క్రీడాభూమి

శ్రీలంకకు ‘వైట్‌వాష్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, ఫిబ్రవరి 26: శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌ను భారత మహిళా జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో ఇంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత జట్టు తాజాగా శనివారం రాంచీలో జరిగిన చివరి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పర్యాటక జట్టును మట్టికరిపించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు లంకేయులను సమర్ధవంతంగా ప్రతిఘటించింది. ముఖ్యంగా ఏక్తా బిస్త్ (3/17), అనూజా పాటిల్ (2/19) నిప్పులు చెరిగే బంతులతో శ్రీలంకపై విరుచుకుపడగా, రాజేశ్వరీ గైక్వాడ్ (1/8), దీప్తి శర్మ (1/11) కూడా తమ వంతు రాణించారు. వీరి జోరును ప్రతిఘటించడంలో శ్రీలంక ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ జయాంగని (21), హన్సిక (13), కౌశల్య (25-నాటౌట్), కాంచన (17) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు రాబట్టలేకపోవడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే సాధించగలిగింది. అనంతరం భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఓపెనర్లు వెల్లస్వామి వనిత, స్మృతి మందన చక్కటి సమన్వయంతో ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు 64 పరుగుల భాగస్వామ్యంతో గట్టి పునాది వేశారు. దూకుడుగా ఆడి 25 బంతుల్లోనే 34 పరుగులు రాబట్టిన వనిత 9వ ఓవర్‌లో జయాంగని వేసిన నాలుగో బంతిని ఎదుర్కోబోయి కరుణరత్నే చేతికి చిక్కడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. అయితే స్మృతి మందన (43 బంతుల్లో 43 పరుగులు), వేదా కృష్ణమూర్తి (16 బంతుల్లో 13 పరుగులు) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 13.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 91 పరుగులు రాబట్టిన భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించి శ్రీలంకకు ‘వైట్‌వాష్’ వేసింది.