తెలంగాణ

తెలంగాణతో ‘సిమికి’ లింక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ‘సిమి’ కార్యకర్తలకు తెలంగాణతో సంబంధాలున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఎనిమిది మందిలో నలుగురు 2014 మార్చిలో జరిగిన తెలంగాణలోని చొప్పదండి ఎస్‌బిఐ బ్యాంక్ దోపిడీ కేసులో నిందితులు, అదే సంవత్సరం అక్టోబర్ 22న వీరిని సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు సిమి కార్యకర్తలు హైదరాబాద్ పాతబస్తీలో సంచరిస్తూ తమ కేడర్‌ను పెంచుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే సూర్యాపేట బస్టాండ్‌లో ఓ హోంగార్డు, సిఐపై కాల్పులు జరిపారు.
అక్కడి నుంచి పారిపోయిన వీరు ఫిబ్రవరి 2016లో నల్గొండ జిల్లా జానకీపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అస్లాం, ఎజాజ్ అనే ఇద్దరు సిమి కార్యకర్తలు మృతి చెందగా మరో ఇద్దరు తప్పించుకున్న సంగతి తెలిసిందే. సికిందరాబాద్‌లో అరెస్టయిన సిమి ఉగ్రవాదులకు మధ్యప్రదేశ్‌కు చెందిన సిమి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు గుర్తించిన కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వారిని భోపాల్‌కు తరలించింది. భోపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వీరు సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిపై బ్యాంకు దోపిడీతోపాటు పోలీసులపై కాల్పు ల వంటి ఆరు కేసులు నమోదై ఉన్నాయని ఆ అధికారి పేర్కొన్నారు.