క్రీడాభూమి

సాన్‌టినా జైత్రయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, ఫిబ్రవరి 15: సాన్‌టినాగా గుర్తింపు పొందిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ప్రపంచ మాజీ నంబర్ వన్ మార్టినా హింగిస్ జోడీ తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఇక్కడ జరిగిన సెయింట్ పీటర్స్‌బర్గ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈ జోడీ టైటిల్ సాధించింది. ఫైనల్‌లో వీరు వెరా దెషెవినా, బార్బరా క్రెజికొవా జోడీని 6-3, 6-1 తేడాతో చిత్తుచేశారు. వీరికి ఇది వరుసగా 40వ విజయం కావడం విశేషం. వీరికి ఈఏడాది ఇది నాలుగో టైటిల్. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రాబర్టా విన్సీ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె 6-4, 6-3 తేడాతో 18 ఏళ్ల బెలిండా బెనిక్‌ను ఓడించింది.