ఆంధ్రప్రదేశ్‌

సింహాచలం కేశ ఖండనశాలలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఫిబ్రవరి 15 : సింహాచలం దేవస్థానం కేశఖండన శాలలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారికి భక్తులు మొక్కుల రూపంలో చెల్లించిన తలనీలాలను దొంగలు అపహరించుకుపోయారు. సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే 150 కిలోల బరువు గల పది మూటలను దొంగలు అపహరించుకుపోయినట్టు దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ తెలియజేశారు. దొంగలు పక్కా వ్యూహం ప్రకారం చోరికి పాల్పడినట్లు సంఘటన జరిగిన తీరును బట్టి తెలుస్తోంది. సోమవారం ఉదయం కేశఖండన శాలకు వచ్చిన సిబ్బంది తలనీలాలు భద్రపరిచే గది తలుపు తెరిచిఉండి, తలనీలాలు మూట గేటు వద్ద పడి ఉండటాన్ని చూసి వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. అధికారులంతా కేశఖండన శాలకు చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. తలనీలాలు భద్రపరిచే గది తలుపుల గడియలను స్క్రూ డ్రైవర్ సాయంతో తొలగించి దొంగలు లోపలకి ప్రవేశించారు. భవనంపై అంతస్తులో ఉన్న గేటు తాళంకప్పను కోసి తలుపు తెరిచారు. ముందుగదిలో పదుల సంఖ్యలో తలనీలాలు మూటలు ఉన్నప్పటికీ గ్రేడ్ వన్ క్వాలిటీ తలనీలాలు భద్రపరిచిన గదిలోకి వెళ్లి మూటలను అపహరించారు. భవనంపై అంతస్తు నుండి మూటలు దిగువ తుప్పల్లో పడవేసి అక్కడ నుండి వాహనంలో తరలించుకుపోయి వుంటారని అనుమానిస్తున్నారు.