'క్లాప్' కొట్టు గురూ!

క్రేజీ ఫాలోయింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ కాజల్ అగర్వాల్ రోల్ మోడల్ ఎవరో తెలుసా? తన అమ్మేనట. రోల్ మోడలే కాదు, తన గైడ్, స్ట్రెంగ్త్ కూడా తన మదరే అని ఎంతో మురిపెంగా చెబుతోంది. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్న ఈ అమ్మడు సైలెంట్‌గా సోషల్ మీడియాలో బోల్డెంత క్రేజీ ఫాలోయింగ్‌ని సంపాదించేసింది. ఫేస్‌బుక్‌లో కాజల్ ఫాలోయర్ల సంఖ్య అక్షరాలా రెండు కోట్ల నలభై లక్షల మంది అట. ఈ విషయాన్ని తనే స్వయంగా పేర్కొంది. ఈ బ్యూటీ ఎక్కువగా లైవ్ చాట్స్ చేస్తుండడమే బహుశా.. ఇందుకు కారణం అయివుండొచ్చు. తెలుగు, తమిళం, ఇప్పుడు హిందీ.. ఇంతకీ దేనికి ప్రాధాన్యం? అని ఇటీవల కాజల్‌ని కదిలిస్తే- ‘‘నటికి భాషతో పనేంటి? మంచి క్యారెక్టర్ ఏ భాషలో వచ్చినా చేయాలి. ఏ నటి అయినా ఇలాగే చేస్తోంది కూడా. నేనూ అంతే! తెలుగులో, తమిళంలో నేను చేసిన చిత్రాలు, పోషించిన పాత్రలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. బాలీవుడ్‌లో కూడా మన ప్రతాపం ఏంటో చూపాలనుకుంటున్నా. అందుకే అక్కడ కూడా వెరైటీ చిత్రాల్లో మంచి పాత్రలను పోషిస్తున్నా. ఏ భాషలో చేసినా నా తొలి ప్రాధాన్యం మాత్రం టాలీవుడ్‌కే అని అందరికీ తెలిసిందే’’ అంటూ ఎంతో తెలివిగా చెప్పుకొచ్చింది. వామ్మో..కాజల్!

సమీర్