రాష్ట్రీయం

రేపు అభ్యర్థుల ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) లోక్‌సభ అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించాలని పార్టీ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు పూర్తి అయినప్పటికీ బుధవారం చతుర్దశి కావడంతో గురువారం పౌర్ణమి మంచి తిథి ఉండటంతో ఆ రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. పీటముడిగా మారిన ఖమ్మం స్థానానికి మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్ బ్యూ రో సభ్యుడు నామా నాగేశ్వర్‌రావు అభ్యర్థిత్వం ఖరా రు కావడంతో అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చింది. ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వర్‌రావును ఖరారు చేయడంతో మంగళవారం సాయంత్రం ఆయన టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుని పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై నెలకొన్న సందిగ్ధత తొలిగిపోవడంతో మల్కాజ్‌గిరి అభ్యర్థి విషయంలోనే ఇంకా కసరత్తు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఈ స్థానానికి ఐఏఎస్ అధికారి, సిరిసిల్ల కలక్టర్ వెంకట్రామ్‌రెడ్డి పేరును అధినేత కేసీఆర్ పరిశీలిస్తోన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌రెడ్డిని బరిలోకి దించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం యోచిస్తుంది. దీంట్లో భాగంగానే సిరిసిల్ల కలక్టర్ వెంకట్రామ్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చినట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. ఇలా ఉండగా మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డిని ఖరారు చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీ ఎపి జితేందర్‌రెడ్డినే బరిలోకి దించాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. చేవెళ్ల టికెట్‌ను మాజీ మంత్రి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డిని ఖరారు చేయడంతో ఆయన మంగళవారం సాయంత్రం శంషాబాద్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పెద్దపల్లి ఎంపీ టికెట్‌పై నెలకొన్న సందిగ్థతకు కూడా తెరపడింది. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి టీఆర్‌ఎస్ టికెట్ దాదాపు ఖరారు అయినట్టేనని టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. సికింద్రాబాద్ టికెట్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడు సాయి కిరణ్ యాదవ్‌కు ఆశిస్తున్నారు. ఈ స్థానం నుంచి పార్టీ నేతలు పలువురు టికెట్ ఆశిస్తున్నప్పటికీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కున్న అంగబలం, ఆర్థిక బలం దృష్ట్యా పార్టీ అధినేత కేసీఆర్ సాయికిరణ్ యాదవ్ అభ్యర్థిత్వానికే సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. నల్లగొండ నుంచి పోటీకి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సుముఖంగా లేనట్టు సమాచారం. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపడంతో సుఖేందర్‌రెడ్డినే మళ్లీ బరిలోకి దింపాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం యోచిస్తోంది. గుత్తా అంగీకరించని పక్షంలోనే కొత్త అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం.
చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ ఆరు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల నుంచి సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ అవకాశం కల్పించినట్టు టీఆర్‌ఎస్ పార్టీ వర్గాల సమాచారం.