హైదరాబాద్

సంత్ సేవాలాల్ చరిత్ర అందరూ చదవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: గిరిజన జాతికోసం ఎంతో సేవ చేసిన సంత్ సేవాలాల్ మహరాజ్‌ను దేవుడిగా కొలుస్తారని, ఆయన జీవిత చరిత్రను అందరూ చదవాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ అన్నారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ గిరిజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన సంత్ సేవాలాల్ మహరాజ్ 277వ జయంతిలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని- టివి నటి మంగ్లి, పద్మనాయక్, ప్రకాష్‌రాథోడ్‌ను సత్కరించి సేవాలాల్ పురస్కారాలను ప్రదానం చేసారు. గిరిజనులు పండుగలా చేసుకునే సేవాలాల్ జయంతికి జిల్లాకు పది లక్షల చొప్పున తెలంగాణ జిల్లాలకు సిఎం కెసిఆర్ రూ. కోటి మంజూరు చేసారని మంత్రి తెలిపారు.
కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు శంకర్‌నాయక్ అధ్యక్షత వహించగా, మేయర్ బొంతు రామ్మోహన్, నల్గొండ జడ్‌పి చైర్మన్ సంజీవ్‌నాయక్, కార్పొరేటర్ పద్మనాయక్ తదితరులు పాల్గొన్నారు. తొలుత గిరిజన కళాకారులు గిరిజన, లంబాడి నృత్యాలు ప్రదర్శించారు.
హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించాలి
జీడిమెట్ల, ఫిబ్రవరి 26: సమాజంలో ప్రజలు హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. జగద్గిరిగుట్టలో అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ దేవేందర్ వీరసావర్కర్ 50వ వర్థంతి సభ నిర్వహించారు.
ఈ సభకు రాజు విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ 82 సంవత్సరాల క్రితం హిందువులను అంతా ఏకం చేసి వారి మనోభావాలను బతికించడానికి ఆ రోజుల్లో బ్రిటీష్ కాలంలో వెట్టిచాకిరిని ఎదిరించి స్వాతంత్య్రం గురించి పోరాడిన వ్యక్తి సావర్కర్ అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు జగన్, మంత్రి సత్యనారాయణ, రాష్ట్ర హిందూ మహాసభ అధ్యక్షుడు బత్తిని రాములుగౌడ్, నాయకులు పెద్దబాల్ అంజన్‌గౌడ్, జెమ్మి దేవేందర్, హిందూ మహాసభ సభ్యులు నరేంద్రకృష్ణ, బుచ్చిబాబు, యాకయ్య, పరుశురామ్, శ్రీకాంత్, జానకిరాములు పాల్గొన్నారు.
విద్యార్థులకు పాలు పంపిణీ అభినందనీయం: కలెక్టర్
శామీర్‌పేట, ఫిబ్రవరి 26: పాఠశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు పాలు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు అన్నారు. మదర్ డేరీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలోనే లక్ష్మాపూర్ గ్రామంలో ప్రథమంగా విద్యార్థులకు ఉచిత పాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ రఘునందన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేయగా మరింత సౌకర్యం కోసం పాలను పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిధులను వెచ్చిస్తుందని గుర్తు చేశారు. విద్య వ్యవస్థ కోసం ప్రభుత్వం ఎంతో మందుచూపుతో నిధులను కేటాయించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని అన్నారు. జాతీయస్థాయిలో ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామం లక్ష్మాపూర్‌లో ఏర్పాటు చేయడం ఎంతో హర్షణీయమని ఇదే స్పూర్తితో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తే ఫలితాలు మరింత బాగుంటాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ పాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడితే తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పాడి పరిశ్రమ శాఖ, మదర్ డేరీ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి, మండల పరిషత్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్, జడ్పిటిసి బాలేష్ తదితరులు పాల్గొన్నారు.