని విధంగా అరకులో నక్సల్స్ మెరుపుదాడి చేసారు. నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని భావిస్తోన్న తరుణంలో అరకులో జరిగిన ఘటనతో ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజాప్రతినిధుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ప్రజాప్రతినిధులు తాజా సంఘటనతో దండకారణ్య ప్రాంతంలో విరివిగా ప్రచారం చేయగలమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో దండకారణ్యం విస్తరించి ఉంది. ఒకనాడు నక్సల్స్‌కు డెన్‌గా ఉన్న ఈ ప్రాంతంలో తాజా ఘటన నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లగలమా? అని తాజా మాజీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పాలకపక్షం టీఆర్‌ఎస్ నేతలు భయపడిపోతున్నారు. నక్సల్స్ ఎజెండా అమలు చేస్తామని తెలంగాణ ఉద్యమ సందర్భంగా పలుమార్లు ప్రకటించిన కేసీఆర్, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మావోయిస్టు ఉద్యమంపై ఉక్కుపాదం మెపారని వారి సానుభూతి పరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పౌరహక్కుల సంఘాలను, ప్రజా సంఘాలను, వామపక్ష తీవ్రవాదాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని మావోయిస్టులు మీడియాకు ప్రకటనలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అరకులో జరిగిన తాజా ఘటన నేపథ్యంలో హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదన్నారు. ఇక్కడ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. అరకు సంఘటన నేపథ్యంలో ఇక్కడి ప్రజాప్రతినిధులకు పూర్తి రక్షణ కల్పించనున్నట్టు తెలిపారు. గతంలో నక్సల్స్ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లే అభ్యర్థులు, నాయకులు ముందుగా ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయాలని తాజా ఘటన నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తం చేసింది.