జాతీయ వార్తలు

సంక్షేమానికి ‘కోత’ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: కేంద్ర ప్రభుత్వం వచ్చే మంత్రివర్గం సమావేశంలో రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని 3 నుంచి 3.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని, బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే రాష్ట్రానికి సిఎస్‌టి నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి దాదాపు రెండు వేల కోట్ల బకాయిలు రావలసి ఉందని ఆయన తెలిపారు. రాజేందర్ శుక్రవారం విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు కోత విధించకుండా చూడాలని జైట్లీని కోరినట్టు తెలిపారు. దేశమంతా ఒకే రకమైన పన్నుల విధానం ఉండాలని అన్ని రాష్ట్రాలు కోరుతున్నందున జిఎస్‌టి తప్పకుండా అమలవుతుందని ఈటల అభిప్రాయపడ్డారు. బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో జిఎస్‌టి బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించే అవకాశాలున్నాయని రాజేందర్ చెప్పారు. జిఎస్‌టి ఎంపవర్ కమిటీ అధ్యక్షుడుగా పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఈటల అన్నారు. జిఎస్‌టి అమలైతే హైదరాబాద్‌లో సర్వీస్ పన్నుల ఆదాయం పెరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. సిఎస్‌టి పన్ను బకాయిలను చెల్లించటం ద్వారా కేంద్రంపై రాష్ట్రాల విశ్వాసం పెంచుకోవాలని తాను అరుణ్‌జైట్లీని కోరినట్టు ఈటల వెల్లడించారు. కాగా కేంద్ర ప్రభుత్వం మాటలు చెప్పడమే తప్ప రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడం లేదని ఆయన విమర్శించారు. అన్ని రకాల పన్నులపై కేంద్రం ఆధిపత్యం పెరగటం వల్ల రాష్ట్రాల హక్కులు, స్వేచ్ఛ హరించబడతాయనే అనుమానాన్ని ఈటల వ్యక్తం చేశారు. జిఎస్‌టి వల్ల రాష్ట్రాలకు నష్టం కలగగుండా చూడాలని కోరిన ఆయన‘జిఎస్‌టి విషయంలో రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిష్కరించడంలో కేంద్రం సానుకూల వైఖరిని అవలంభించడం లేదు’అని మంత్రి ఆరోపించారు. రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. జిఎస్‌టి వల్ల తెలంగాణకు పెద్దగా లాభం లేకపోయినా హైదరాబాద్‌లో సర్వీస్ పన్నుల వసూళ్లు బాగా పెరగటం వల్ల ప్రయోజనం చేకూరుతుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.