జాతీయ వార్తలు

సల్వీందర్ నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/అమృత్‌సర్, జనవరి 21: పఠాన్‌కోట్ ఉగ్ర దాడి కేసుకు సంబంధించి పంజాబ్ పోలీస్ ఎస్‌పి సల్వీందర్ సింగ్ నివాసాల్లో ఎన్‌ఐఏ గురువారం సోదాలు జరిపింది. ఐదుచోట్ల జరిపిన ఈ సోదాల్లో సల్వీందర్‌సింగ్, ఆయన స్నేహితులు, వంటమనిషి నివాసాల్లో విస్తృతంగా సోదాలు జరిపింది. పఠాన్‌కోట్ ఘటనకు ముందురోజు సల్వీందర్, ఆయన స్నేహితుడు రాకేష్ వర్మ, వంటమనిషి మదన్‌గోపాల్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం, జువెలరీ వ్యాపారి అయిన రాకేష్ వర్మ గొంతుపై గాయం కావడం వంటి ఘటనలపై ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా సల్వీందర్ సింగ్‌ను విచారిస్తున్న ఎన్‌ఐఏ, ఆయనపై లైడిటెక్టర్ పరీక్ష కూడా జరిపిన అనంతరం ఈ సోదాలు జరగడం గమనార్హం. అంతేకాకుండా సల్విందర్ వ్యక్తిత్వంపైనా, ప్రవర్తనపైనా ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నారు. మరికొద్ది రోజుల్లో ఇందుకు సంబంధించి సల్విందర్‌ను నిపుణులైన శాస్తవ్రేత్తల బృందం ముందు ప్రవేశపెట్టే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.