విశాఖపట్నం

సీనియర్ల చేరికపై పీట ముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారిని వచ్చినట్టు చేర్చుకుంటున్న తెలుగుదేశం పార్టీ కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు విషయంలో మాత్రం స్పష్టమైన వైఖరిని ప్రదర్శించలేకపోతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన దాడి వీరభద్రరావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా ఇమడలేక ఇప్పుడు తటస్థంగా ఉన్నారు. అయితే, ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి మార్గాన్ని సుగమం చేసుకున్నారు. అయితే, తాజా రాజకీయ సమీకరణలు ఆయన మోకాలుకు అడ్డుపడుతున్నాయి. చాలా కాలంగా కొణతాల రామకృష్ణ తన అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఆయనను రా రమ్మని పిలుస్తోంది. అయితే, ఆయన ప్రతి అడుగు ఆచి తూచి వేస్తారన్నది అందరికీ తెలిసిందే. కొణతాల రామకృష్ణ కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన టిడిపిలోకి రావడం ఇక లాంఛనమే అనుకున్నారు. కొణతాలను నమ్ముకున్న వారంతా ఇదే భావించారు. అయితే, ఈ ప్రక్రియలో మళ్లీ స్తబ్దత నెలకొంది. కొణతాలతోపాటు, ఆయన అనుచరులు కూడా పార్టీకి వస్తే, తమకు ఇబ్బందులు తప్పవని తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు, నాయకులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొణతాల అనుచరుడు గండి బాబ్జి రాకను పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ వ్యతిరేకిస్తున్నారు. ఆయనతోపాటు మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా కొణతాల వర్గం రాకపై కాస్త ముభావంగానే కనిపిస్తున్నారు. దీంతో కొణతాల వర్గం పునరాలోచనలో పడిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వస్తోందని జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో టిడిపిలో చేరేందుకు అటు వైకాపా నాయకులైనా, ఇటు పొలిటికల్ సీనియర్లైనా కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటి గురించి కొణతాల వర్గం ఏమనుకుంటుందో కానీ, టిడిపిలో చేరికపై స్పష్టత ఇవ్వడం లేదు. కొణతాల ఎటూ నిర్ణయం తీసుకోపోవడం వలన టిడిపిలోకి వద్దామనుకున్న దాడి వీరభద్రరావు ఆశలు నెరవేరడం లేదు.
అనకాపల్లి నియోజకవర్గంలో దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ ఉత్తర, దక్షిణ ధృవాలు. ఈ రెండు వర్గాలకు ఎప్పుడూ సయోధ్య లేదు. దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీలో సీనియర్. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఒకే పార్టీలో కొనసాగారు. ఉన్నత పదవులను కూడా అలంకరించారు. ఎమ్మెల్సీ పదవి తిరిగి ఇవ్వకపోవడంతో అలిగి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఈ ఫార్ములాని ఆధారంగా చేసుకుని దాడి వీరభద్రరావు మళ్లీ మాతృ పార్టీకి వెళ్లిపోవాలని నిర్ణయింకున్నారు. సీనియర్ నాయకుడిని వదులుకోడానికి ఇష్టంలేని టిడిపి ఆయన రాకకు ఓకే అంది. కానీ ఇక్కడే సమస్య తలెత్తింది. పార్టీలోకి ముందుగా దాడి వీరభద్రరావును తీసుకుంటే, కొణతాల రామకృష్ణ, అతని వర్గీయులు రారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కొణతాలను వంటరిగా వదిలేస్తే, వచ్చే ఎన్నికల్లో ఆయన మరింత బలీయమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తిని పార్టీలోకి ఎలాగైనా తీసుకురావాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచన. ఇది తేలాలంటే, జిల్లాలోని తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొణతాల రాకను అంగీకరించాలి. కొణతాల టిడిపిలో చేరేందుకు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నందున ఈ వ్యవహారం ఎప్పటికి తేలుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. పోనీ కొణతాలను తీసుకున్న తరువాతైనా, దాడి వీరభద్రరావును టిడిపి అక్కున చేర్చుకుంటుందా? అన్నది చర్చనీయాంశమైంది.

010 పద్దుద్వారా జీతాలు కోరుతూ
* నడిసంద్రంలో నిరసన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని కోరుతూ విఎంసి స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్ (గుర్తింపు యూనియన్) ఆధ్వర్యంలో శుక్రవారం సముద్రంలో నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వమే చెల్లించాలని గత రెండు రోజులుగా నిరసన తెలుపుతున్న గుర్తింపు యూనియన్ ప్రతినిధులు వినూత్న నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గుర్తింపు యూనియన్ సెక్రటరీ జనరల్ వివి వామనరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోందని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న ఈ కీలక నిర్ణయం కారణంగా మున్సిపాలిటీలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలో మాత్రం జీతాలను ఆయా స్థానిక సంస్థలే భరిస్తున్నాయన్నారు. దీనివల్ల అధికశాతం నిధులు సిబ్బంది జీత,్భత్యాలకే సరిపోతోందన్నారు. దీనివల్ల అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనకు విఘాతమేర్పడుతోందన్నారు. గతేడాది జివిఎంసికి ఆస్తిపన్ను ద్వారా రూ.360.6 కోట్లు ఆదాయం లభించగా, దీనిలో రూ.256 కోట్లు జీత,్భత్యాలకు, మరో 27.24 కోట్లు పదవీవిరమణ చేసిన ఉద్యోగులకే మళ్లిందన్నారు. గతంలో మున్సిపల్ వర్కర్ల సమ్మె సందర్భంగా సిబ్బంది జీతాలను 010 పద్దుద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జివిఎంసిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే పలు రూపాల్లో తాము ఆందోళన చేశామని, నగర ప్రజలకు అత్యుత్తమ సేవలందించే దిశగా జివిఎంసిని అర్థికంగా ఆదుకునేందుకు 010 పద్దు ద్వారా జీతాలు సాధించేందుకు తాము నిరంతరం శ్రమిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు పి రమేష్, ప్రధాన కార్యదర్శి ఎస్ పద్మనాభరాజు, అదనపు ప్రధాన కార్యదర్శి గొండు సీతారాం, జెమ్స్ ప్రధాన కార్యదర్శి ఎ అప్పారావు, ఇంటక్ నాయకులు వి కనకరాజు, కె ఎల్లయ్య, జివి కుమార్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

నగరంలో ఒడిశా అసెంబ్లీ కమిటీ పర్యటన
* ఒడియా మైనార్టీ వర్గాల సమస్యలపై ఆరా
* ఒడియాను రెండో భాషగా గుర్తించాలని సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: ఒడిశా అసెంబ్లీకి చెందిన భాషా మైనార్టీ సబ్‌కమిటీ విశాఖ నగరంలో శుక్రవారం సందర్శించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒడియా మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యా పరంగా వారికి అందుతున్న సదుపాయాలపై సబ్ కమిటీ భేటీ అయింది. ప్రభుత్వ అతిధిగృహంలో జిల్లా కలెక్టర్ ఎన్ యువరాజ్‌తో పలు అంశాలపై కమిటీ అధ్యక్షుడు రమేష్‌చంద్ర ఛాయా పట్నాయక్ ఆధ్వర్యంలోని సభ్యుల బృందం చర్చించింది. నగరంలో రెండు జివిఎంసి పాఠశాలల్లో ఒడిశా మాద్యమంలో బోధన జరుగుతున్నట్టు కలెక్టర్ వివరించారు. గాంధీగ్రాం ఉన్నత పాఠశాలలో 63 మంది, ప్రాధమిక పాఠశాలలో 29 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు. ఈ స్కూల్‌లో ఒడిశా మాధ్యమంలో పాఠ్యాంశాలను బోధించేందుకు మరో ఇద్దరు ఉపాధ్యాయులు అవసరమని, కమిటీ ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఇద్దరు విద్యావాలంటీర్లను తక్షణమే నియమించనున్నట్టు తెలిపారు. ఇక్కడ విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను తమ ప్రభుత్వం సమకూరుస్తుందని కమిటీ హామీ ఇచ్చింది. గాంధీగ్రాం పాఠశాలలో ఒడిశా పాఠ్యాంశాలు బోధించేందుకు శాశ్వత ప్రాతిపదికను ఉపాధ్యాయులను నియమించే అంశాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు కలెక్టర్ వివరించారు. అలాగే అరకు ప్రాంతంలో ఒడిశా వాసులు అధికంగా ఉన్నారని, ఇక్కడ ఒడిశా మాధ్యమంలో విద్యాబోధన చేయాల్సిందిగా కమిటీ ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు. ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఒడిశాను రెండో భాషగా అమలు చేసేందుకు ఆయా ప్రభుత్వాలు అంగీకరించాయని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ అంశాన్ని పరిశీలించాలని సబ్ కమిటీ కోరింది. కమిటీ సూచనలను ప్రభుత్వానికి నివేదించనున్నట్టు కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుజ్ఞాన కుమారి, బలభద్ర మాఝి, దేబరాజ్ మహంతి, పూర్ణచంద్ర స్వెయిన్, కెంగ సూర్యారావు, సమన్వయ అధికారి మహేష్ చంద్ర సామంత్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎంవి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కమిటీ సభ్యులు సింధియాలోని గాంధీగ్రాం ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. బోధనాపరంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒడిశాలో బిసిలుగా ఉన్న మహరాగా కులస్థులను ఇక్కడ గుర్తించట్లేదని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. పలు సమస్యలను ఉత్తరాంధ్ర ఒడియా మైనార్టీ సంఘం అధ్యక్షుడు పాడి సత్యనారాయణ కమిటీకి వివరించారు. అనంతరం గాంధీగ్రాం పాఠశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కమిటీ పరిశీలించి, విద్యార్థులకు స్వయంగా వడ్డించింది. అంతకు ముందు కమిటీ సభ్యులు పాండురంగా పురం సమీపంలోని జగన్నాధ స్వామి ఆలయాన్ని సందర్శించారు. పర్యటనలో ఉప విద్యాశాఖ అధికారి రేణుక, జివిఎంసి ఉప విద్యాధికారి సి ఉషారాణి, పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పైప్‌లైన పనులకు మత్స్యకారులు సహకరించాలి
* పరిహారం రూ.70 వేలకు పెంపు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామం వద్ద ఎపిఐఐసి నిర్మించతలపెట్టిన పైప్‌లైన్ నిర్మాణానికి మత్స్యకారులు సహకరించాలని కలెక్టర్ ఎన్ యువరాజ్ కోరారు. పైప్‌లైన్ పనుల పురోగతిని ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో సమీక్షించారు. ఇటీవల రెండు రోజుల పాటు విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పైప్‌లైన్ పనుల అంశాన్ని ప్రస్తావించారన్నారు. మత్స్యకారుల డిమాండ్ మేరకు గతంలో ప్రకటించిన నష్టపరిహారాన్ని రూ.50 వేల నుంచి రూ.70 వేలకు పెంచాలని సిఎం సూచించారన్నారు. అలాగే మత్స్యకారుల డిమాండ్‌లను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న వాస్తవాన్ని వివరించాలన్నారు. మత్స్యకారులు కోరిన విధంగా ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇప్పటికే జెట్టీ నిర్మాణానికి సంబందించి సవివర పథక నివేదిక (డిపిఆర్) తయారు చేయాలని ఒక సంస్థకు బాధ్యతలు అప్పగించినట్టు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రయోజనాల కోసం పైప్‌లైన్ నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం ఏర్పడకుండా అవసరమైన పోలీసు బందోబస్తున్న ఏర్పాటు చేయనున్నట్టు ఎస్పీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. ఇప్పటికే మత్స్యకారులతో పలు దఫాలు చర్చలు జరిపామని, వారి ఆమోదం మేరకు పైల్‌లైన్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అలాగే ఇక్కడ ఏర్పాటయ్యే సంస్థల్లో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా నిర్మిస్తున్న పైప్‌లైన్ వల్ల ఈ ప్రాంతంలో ప్రజలకే అధిక ప్రయోజనాలు ఒనగూరుతాయన్నారు. సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, తెలుగుదేశం నాయకుడు లాలం భాస్కరరావు, ఆర్‌డిఓ పద్మావతి, భూసేకరణ అధికారి సత్తిబాబు తదితరులు పాల్గొని పలు అంశాలను చర్చించారు.

కాపులను బిసిల్లో చేర్చకుండా రుణాలెలా ఇస్తారు
* నిలదీసిన బిసిడిఎఫ్
* కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చకుండా బిసి కార్పొరేషన్ ద్వారా కాపులకు రుణాలు, రాయితీలు ఏ విధంగా మంజూరు చేస్తారని అఖిల భారత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సమాఖ్య (బిసిడిఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్ ప్రశ్నించారు. బిసి కార్పొరేషన్ ద్వారా కాపులకు బ్యాంకు రుణాలు, రాయితీలు ప్రకటించడాన్ని సవాలు చేస్తూ కలెక్టర్ యువరాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. బిసిల హక్కులకు భంగం కలుగకుండా, కాపులను వెనుకబడిన తరగతుల్లో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే కాపులను బిసిల్లో చేర్చేందుకు నియమించిన మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వకుండానే బిసి కార్పొరేషన్ ద్వారా కాపులకు రుణాలు ఇస్తున్నట్టు అధికారులు చేస్తున్న ప్రకటనలు బిసి వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయాన్నారు. ఇప్పటికే 120 కులాలతో ఉన్న బిసి కార్పొరేషన్‌తో పట్టుమని 10 శాతం బిసిలకు రుణాలు దక్కట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తూర్పుకాపులు బిసి జాబితాల్లో ఉన్నారని, బిసి కార్పొరేషన్ ద్వారా వారికి రుణాలు ఇవ్వడంలో తమకు అభ్యంతరం లేదని, అలా కాకుండా కాపులకు బిసి కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయడం వల్ల అర్హులైన బిసిలు అవకాశాలు కోల్పోతారన్నారు. విశాఖ జిల్లా విషయంలో ఇప్పటికే రూ.14.76 కోట్ల మేర రుణాలు మంజూరు చేస్తున్నట్టు బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ ప్రకటించడాన్ని తప్పు పట్టారు. జిల్లాకు కేటాయించిన మొత్తంలో రూ.7.38 కోట్లు బ్యాంకు రుణంగాను, మరో రూ.7.38 కోట్లు రాయితీని చెల్లించనున్నట్టు ప్రకటించారన్నారు. బిసిలుగా రాజ్యాంగ గుర్తింపులేని కాపులకు బిసి కోటాలో రుణాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఆయా వర్గాలకు రుణాలు కేటాయించాలని, అలా కాకుండా బిసి కార్పొరేషన్ రుణాలను కాపులకు మళ్లిస్తే తమ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సమాఖ్య ప్రతినిధులు డి రామ్మోహన రావు, గంపల గిరిధర్, పొలమరశెట్టి రత్నరాజు, యర్ర హర్షిణి, సంపంగి ఈశ్వరరావు, యతి రాజుల నాగేశ్వరరావు, దేవులపల్లి సీతారాం తదితరులు పాల్గొన్నారు.

మెట్రో ప్రాజెక్టుకు మోక్షం ఎప్పుడు
* పార్లమెంట్ సమావేశాల్లో వెంకయ్య బిజీ
* ఖరారు కాని ఎస్‌పివి మార్గదర్శకాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం లభించింది. తాజాగా విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) సమగ్ర పథక నివేదిక రూపొందించి ప్రభుత్వం ముందుంచగా గతేడాని నవంబర్ 16న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఇక కేంద్ర అనుమతి మాత్రం లభించాల్సి ఉంది. గత యుపిఎ ప్రభుత్వం హయాంలోనే విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పట్లో సుమారు రూ.6000 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ఈ లోగా రాష్ట్ర విభజన జరగడంతో నవ్యాంధ్రలో విశాఖ నగరం కీలకంగా మారింది. దీంతో విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడమే తరువాయిగా భావించారు. అయితే విభజన నేపథ్యంలో విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు తెరపైకి రావడంతో నవ్యాంధ్రలో మరో మెట్రోరైల్ ప్రాజెక్టు అవసరం పడింది. రాజధాని నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టు తొలిప్రాధాన్యతను దక్కించుకుంది. దీంతో విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు మీమాంసలో పడింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టును సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆమోదం తెలపడంతో ఇక కేంద్రం వద్ద ప్రాజెక్టు పెండింగ్‌లో ఉంది.
మూడు కారిడార్లుగా 42.54 కిలోమీటర్ల మేర నిర్మించనున్న విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టును రూ.13వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. మొదటి కారిడార్‌ను కొమ్మాది నుంచి గాజువాక (30.38 కిలోమీటర్లు), రెండో కారిడార్‌ను తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు (2.25కిమీ), మూడో కారిడార్‌ను గురుద్వార నుంచి పాతపోష్ట్ఫాసు (6.91 కిమీ) ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన మెట్రోరైల్ ప్రాజెక్టులో కేంద్రం ఆమోదం లభిస్తే నెల రోజుల కాల వ్యవధిలో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పివి) ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందించాల్సి ఉంది. దీని తర్వాత డిఎంఆర్‌సితో ఒప్పందం కుదుర్చుకుని, టెండర్లను పిలిచే ప్రక్రిను పూర్తి చేయాల్సి ఉంది. అనంతరం మెట్రోరైల్ ప్రాజెక్టు ప్రాంతంలో భూ సేకరణ, ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించకపోవడంతో మిగిలిన పనులు పెండింగ్‌లో పడ్డాయి.
ఇదిలా ఉండగా విశాఖ మెట్రోరైల్‌కు సంబంధించి ఆర్థిక సాయాన్ని జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రాజెక్టును విదేశీ సంస్థ చేపట్టనున్న నేపథ్యంలో అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేయాల్సి ఉంది. కేంద్రం ఆమోదించి, మిగిలిన అన్ని లాంఛనాలు పూర్తిచేస్తే విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఆవఖండంపై ప్రాథమిక విచారణ పూర్తి
* పూర్తిస్థాయి విచారణ చేపడతాం
- జాయింట్ కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని ఆవఖండంలో ఓ సంస్థ భూఆక్రమణకు పాల్పడిందని ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా జాయింట్ కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ప్రాథమిక విచారణలో తేలిన అంశాల ఆధారంగా పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆవఖండంలో అవకతవకలకు పాల్పడిన ఆర్నావ్ ఎడిఫైసన్స్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. తమ విచారణలో పంట కాలువలను పూడ్చి వేయడం, ప్రభుత్వ భూముల్లో ఉన్న పంట కాలువను పూడ్చి రోడ్డు నిర్మాణం చేపట్టడాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామన్నారు. కాగా, ఇదే సంస్థ గతంలో చెరువు కబ్జా చేసిందని ఆరోపణలు ఉన్నాయన్నారు. నాలా కన్వర్షన్‌పై ఆరోపణలు వచ్చాయన్నారు. ఆవఖండం అక్రమాలపై నీటిపారుదల శాఖ, రెవిన్యూ డివిజనల్ విభాగంతో విచారణ చేపట్టామన్నారు. ఆవఖండంలో వేసిన లే అవుట్‌కు అనుమతులు లేవని అన్నారు. త్వరలోనే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

సమర్ధవంతంగా పాలిస్తా
* నాగార్జున విసి రాజేంద్రప్రసాద్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: రాష్ట్ర ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్ధవంతంగా పాలిస్తానని నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజేంద్రప్రసాద్ చెప్పారు. శుక్రవారం ఆయన ఎయును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయకళాశాలలో సత్కరించారు. అనంతరం ఇన్‌ఛార్జి విసి నారాయణ ఛాంబర్‌లో పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తాను మరచిపోతే తనను తాను మరిచిపోయినట్టేనన్నారు. తన అభివృద్ధికి పునాది ఇక్కడేనన్నారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి విసి నారాయణ మాట్లాడుతూ నిబద్ధతతో విద్యార్థుల సంక్షేమానికి పనిచేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాన్ని నడిపించే శక్తి సామర్థ్యాలు రాజేంద్రప్రసాద్‌కు ఉన్నాయన్నారు. రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎయుకు న్యాయ సలహాలు అందించే నిపుణునిగా ఆయనకు గుర్తింపు ఉందన్నారు. న్యాయకళాశాల నుంచి నలుగురు ప్రొఫెసర్లు వైస్ ఛాన్సలర్లుగా పదోన్నతి సాధించారన్నారు. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం మాజీ విసి వై సత్యనారాయణ మాట్లాడుతూ కష్టించి పనిచేసే తత్వమే అవకాశాలను అందించిందన్నారు. ఎయు న్యాయకళాశాల విద్యావంతులని, న్యాయాధీశులని, న్యాయ నిపుణులను, వైస్ ఛాన్సలర్లను అందించిందన్నారు. ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎయులో విభిన్న బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రప్రసాద్ వైస్ ఛాన్సలరుగా నియమితులు కావడం అభినందనీయమన్నారు. ప్రొఫెసర్ డి.సూర్యప్రకాశరావు మాట్లాడుతూ వర్శిటీ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్‌గా నియమితులు కావడం గర్వకారణమన్నారు. న్యాయకళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎ.సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ సుమిత్ర, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, నిర్మల, సీతామాణిక్యం, మధుసూధన్, ప్రసాద్, పద్మ తదితరులు ప్రసంగించారు. అనంతరం రాజేంద్రప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు.

ఎయును సందర్శించిన ఆస్ట్రేలియా విద్యార్థులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: ఆస్ట్రేలియాలోని విక్టోరియా వర్శిటీ విద్యార్థుల బృందం శుక్రవారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ ఇఎ నారాయణ మాట్లాడుతూ ఎయులో నిర్వహిస్తున్న కోర్సుల వివరాలను వివరించారు. అలాగే వర్శిటీకి అంతర్జాతీయ స్థాయిలో నాక్ గుర్తింపును వరుసగా మూడోసారి సాధించామన్నారు. అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో కూడా ఎయు మంచి స్థానం సాధించిందన్నారు. జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో పోల్చి చూస్తే రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. కాగా, ఆస్ట్రేలియా బృందం ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి రావడం, వర్శిటీకి అనుబంధంగా నిర్వహిస్తున్న పాఠశాలను సందర్శించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా విద్యార్థులు మాట్లాడుతూ గత మూడు వారాలుగా ఎయులోని పాఠశాలలు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, క్రీడా విభాగాలను, నగరంలోని పలు విద్యా సంస్థలను సందర్శించామని చెప్పారు. నేటి విద్యా విధానం, కరికులం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, ఎయు క్రీడా విభాగాధిపతి ఎం.శ్యాంబాబు, ఐఎఎస్‌ఇ డాక్టర్ టి.షారోన్‌రాజు, ఆస్ట్రేలియా వర్శిటీ ప్రతినిధులు విజయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

ఔషధ, సుగంధ మొక్కల సాగుకు ప్రోత్సాహం
* ఆన్‌లైన్‌లో పంట రుణాలు
* ఆయుష్ ద్వారా 13 జిల్లాలకు 50 పడకల ఆసుపత్రులు
* ఆయుష్ కమిషనర్ నళినీ మోహన్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో ఔషధ, సుగంధ మొక్కలు సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తుందని రాష్ట్ర ఆయుష్ శాఖ కమిషనర్, ఎపి ఔషధ సుగంధ మొక్కల బోర్డు సిఇఒ డి.నళిని మోహన్ చెప్పారు. శుక్రావంర ఎయు ఫార్మసీ కళాశాలలో ఔ్ధః, సుగంధ మొక్కల సాగు రైతులు, శాస్తవ్రేత్తలు, వ్యవసాయ, ఉద్యానవన అధికారులు, అటవీశాఖ అధికారులు, ఫార్మసిస్టులు, యునానీ, ఆయుష్ వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔషధ, సుగంధ మొక్కల సాగుకు మన రాష్ట్రం అనుకూలమన్నారు. ఈ సందర్భంగా ఔషధ, సుగంధ మొక్కల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఔషధ, సుగంధ మొక్కలైన అశ్వగంధి, ఉసిరి, శతావరి, దూదిలాపతీగ, మారేడు గడ్డలు, సునాముఖీ, సర్పగంధి, అడవినాభి, బ్రాహ్మి, నల్లేరు, వాము ఆకు, గుగ్గిలం, అర్జున, నేలవేము, కానుగ, కలబంధ, తమలపాకు, తిప్పతీగ, అడ్డసరం, రణపాల, తులసి, వావిలి, మారేడు, పిప్పళ్లు తదితర మొక్కలను పెంచడం వల్ల రైతులు అధిక లాభాలు పొందగలరన్నారు. ఆయుర్వేద మందులు నిల్వ చేసే సదుపాయం లేకపోవడం వల్ల రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఔషధ, సుగంధ మొక్కలను తిరుపతి, శ్రీవైలం, అన్నవరం, సింహాచలం మొదలైన పుణ్య క్షేత్రాల్లో మొక్కల పెంపకానికి అనుమతులు ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మొక్కల పపిణీకి, పంట రుణాలకు 30 శాతం సమ్సిడీ అందిస్తుందన్నారు. ఐటిడిఎ పరిధిలోని ఈ పంటల పెంపకానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం క్లస్టర్లు వారీగా, డ్వాక్రా సంఘాల రుణాలు, నర్సరీల పెంపకానికి నిధులు మంజూరు చేస్తున్నందున ఈ రంగంలో ఆసక్తి ఉన్న వారికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. రాష్ట్రంలో 333 ఫార్మసీలు గుర్తింపు కలిగి ఉన్నాయన్నారు. వీటి ద్వారా రైతులు తమ పంటలను విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఆయుర్వేద, యునాని, ఆయుష్ తదితర 1200 వైద్య కేంఅదాలకు ప్రతి కేంద్రానికి రోజుకు 20 నుంచి 50 మంది వరకు రోగులు వస్తున్నారని అన్నారు. 13 జిల్లాల్లోను 50 పడకల ఆసుపత్రులను పిపిపి పద్దతిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మినీ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. వివిధ కంపెనీలకు చెందిన మందులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కోయల్ ఫౌండేషన్ సిఇఒ కృష్ణారావు, పాడేరు గిరిజన రైతు బొంజురావు, సీనియర్ సైంటిస్టు ముత్యాలనాయుడు, ఎయు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరరావు, ఎజిఎం ప్రసాదరావు, డిఎఫ్‌ఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో ఇసుకపై విధి విధానాలు ఖరారు
* ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో ఇసుక పంపిణీపై విధి విధానాలు ఖరారు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన వీడియోకానె్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఉచితంగా ఇసుకను పంపిణీ చేసేందుకు గల అవకాశాలపై అధికారులతో చర్చించారు. త్వరలోనే వీటిపై విధి విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు.

ఆశ్రమాల్లో శతశాతం విద్యార్థుల హాజరు
అధికారులకు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశం
పాడేరు, ఫిబ్రవరి 26: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శతశాతం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.పద్మ ఆదేశించారు. ఐ.టి.డి.ఎ., గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫిరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ ఆశ్రమాల్లో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు సెలవు దినాలలో మాత్రమే ఇళ్లకు వెళ్లాలని పాఠశాలలు పనిచేసే వేళల్లో తప్పనిసరిగా తరగతులకు హాజరు కావలసిందేనని ఆమె చెప్పారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ఆశ్రమ పాఠశాలల ప్రదానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏ ఒక్క విద్యార్థి తరగతులకు హాజరు కాకుండా లేనివిధంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థుల హాజరు శాతాన్ని, వారికి అందుతున్న సదుపాయాలు, మెనూ అమలు, పారిశుధ్యం, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించాలని ఆమె ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి నివేదికలు పంపించాలని ఆమె సూచించారు. గిరిజన విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు చెల్లించాలని, ఉపకార వేతనాల చెల్లింపులో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన నిధులు ఖర్చుకాకుండా మిగిలి ఉంటే తక్షణమే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఆమె చెప్పారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు మరమ్మతు పనులు సత్వరమే పూర్తి చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె అన్నారు. ఆశ్రమాల్లో పనిచేస్తున్న సి.ఆర్.టి.లు, దినసరి వేతన కార్మికుల వేతనాలు జాప్యం లేకుండా చెల్లించాలని ఆమె చెప్పారు. ఆశ్రమాల్లో మెరుగైన పారిశుధ్యపు పనులు చేపట్టి ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పాలని ఆమె అన్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు మంజూరు చేసిన ట్రైకార్ యూనిట్ల పంపిణీని పెద్ద ఎత్తున చేపట్టాలని ఆమె ఆదేశించారు. పంపిణీ చేసిన యూనిట్ల ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని పద్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. సహాయ ప్రాజెక్టు అధికారి కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.కమల, ఏజెన్సీ పదకొండు మండలాల గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

బాక్సైట్ తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు
పాడేరు, ఫిబ్రవరి 26: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను చేపడితే పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని న్యూడిల్లీలోని జె.ఎన్.యు. విశ్వ విద్యాలయం ప్రోఫెషర్ రావెల్ స్పష్టం చేసారు. గిరిజన జీవన విద్యానంపై ఆదివాసీ అభివృద్ధి పరిశోధన సంస్థ, గిరిజన సంఘం సంయుక్తంగా శనివారం నిర్వహించిన ప్రజా సంఘాల సదస్సులో ఆయన పాల్గొన్నారు. స్థానిక పి.ఎం.ఆర్.సి. సమావేశ మందిరంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ గిరిజనుల జీవన విధానం పర్యావరణంతో ముడిపడి ఉందని చెప్పారు. పర్యావరణాన్ని దెబ్బతీసే బాక్సైట్ తవ్వకాల అంశాన్ని ప్రభుత్వం పరిశీలించుకోవడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. బాక్సైట్ తవ్వకాలపై స్థానిక గిరిజనుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వాటికి విలువ ఇవ్వాలని ఆయన సూచించారు. గ్రామాలలో గిరిజనులకు ఉపాధి హామీ పనులను సక్రమంగా కేటాయించి వాటిని అమలు చేయాలని ఆయన అన్నారు. ఉపాధి హామీతో గిరిజనులకు ఉపాధి ఏర్పడుతున్నందున ఈ పథకం అమలుకు అత్యంత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అరకులోయ మండలంలోని నాలుగు గిరిజన గ్రామాలను గత సంవత్సరం జూన్‌లో తమ విశ్వవిద్యాలయం ద్వారా అధ్యయనం చేసినట్టు ఆయన తెలిపారు. ఈ అధ్యయన నివేదికలను రావెల్ పవర్‌పాయింట్ ప్రజింటేషన్ ద్వారా ప్రజా సంఘాలకు వివరించారు. ఈ సమావేశంలో జె.ఎన్.యు. విశ్వవిద్యాలయానికి చెందిన ప్రోఫెషర్ స్మిత, పరిశోధన విద్యార్థులు బన్సల్, గిరిజన సంఘం నాయకులు కిల్లో సురేంద్ర, పి.అప్పలనర్స, ఎం.ఎం.శ్రీను, సుందరరావు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

వైభవంగా ముగిసిన గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు
కోటవురట్ల, ఫిబ్రవరి 26: మండలంలో జల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించిన గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిసాయి. గ్రామ సర్పంచ్ లాలం పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున జరిగిన జాతరలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జాతర సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతరలో కొబ్రా నృత్యాలు, నేల వేషాలు, బండ్ల వేషాలు , ఆర్కెస్ట్రా తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గౌరీ పరమేశ్వరుల ఆలయం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో కిటకిటలాడింది. గ్రామ సర్పంచ్ లాలం పద్మావతి, మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు, గ్రామ ఎంపిటిసి బాలయోగేశ్వరి తదితరులు గౌరీ పరమేశ్వరులను దర్శించుకుని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

భయాందోళనలో గిరిజన ప్రజాప్రతినిధులు
* నర్సీపట్నం వచ్చిన వారిపై పోలీసుల బెదిరింపులు
నర్సీపట్నం, ఫిబ్రవరి 26: కొయ్యూరు మండలం పుట్టకోట ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలను వెల్లడించేందుకు నర్సీపట్నం వచ్చిన గిరిజన ప్రజాప్రతినిధులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో అర్ధాంతరంగా విలేఖరుల సమావేశాన్ని ముగించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారు. కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు, బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర నాయకుడు లోకుల గాంధీ ఆధ్వర్యంలో శుక్రవారం గిరిజన ప్రజాప్రతినిధులతో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీస్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు ఇద్దరు ఫోన్ చేసి ప్రెస్‌మీట్ రద్దు చేసుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని హెచ్చరించారు. లేకుంటే మావోయిస్టుల సానుభూతి పరులుగా కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. దీంతో ఎటూపాలుపోని ఇద్దరు సర్పంచ్‌లు ప్రెస్‌మీట్ మధ్యలో ఆపివేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ సర్పంచ్‌లకే రక్షణ లేకుంటే మారుమూల గ్రామాల గిరిజనుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు.
కొయ్యూరు మండలం మఠంభీమవరం గ్రామస్థులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఒడిశాకు చెందిన నలుగురు సాధార