బిజినెస్

సరసమైన ధరకు నాణ్యమైన ఉక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 26: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జరిగిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా మూడు దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన విశాఖ స్టీల్ ప్లాంటును నేటికీ ఆంధ్రుల సెంటిమెంట్‌కు ఎక్కడా భంగం కలుగని రీతిలో, ప్రధానంగా నాణ్యతతో కూడిన ఉక్కును సరసమైన ధరలతో ప్రజల ముంగిటకు తీసుకెళుతున్నామని విశాఖ స్టీల్ ప్లాంట్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ పి మధుసూదన్ అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను విస్తరింపచేసే ప్రయత్నాల్లో పెట్టుబడులతోపాటు ఖర్చులు కూడా పెరిగాయన్న ఆయన తొలిసారిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్ల రూపాయల నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని చెప్పారు. అయనప్పటికీ త్వరలోనే ఆర్థికపరంగా పూర్వవైభవం అందు కుంటామన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసరాల్లో శరవేగంగా జరుగుతున్న భారీ కట్టడాలకు అవసరమైన ఇనుమును ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావటానికి వీలుగా రామచంద్రనగర్‌లో ఏర్పాటైన 24వ అమ్మకం కేంద్రాన్ని శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడు తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దాదాపు 4 వేల కోట్ల రూపాయలతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని అన్ని యూనిట్లను పూర్తిగా ఆధునీకరిస్తున్నామన్నారు. రెండు బ్లాస్ట్ఫ్‌ర్నీస్ యూని ట్లుండగా ఒకటి పూర్తయిందన్నారు. అలాగే మూడు కన్వర్టర్స్ యూనిట్లకుగాను ఒకటి పూర్తయిందని, రెండు సింటర్మేషన్ యూనిట్లు వచ్చే మార్చి మాసాంతానికి పూర్తికాగలవన్నారు. చైనా, రష్యా, కొరియా దేశాల నుంచి ఇటీవల కాలంలో ఉక్కు దిగుమతులు భారీగా పెరిగి దేశీయ మార్కెట్‌లో ధర తగ్గటం వల్ల కూడా ప్లాంట్ నష్టాలకు కారణభూతమైందన్నారు. తమ ప్లాంట్ వార్షిక టర్నోవర్ రూ. 12 వేల కోట్లుగా ఉందన్నారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లా కాకునూరు మండలంలో ఐరన్ ఓర్ క్వారీలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో క్వారీయింగ్‌కు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత సామర్థ్యం 7.5 మిలియన్ టన్నులుగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో రైళ్ల భోగీల వీల్స్ తయారీకి లక్ష టన్నుల సామర్థ్యంతో కూడిన కొత్త యూనిట్ ప్రారంభానికి రైల్వేశాఖతో ఒప్పందం కుదుర్చుకోటం జరిగిందని, ఇందుకోసం రూ. 1,500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని, అలాగే పశ్చిమ బెంగాల్ జలసాయ్‌గురిలో యాక్సిల్స్ తయారీ కోసం 5 వేల టన్నుల సామర్థ్యంతో కూడిన యూనిట్ ప్రారంభానికి కూడా రైల్వేశాఖతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నామని ఇందు లో రూ. 500 కోట్లు పెట్టుబడులుగా పెడుతున్నామన్నారు. విశాఖలోనే ట్రాన్స్‌మిషన్ టవర్స్ ఉత్పత్తికి పవర్‌గ్రిడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఇందుకోసం మరో రూ. 500 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నామన్నారు.