క్రీడాభూమి

సానియా-హింగిస్ జోరుకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, ఫిబ్రవరి 26: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)ల అప్రతిహత జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. గత 41 మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న వీరు దోహాలో జరుగుతున్న కతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి రష్యాకు చెందిన ఎలెనా వెస్నినా, దరియా కసత్కినా జోడీతో జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో సానియా, హింగిస్ చక్కగానే రాణించి 6-2 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రత్యర్థులు అనూహ్య రీతిలో విజృంభించడంతో సానియా, హింగిస్ వెనుకబడ్డారు. ఫలితంగా 4-6, 5-10 తేడాతో వరుసగా రెండు సెట్లను చేజార్చుకోవడంతో వారికి ఓటమి తప్పలేదు. గ్రాండ్‌శ్లామ్ టోర్నీలో వరుసగా మూడు టైటిళ్లు గెలుచుకుని హ్యాట్రిక్ సాధించిన సానియా, హింగిస్ గత ఏడాది ఆగస్టులో సిన్సినాటీలో ఓటమిని ఎదుర్కొన్న తర్వాత వరుసగా 41 మ్యాచ్‌లలో విజయం సాధించి సత్తా చాటుకున్న విషయం తెలిసిందే. కతార్ ఓపెన్‌లో సానియా, హింగిస్ ఇంతకుముందు రౌండ్‌లో చైనాకు చెందిన అన్‌సీడెడ్ జోడీపై చెమటోడ్చి విజయం సాధించినప్పటికీ రష్యా జోడీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో అదృష్టం వెక్కిరించడంతో తొలి సెట్‌లో గెలిచినప్పటికీ ఓటమి తప్పలేదు. సానియా, హింగిస్ ఈ ఏడాది నాలుగు టైటిళ్లు సాధించడంతో ఇప్పటివరకూ వారు సాధించిన మొత్తం టైటిళ్ల సంఖ్య 13కు పెరిగింది. బ్రిస్బేన్, సిడ్నీ ఓపెన్ టోర్నీల్లో విజేతలుగా నిలిచి ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన సానియా, హింగిస్ ఆ తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో వరుసగా మూడో గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు ఈ నెల ఆరంభంలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన టోర్నీలో మహిళల టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.