పర్యాటకం

భక్తుని మెచ్చిన భగవంతుడు.. చిలకలపూడి పాండురంగడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ అను శ్రీకృష్ణ భక్తుడొకడు చిలకలపూడిలో నివసిస్తుండేవాడు. ఆయన నిరంతరం భాగవత సేవ చేస్తుండేవారు. చిన్నతనం నుంచి జ్ఞానదేవుడు, నామదేవుడు, తుకారాం లాంటి భక్తుల కథలను వింటూ తన్మయం చెందేవాడు. తాను వారిలాగా భగవంతుడికి ఇష్టుడిగా ఉండాలనుకొని సాధుజన సేవ చేస్తుండేవాడు. అతడు పూర్వ ఋషుల్లాగా చేతనైనంత లోకానికి మేలు చేయాలని అనుకొనేవాడు. బాగా ఆలోచించి దేవాలయాలు పూజా పునస్కారాలు లేకుండా జీర్ణావస్థలోకి జారిపోతున్నాయ కనుక వాటిని బాగు చేద్దామనుకొన్నాడు. అందుకోసం ముందుగా ఒక మఠం స్థాపించాడు. మఠం ద్వారా చాలామంది సేకరించి దేవాలయాల అభివృద్ధి పనులు చేస్తుండేవాడు. దాతల దగ్గర వెళ్లి వారికి అవసరం చెప్పి కూడా వారిచేత కూడా దేవాలయోద్ధరణను సాగిస్తుండేవాడు.
ఆ మఠం ద్వారానే అన్నార్తులకు భోజనసదుపాయాలు కూడా చేసేవాడు. ఆయన సేవను పొందినవారెవరైనా నరసింహుడే అసలైన భక్తుడు అని మెచ్చుకుంటుండేవారు.ఆ భక్త నరసింహ ఒకానొక రోజు జ్ఞానేశ్వర మఠంలో నిద్రిస్తుండగా అపార కరుణామయుడు, అనంతనామధారి, భక్త సులభుడు అయిన శ్రీకృష్ణుడు కనిపించి ‘‘ఓరుూ నరసింహా! నీవు గుడిని నిర్మించు. నేను స్వయంభువునై ఆవిర్భవిస్తాను’’ అని పలికాడు. నరసింహునికి ఒళ్ళు గగుర్పొడిచింది. ఆనందాశ్రువులు కారిపోతున్నాయ. రోమాంచితమైన శరీరంతో కనులు తెరిచి పాహిమాం పాహి మాం పాహి పాహి... కరుణాసింధూ, దీనజనపాల, ఆపద్భాందు ఇంత కరుణ చూపిస్తావా తండ్రీ నాపై అంటూ ఇంకా ఏదేదో అనుకొంటున్నట్టుగా పెదవులు కదిలిస్తూ కన్నీరు కారుస్తున్నాడు. ఈ శబ్దాలకు ఆ మఠం లో నిద్రిస్తున్నవారు మేల్కొన్నారు. నరసింహుని పరిస్థితి ని చూశారు. నరసింహుడు ఏదో కల కంటున్నాడని వారు అనుకొన్నారు. మెల్లమెల్లగా నరసింహా, నరసింహా అంటూ పిలిచారు. కనులు తెరిచి చూశాడు. ఎదురుగా భగవంతుడు లేడు తన చుట్టూ తాను అంతకముందు చూసిన వారున్నారు. అపుడు తనకొచ్చింది కల అని తెలుసుకున్నాడు. ఆ సంగతే వారికి వివరించాడు.
చిలకలపూడి నంతా వెదికి చివరకు అక్కడున్న ఐదు ఎకరాల స్థలాన్ని గుడి కట్టడానికి అనువైనదిగా నిర్ణయించారు. ఇక నరసింహ అత్యంతానందంలో దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ చేశాడు. దేవాలయం పూర్తి కాజొచ్చింది. నరసింహుని దేవుని ఆదేశం ఆనోట ఈనోట పాకి అందరికీ తెలిసిపోయంది. పట్టణాలకు, నగరాలకు కూడా పాకింది. దాంతో భగవానుడు స్వయంగా ఆవిర్భవిస్తానన్న రోజు దగ్గరపడుతోందని చాలామంది నరసింహుడు కట్టుతున్న దేవాలయం దగ్గరకు వచ్చేశారు.
అపుడు మనదేశాన్ని విదేశీయులు పాలిస్తున్నారు. వారుకూడా వచ్చారు. ఇది ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చారు. ఆరోజు రానే వచ్చింది. కొంతమంది ఇది జరగనే జరుగదు అంటున్నారు. మరికొంతమంది భక్తి ఉన్నచోటికి భగవంతుడే తరలివస్తాడు. ఈనరసింహ మంచి భక్తుడు కదా అపుడు దేవుడుఇక్కడికే వస్తాడుఅని అనుకొంటున్నారు. ఇలాంటి వారంతా ఒక చోటికి ఒక చేరారు.
దేవాలయం పూర్తి అయంది. ఇక భగవంతుడు వచ్చి కూర్చునే రోజు వచ్చేసింది. కొందరు అధికారులు ఈ దేవాలయానికి తాళాలు వేయండి దేవుడు వస్తే మనం తలుపు తెరవాలి కదా. అపుడు మనం చూడవచ్చు అనుకొన్నారు. వారు అనుకొన్నట్టు దేవాలయానికి తాళాలు వేశారు. నరసింహుడు భగవంతు డు రావడానికి తాళాలు కావాలా ఆరోజు కావలివారు కూడా నిద్రపోయేట్టు చేసి కారాగారా తలుపుల్ని పగులకొట్టుకుని యశోదమ్మ దగ్గరకు చేరాడు. అట్లాంటి భగవంతుడే వస్తానని చెపితే నేను వీరికి భయపడడం ఏమిటి అనుకొన్నాఋ. భగవంతుడే అన్నింటికీ దిక్కు అనుకున్నాడు.మళ్లీ ఒకవేళ భగవంతుడు రాకపోతే భయం వేసింది. ఇంతమంది నమ్మకం వమ్ము అవుతుంది కదా. అందుకే ఎలాగైనా దేవుణ్ణే తీసుకొని రావలసిందే అనుకొన్నాడు. అంతే ఈ దేవాలయంలోనే నిరాహారియైకూర్చుని కృష్ణుడు చేసిన అద్భుతాలను నెమరేసుకొంటున్నాడు.
అంతలో పెళపెళా అంటూ గొప్పధ్వని గర్భగుడిలో నుంచి వచ్చింది. వెనువెంటనే తలుపులు తెరుచుకొన్నాయి. భక్తులందరి కళ్లు ఆనందాశ్రువులను రాల్చుతున్నాయి. ఎదురుగుండా పండరీపురంలోని పాండురంగడు దర్శనమిచ్చాడు. ఇక భక్తులు, అధికారులు అందరూ చేతులు ఎత్తి మొక్కుతూ జై పాండు రంగా! జై పాండురంగా! అంటూ భక్తపారవశ్యంతో తన్మయంగా పాండురంగని దర్శనం చేసుకొంటున్నారు. ఆ రోజు కార్తిక శుద్ద ఏకాదశి. కనుక చిలకలపూడి లో పాండురంగ దేవాలయంలో కార్తిక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భక్త నరసింహ కట్టించిన పాండురంగ దేవాలయంతో పాటుగా కాలక్రమేణా రాముడు, విఘ్నేశ్వరుడు, శివపార్వతులు, సాయి బాబా మొదలైన దేవతలకు మందిరాలు నెలకొన్నాయి. ఆనాటి నుంచి జ్ఞానేశ్వర మఠం నుంచి సామాజిక సేవ భక్త జనుల సేవ చేస్తున్నది. పాండురంగడి దేవాలయ నిర్మాణం, భక్తుల కోరిక మేరకు ఆవిర్భవించిన పాండురంగడి సౌందర్యాన్ని చూసి తీరవలసిందే కాని వర్ణించడానికి మాటలు చాలవు.

- ఎన్. సాయలక్ష్మి