సంగీతభరిత దృశ్యకావ్యం... ప్రేమమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంనుండి రీమేక్ చేస్తున్న ‘ప్రేమమ్’ చిత్రానికి తెలుగులో కూడా అదే పేరును నిర్ణయించారు. నాగచైతన్య, శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ ప్రధాన తారాగణంగా చందు మొండేటి దర్శకత్వంలో సితార సినిమా పతాకంపై సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. ఈ చిత్రానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ పూర్తయింది. వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ప్రేమతో కూడిన సంగీతభరిత దృశ్యకావ్యంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు సగం పూర్తయిందని, ఈ చిత్రంలో చైతు, శృతిహాసన్‌ల నటన హైలెట్‌గా ఉంటుందని తెలిపారు. ‘లవ్ స్టోరీస్ అండ్.. ఫీలింగ్స్ డోంట్..’ అనే ఉప శీర్షికతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రేమకథలకు ముగింపు ఉంటుంది కానీ.. అనుభూతులకు ఉండదు.. అనే కోణంలో నాగచైతన్య మూడు వైవిధ్యమైన కోణాల్లో కనిపిస్తారని, మూడు ఒకదానికి ఒకటి పాత్రోచితంగా, విభిన్నంగా సాగుతూ ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాయని దర్శకుడు చందు మొండేటి అన్నారు. మూడు ప్రేమకథల సమ్మిళితంగా ప్రతి కథ సరికొత్తగా సాగే ఈ చిత్రానికి సంబంధించిన పలు మార్పులను చేశామని, అవి అందరికీ నచ్చుతాయని ఆయన అన్నారు. జీవా, బ్రహ్మాజీ, నర్రా శ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవింద్‌కృష్ణ, సత్య, కార్తీక్‌ప్రసాద్, నోయల్, ఈశ్వరిరావు, జోగినాయుడు, కృష్ణంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, రాజేష్ మురుగేశన్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, కథ: ఆల్ఫెన్సో పుథరిన్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.