బిజినెస్

రూ. 500లకే స్మార్ట్ఫోన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ రింగింగ్ బెల్స్.. ఈ వారం భారత్‌లోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. భారతీయ మొబైల్ మార్కెట్‌లో ఓ విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ రానున్న ఈ స్మార్ట్ఫోన్ ధర 500 రూపాయల దిగువనే. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్ (‘దేశంలోని ప్రతి వ్యక్తికి భారత సాధికారికత ఫలాలు అందాలి. భారత వృద్ధిరేటు లబ్ధి చేకూరాలి.’) లక్ష్యసాధనలో భాగంగా ఈ మొబైల్‌ను తీసుకొస్తున్నట్లు నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్ఫోన్ కొనాలంటే కనీసం 1,500 రూపాయలైన ఖర్చు చేయాల్సి వస్తోందని, అయితే అందులో మూడో వంతు ధరకే తాము స్మార్ట్ఫోన్‌ను వినియోగదారుడికి అందించదలచామని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలతో ఇది సాధ్యపడిందని సంస్థ పేర్కొంది. ఇకపోతే ‘ఫ్రీడమ్ 251’ పేరిట విడుదలవుతున్న ఈ స్మార్ట్ఫోన్‌ను రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ఈ నెల 17 (బుధవారం)న ఆవిష్కరించనున్నారు. నిజానికి అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)తో కలిసి డేటావిండ్ సంస్థ ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు, 999 రూపాయలకే స్మార్ట్ఫోన్‌ను అందిస్తామని గత ఏడాది ప్రకటించింది. అయితే ఇంకా అది మార్కెట్‌లోకి రాలేదు. ఈ క్రమంలో రింగింగ్ బెల్స్ పరిచయం చేస్తున్న స్మార్ట్ఫోన్.. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్ అవనుంది. ఆర్‌కామ్-డేటావిండ్ స్మార్ట్ఫోన్ ధరలో ఇది సగమే మరి. గత ఏడాదే రింగింగ్ బెల్స్ స్మార్ట్ఫోన్ల తయారీని ప్రారంభించగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సకల సౌకర్యాలతో రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, దేశీయ మొబైల్ మార్కెట్‌లోకి ఈమధ్యే అడుగుపెట్టిన రింగింగ్ బెల్స్.. ఇటీవలే 2,999 రూపాయలకు భారత్‌లోనే అత్యంత చౌక 4జి స్మార్ట్ఫోన్‌ను పరిచయం చేసింది. మార్కెట్‌లో మరో రెండు రకాల ఫీచర్ ఫోన్లనూ ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే స్మార్ట్ఫోన్ మార్కెట్లలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. రాబోయే కొనేళ్లలో అమెరికా తర్వాతి స్థానం భారత్‌దేనని గణాంకాలు కూడా చెబుతున్నాయి. దీంతో ఇటీవలికాలంలో షియామి, జియోని తదితర విదేశీ సంస్థలెన్నో భారతీయ మార్కెట్‌లో తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను అందిస్తూ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రింగింగ్ బెల్స్ 500 రూపాయలకే స్మార్ట్ఫోన్‌ను తీసుకురావడం వల్ల మిగతా సంస్థల స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టడం ఖాయమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఫలితంగా సామాన్యుడికీ స్మార్ట్ఫోన్ అందుతుందని విశే్లషిస్తున్నాయి. అవును మరి.. అరకొర సౌకర్యాలతో కేవలం మాట్లాడుకునే సౌకర్యం కలిగిన ఫోన్ ధరే నేడు 500 రూపాయలపైనుండగా, ఏకంగా స్మార్ట్ఫోన్ ఇంతకంటే తక్కువ ధరకు వస్తుండటం నిజంగా ఆశ్చర్యమే.