యువ

సేవంటే ఆమెకు ప్రీతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈత, క్రికెట్‌లో రాణించిన యువతి పఅలల మధ్య చిక్కి అనుకోని ఆపద
కదలలేని స్థితిలో వీల్‌చైర్‌కే పరిమితం ప‘సోల్ ఫ్రీ’ కార్యక్రమాలతో స్ఫూర్తి
ఆమె మూడేళ్లకే ఈతనేర్చింది..
నాలుగేళ్లకే క్రికెట్ ఆడింది..
పద్దెనిమిదేళ్లకే చాంపియన్ అయింది..
ఎప్పుడూ ఆడుతూపాడుతూండే ఆమె జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది..
అనుకోని సంఘటనలో ఆమె కదల్లేని పరిస్థితిలో చిక్కుకుంది. ఓ దశలో చచ్చిపోదామనుకుంది.. కానీ ఆ పని కూడా సొంతంగా చేసుకోలేని పరిస్థితి ఆమెది. తల్లిదండ్రుల ప్రేమతో.. మద్దతుతో ఇప్పుడు తనలాంటి వారికి తల్లిలా మారిపోయింది. అండగా నిలుస్తోంది. సొంతంగా ఓ స్వచ్చంద సంస్థను నిర్వహిస్తోంది. నోటితో బొమ్మలు వేయగలుగుతోంది. వెబ్ పత్రికలకు వార్తాంశాలూ రాస్తోంది. ఓ సినిమా వెబ్‌సైట్‌కు కథనాలూ అందిస్తోంది. ఎడిటింగ్ చేయగలుగుతోంది. కాళ్లుచేతులు, శరీరం కదపలేని స్థితిలోనూ ధైర్యంగా జీవనం సాగిస్తోంది. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమె పేరు ప్రీతి శ్రీనివాసన్. తమిళనాడు ఆమె స్వరాష్ట్రం. జీవితంపై కమ్మిన మబ్బులను ఛేదించి వెలుగులోకి వచ్చిన ఆమె కథ స్ఫూర్తి కలిగిస్తుంది.
ఆటల్లో మేటి
తల్లిదండ్రుల గారాలపట్టి ప్రీతి శ్రీనివాసన్. చిన్నప్పటినుంచి చురుకుగా ఉండేది. మూడేళ్ల వయసులోనే ఈత నేర్పారు. చిన్నతనంలో అందులో చాంపియన్‌గా నిలిచింది. నాలుగేళ్ల వయసులో క్రికెట్‌లో మేటి అనిపించుకుంది. ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మన్ వివియన్ రిచర్డ్స్ ఆమెకు స్ఫూర్తినిచ్చిన ఆటగాడు. ఎనిమిదేళ్ల వయసులో ఆమె తమిళనాడు మహిళా క్రికెట్ టీమ్ తరపున ఆడింది. ఆ జట్టులో ఆడిన అతిచిన్నవయసు క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. ఆమెకు ఆటంటే ఎంత ఇష్టమంటే మగపిల్లలతో పోటీపడి ఆడేది. క్రికెట్ శిక్షణకోసం వెళ్లినపుడు 300మంది బాలురతో కలసి ఆమె ఒక్కతే ఆట నేర్చుకునేది. చివరకు ఫాస్ట్‌బౌలింగ్‌కూ సై అనేది. బాలుర బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని ఔరా అనిపించేది. హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ విమన్‌గా పేరు తెచ్చుకుందంటే ఆమె ప్రతిభ ఏమిటో అర్థమవుతుంది. తమిళనాడులో 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈతలో చాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. 1997లో అండర్ 19 తమిళనాడు క్రికెట్ టీమ్‌కు నాయకత్వం వహించి. కోరుకున్న విధంగా, విజయపరంపరతో సాగిపోతున్న జీవితంలో అనూహ్య సంఘటన చిందరవందర చేసేసింది.
అసలేం జరిగింది..
తోటి విద్యార్థులతో కలసి ప్రీతి పాండిచ్చేరి ట్రిప్‌కు వెళ్లింది. తిరిగివస్తూ స్నేహితురాలి తండ్రి ఉంటున్న చెన్నైలో సరదాగా గడిపేందుకు ఆగింది. వారికి ఉన్న ప్రైవేట్ బీచ్‌లో అంతా కలసి ఆడుకున్నారు. అలల మధ్య హాయిగా గడుపుతున్న సమయంలో ఓ పెద్ద అల ప్రీతిపై పడింది. ఆమెకు ఈత బాగా వచ్చినా ప్రయోజనం లేకపోయింది. తలకిందులుగా ఇసుకను తాకింది. గాయాలేం కాలేదు. కానీ లేవలేకపోయింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒడ్డున ఉన్నవారంతా వచ్చి ఆమెను పాండిచ్చేరిలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స చేసి వెన్నుపూస సంబంధిత సమస్యగా గుర్తించి స్పాండిలైటిస్ పట్టీని మెడకు కట్టారు. అయినా ఆమె కోలుకోలేదు. శరీరం కదలడం లేదు. ఆ తరువాత మరో హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అలమీదపడటంతో ఆమె షాక్‌కు గురైందని, అందువల్ల శరీరం పారలైజ్ అయిందని డయాగ్నైజ్ చేశారు. నొప్పిలేదు, స్పర్శ తెలియడం లేదు. కానీ శరీర భాగాల కదలిక లేదు. సంఘటన జరిగిన తొలి నాలుగు గంటల్లో అందాల్సిన చికిత్స అందకపోవడం, సమస్యను సరిగ్గా డయాగ్నైజ్ చేయకపోవడంతో ఆమె మంచానికో పరిమితమైపోయింది. ఈలోగా తల్లికి హృదయ సంబంధ వ్యాధి తలెత్తింది. దిగులుతో మానసికంగా కుంగిపోయింది. ఆమె పరిస్థితిని చూసి తల్లి ఓ నిర్ణయానికి వచ్చింది. ధైర్యం నూరిపోసింది. లోకంలో తమకన్నా కష్టాలున్నవారి గురించి వివరించింది. అలాంటివారి కోసం ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయమని ప్రోత్సహించింది. వ్యక్తిగతంగా తను అండగా నిలిచింది. ఇక అప్పటి నుంచి ప్రీతిలో మార్పు వచ్చింది. పాదాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతులూ పనిచేయవు. శరీరం సరేసరి. వీల్‌చైర్‌కే పరిమితం. కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా ఎవరిమీదో ఆధారపడాలి. అయినా మొక్కవోని ధైర్యంతో జీవిస్తోంది...తనకు నచ్చిన రీతిలో..
‘సోల్‌ఫ్రీ’ ఆవిర్భావం
ప్రమాదానికి గురైనవారికి సకాలంలో వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేసే స్వచ్చంద సంస్థ ‘సోల్ ఫ్రీ’ని ప్రీతి ప్రారంభించింది. నిపుణులైన వైద్యులు, ఔషధాలు, డయాగ్నైజ్ చేసే నిపుణులు, మానసికంగా రోగులకు ధైర్యాన్నిచ్చే నిపుణులు అందుబాటులో ఉంచడం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రమాదాల తరువాత కుంగిపోయిన రోగులకు ఎలా తేరుకోవాలో, జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లూ చేసింది. తల్లి తనకు దేవత అని, ఆమె స్ఫూర్తితోనే తాను సేవాకార్యక్రమాలు చేస్తున్నానని ప్రీతి చెబుతోంది. ప్రమాదాలవల్ల శరీరం అచేతనమైవారికి పునరావాసం ఏర్పాటు చేయడం, దాతలు, సహాయం చేయగలవారి వివరాలు అందజేయడం, వెన్నుపూస గాయాలతో బాధపడేవారికి అండగా నిలవడం ఆ సంస్థ చేపడుతున్న కార్యక్రమాల్లో మరికొన్ని. వివిధ సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతున్న ప్రీతి సమాజ చైతన్యాన్ని రగిల్చేలా ప్రసంగాలు చేయడం మరో ప్రత్యేకత.
కదల్లేకపోయినా బిజీబిజీ
ఒకప్పుడు రాష్ట్రం అంతటా ఆమె పేరు మారుమోగేది. ప్రమాదం తరువాత అందరూ మరచిపోయారు. సోల్‌ఫ్రీ సేవాకార్యక్రమాలతో మళ్లీ మార్పు వచ్చింది. బదలీలతో కూడిన తండ్రి ఉద్యోగం వల్ల మూడు ఖండాల్లో ఆమె చదువు సాగింది. ప్రమాదం తరువాత భారత్‌లో ఉన్నత చదువులకు అవకాశాలు రాలేదు. ఇటీవలే బాచిలర్స్ ఇన్ మెడికల్ సోషియాలజీ పూర్తిచేసింది. ఏదోఒక పనిచేయాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగింది. ఎడిటింగ్, సమీక్షలు, ఆధ్యాత్మిక పుస్తకాలకు ఆర్టికల్స్ రాయడం, వెబ్ కంటెంట్ అందించడం, మూవీబఫ్ అనే వెబ్‌కు కంటెంట్, సినాప్సిస్ రాయడం చేస్తోంది. నోటితో బొమ్మలు వేయగలుగుతోంది. తన సంస్థ సోల్‌ఫ్రీ లోగోను స్వయంగా నోటితో తనే తీర్చిదిద్దింది. అనుకున్నట్లు సాగితే అంతా బాగానే ఉంటుంది. కష్టాలను తట్టుకుని నిలబడితే జీవితం మరింత అందంగా ఉంటుంది.