క్రీడాభూమి

ఇర్ఫాన్ పఠాన్ వచ్చేస్తున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌కు ఐపిఎల్‌లో అవకాశం లభించింది. ఐపిఎల్-2017 ట్వంటీ-20 టోర్నమెంట్‌లో తీవ్రమైన వైఫల్యాలతో సతమతమవుతున్న గుజరాత్ లయన్స్ యాజమాన్యం వెస్టిండీస్ ఆటగాడు డ్వెయిన్ బ్రావో స్థానంలో ఇర్ఫాన్ పఠాన్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ఫిబ్రవరిలో జరిగిన ఐపిఎల్ ఆటగాళ్ల వేలంలో అమ్ముడు పోని ప్రముఖ ఆటగాళ్లలో ఇర్ఫాన్ పఠాన్ ఒకడు. 50 లక్షల రూపాయల కనీస ధరతో ఇర్ఫాన్ పఠాన్ పేరు రెండు సార్లు పరిశీలనకు వచ్చినప్పటికీ ఈ వేలంలో అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. అయితే చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న డ్వెయిన్ బ్రావో ఆ గాయం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేక ప్రస్తుత ఐపిఎల్ టోర్నీ నుంచి ఇప్పటికే వైదొలగడంతో అతని స్థానంలో ఇర్ఫాన్ పఠాన్‌ను గుజరాత్ లయన్స్ యాజమాన్యం తమ జట్టులో చేర్చుకుంది. గత తొమ్మిది ఐపిఎల్ టోర్నీలో 102 మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న ఇర్ఫాన్ పఠాన్ భారత్‌లోని ప్రతిభావంతులైన ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఖ్యాతి పొందడం ఇప్పుడు అతనికి కలసి వచ్చింది. ఇంతకుముందు టీమిండియా ప్రీమియర్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన ఇర్ఫాన్ పఠాన్ చాలా కాలం నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గత తొమ్మిదేళ్లలో ఐదు ఐపిఎల్ జట్ల (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్) తరఫున ఆడిన ఇర్ఫాన్ పఠాన్ మొత్తం 80 వికెట్లు కైవసం చేసుకోవడంతో పాటు మొత్తం 1,137 పరుగులు సాధించాడు.

హారిక జైత్రయాత్ర
రెక్జావిక్ (ఐస్‌లాండ్), ఏప్రిల్ 25: ఐస్‌లాండ్‌లో జరుగుతున్న రెక్జావిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్, ‘తెలుగు తేజం’ ద్రోణవల్లి హారిక జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో కొనసాగుతున్న హారిక 5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఏడో రౌండ్ పోరులో మంగోలియాకు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ తవ్షింటగ్స్ బచిమెగ్‌ను మట్టికరిపించింది. ర్యాంకింగ్స్‌లో ప్రత్యర్థి తన కంటే ఎంతో దిగువన ఉన్నప్పటికీ ఈ పోరులో హారిక విజయం కోసం ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. ఏడో రౌండ్ పోరు ఆరంభ దశలో ప్రత్యర్థి తప్పిదానికి పాల్పడటం తనకు కలసి వచ్చిందని, దీనిని చక్కగా సద్వినియోగం చేసుకోవడం వల్లనే తాను విజయం సాధించగలిగానని హారిక తెలిపింది. ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకూ ఐదు విజయాలు సాధించి మరో పోరును డ్రాగా ముగించిన హారిక తదుపరి రౌండ్‌లో టర్కీ గ్రాండ్ మాస్టర్ ముస్త్ఫా ఇల్మజ్‌తో తలపడనుంది.