జాతీయ వార్తలు

స్మృతి ఇరానీవన్నీ అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: హెచ్‌సియులో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ఘటనపై కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆవాస్తవమని రోహిత్ తల్లి రాధిక చెప్పారు. ఆమె శుక్రవారం రోహిత్ స్నేహితులతో కలసి ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ తన కుమారుడి ఆత్మహత్య ఉదంతాన్ని స్మృతి ఇరానీ ఉద్దేశపూర్వకంగా పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. రోహిత్ మరణించిన రోజు వైద్యుల్ని, పోలీసుల్నీ మృతదేహం వద్దకు అనుమతించలేదనడం వాస్తవం కాదన్నారు.
పార్లమెంట్‌లో నటించి, రక్తి కట్టించడం స్మృతి ఇరానీకే చెల్లిందన్నారు. తన కుమారుడిపై దేశ వ్యతిరేకి, తీవ్రవాది అనే ముద్ర వేస్తున్నారని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. తమ కులాన్ని కూడా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని, ఏపి, తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకనే ఢిల్లీకి వచ్చామని ఆమె చెప్పారు. ఇప్పటివరకు తన కుమారుణ్ని సస్పెండ్ చేయడానికి గల కారణాలను హెచ్‌సియు మాజీ వీసి అప్పారావుగానీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పలేదన్నారు.
రోహిత్ మరణంపై ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, ఆత్మహత్యకు కారణం అయిన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను పదవులనుంచి ఎందుకు తొలగించడం లేదని రోహిత్ తల్లి ప్రశ్నించారు. రోహిత్ మృతికి కారణం అయిన వారిని శిక్షించాలని, అప్పటివరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశానికి రోహిత్ స్నేహితులు దొంతు ప్రశాంత్, పి విజయ, శేషయ్య, రోహిత్ సోదరుడు రాజా, దళిత సంఘాల నాయకులు హాజరయ్యారు.